AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSPSC Group 4 Exam: గ్రూప్‌ 4 పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులకు ముఖ్య సూచనలు.. ఈ తప్పులు చేస్తే నో ఎంట్రీ

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూన్‌ 1న గ్రూప్‌ 4 పరీక్ష జరగనుంది. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 9.51 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. జూన్‌ 24 నుంచి హాల్‌టికెట్లు కూడా అందుబాటులో ఉంచారు. భారీ సంఖ్యలో అభ్యర్థులు..

TSPSC Group 4 Exam: గ్రూప్‌ 4 పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులకు ముఖ్య సూచనలు.. ఈ తప్పులు చేస్తే నో ఎంట్రీ
TSPSC Group 4 Exam
Srilakshmi C
|

Updated on: Jun 25, 2023 | 1:36 PM

Share

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూన్‌ 1న గ్రూప్‌ 4 పరీక్ష జరగనుంది. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 9.51 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. జూన్‌ 24 నుంచి హాల్‌టికెట్లు కూడా అందుబాటులో ఉంచారు. భారీసంఖ్యలో అభ్యర్థులు హాజరుకానున్న నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. గ్రూప్‌-4 పరీక్ష ప్రారంభానికి రెండు సెషన్లలో 15 నిమిషాల ముందు గేట్లు మూసివేయనున్నారు. అంటే ఉదయం జరిగే పేపర్‌-1కు 9.45 గంటలు, మధ్యాహ్నం జరిగే పేపర్‌-2కు 2.15 గంటల తర్వాత పరీక్ష కేంద్రంలోకి ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించరు. ఉదయం జరిగే పేపర్‌ 1కు ఉదయం 8 గంటల నుంచి పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం జరిగే పేపర్‌-2కు 1 గంట నుంచి అభ్యర్థులను అనుమతిస్తారు. పేపర్‌ 1 జనరల్‌ స్టడీస్‌ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉంటుంది. పేపర్‌ 2 (సెక్రటేరియల్‌ ఎబిలిటీస్‌) మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది.

ముఖ్యమైన సూచనలు ఇవే..

  • నామినల్‌ రోల్‌లో సంతకం చేశాక, ఎడమచేతి బొటన వేలిముద్ర తీసుకుని పరీక్ష హాల్‌లోకి ప్రవేశం కల్పిస్తారు. ప్రతి సెషన్‌ పరీక్ష ముగిసిన అనంతరం ఓఎంఆర్‌ షీట్‌ను ఇన్విజిలేటర్‌కు అందజేసిన తర్వాత మళ్లీ వేలిముద్ర వేయాలి.
  • ప్రతి అరగంటకోసారి అభ్యర్థులకు సమయాన్ని గుర్తుచేస్తూ బెల్‌ మోగిస్తారు. పరీక్ష ముగిసే సమయానికి 5 నిమిషాల ముందు చివరిసారిగా హెచ్చిరిక బెల్‌ మోగిస్తారు.
  • అభ్యర్ధులెవరూ ప్రశ్నపత్రంపై సమాధానాలు మార్క్‌ చేయకూడదని కమిషన్‌ స్పష్టం చేసింది.
  • ఎలక్ట్రానిక్‌ పరికరాలు, రిమోట్‌తో కూడిన కారు తాళాలు, ఇతర వస్తువులేవీ లోపలికి అనుమతి ఉండదు. చెప్పులు మాత్రమే ధరించాలి. షూ వేసుకున్నవారిని అనుమతించారు.
  • ఓఎంఆర్‌ పత్రంలో బ్లూ లేదా బ్లాక్‌ పెన్‌తో పేరు, పరీక్ష కేంద్రం కోడ్, హాల్‌టికెట్, ప్రశ్నపత్రం నంబరు రాయాలని కమిషన్‌ తెలిపింది.
  • హాల్‌టికెట్, ప్రశ్నపత్రం నంబరు సరిగా రాయకున్నా, బ్లూ బ్లాక్‌ బాల్‌పాయింట్‌ పెన్‌కాకుండా ఇంక్‌పెన్, జెల్‌పెన్, పెన్సిల్‌ ఉపయోగించినా సదరు ఓఎంఆర్‌ పత్రం చెల్లుబాటుకాదని స్పష్టం చేసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
కస్తూర్బా స్కూల్ వైరల్ వీడియో: దేవతలు, దయ్యాలు అంటూ విద్యార్థిని
కస్తూర్బా స్కూల్ వైరల్ వీడియో: దేవతలు, దయ్యాలు అంటూ విద్యార్థిని
రైస్ + చపాతీ కాంబినేషన్ మంచిదా?ఆరోగ్య నిపుణులు చెప్పిన అసలు విషయం
రైస్ + చపాతీ కాంబినేషన్ మంచిదా?ఆరోగ్య నిపుణులు చెప్పిన అసలు విషయం
ఈ వింత ఘటన వెనుక అసలు కథేంటి..?
ఈ వింత ఘటన వెనుక అసలు కథేంటి..?
మీ హైబీపీని చిటికెలో తగ్గించే పవర్.. దానిమ్మ vs బీట్‌రూట్‌..
మీ హైబీపీని చిటికెలో తగ్గించే పవర్.. దానిమ్మ vs బీట్‌రూట్‌..
నీచ రవితో ఈ రాశులకు దశ తిరిగే ఛాన్స్..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?
నీచ రవితో ఈ రాశులకు దశ తిరిగే ఛాన్స్..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?
ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా దంచేశాడయ్యా..!
ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా దంచేశాడయ్యా..!
ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలు సగం ధరకే.. అద్భుతమైన ఆఫర్లు!
ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలు సగం ధరకే.. అద్భుతమైన ఆఫర్లు!
అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్..
అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్..
నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు..
నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు..
నవరాత్రులు స్పెషల్.. అమ్మ వారికీ కచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యం
నవరాత్రులు స్పెషల్.. అమ్మ వారికీ కచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యం