AP Govt Hospital Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఒకేసారి రెండు జాబ్‌ నోటిఫికేషన్లు జారీ చేసిన ప్రభుత్వం

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుత్రుల్లో డాక్టర్ కొలువుల భర్తీకి కూటమి సర్కార్ రెండు నోటిఫికేషన్లు ఒకేసారి జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు డిసెంబర్ 4వ తేదీ నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకవచ్చు..

AP Govt Hospital Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఒకేసారి రెండు జాబ్‌ నోటిఫికేషన్లు జారీ చేసిన ప్రభుత్వం
AP Govt Hospital Jobs
Follow us
P Kranthi Prasanna

| Edited By: Srilakshmi C

Updated on: Dec 03, 2024 | 2:00 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుత్రుల్లో భారీగా డాక్టర్ల పోస్టుల భర్తీకి వైద్య ఆరోగ్య శాఖ నోటిఫికేషన్లు జారీ చేసింది. ఈ పోస్టుల భర్తీకి విడివిడిగా రెండు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ పరిధిలో, ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు 280 సివిల్ అసిస్టెంట్ సర్జన్ల ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ ఖాళీల్లో రెగ్యులర్‌ ప్రాతిపదికన జరిగే నియామకాలతో పాటు బ్యాక్‌లాగ్ పోస్టులు కూడా కలిసి ఉన్నాయి. నోటిఫికేషన్‌ ప్రకారం, ఎంపికైన వారిని పీహెచ్‌సీలు/ ఇతర వైద్య సంస్థల్లో నియమిస్తారు. అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తులు డిసెంబర్ 4 నుంచి ప్రారంభమవుతాయి. డిసెంబర్‌ 13 వరకు దరఖాస్తుకు అవకాశం ఉంటుంది.

సెకండరీ ఆసుపత్రుల్లో 97 డాక్టర్ పోస్టుల భర్తీకి మరో నోటిఫికేషన్‌

డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ (ఏపీవీవీపీ) పరిధిలో 97 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్/సివిల్ అసిస్టెంట్ సర్జన్ (జనరల్) ఖాళీల కోసం మరో నోటిఫికేషన్‌ జారీ అయింది. వీటిలోనూ రెగ్యులర్‌, బ్యాక్‌లాగ్ పోస్టులు కలిసి ఉన్నాయి. అర్హతలు, వివరణాత్మక మార్గదర్శకాలు http://apmsrb.ap.gov.in/msrb/, https://hmfw.ap.gov.in, https://cfw.ap.nic.in వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉన్నాయి. దరఖాస్తు ఫారం కూడా ఆన్‌లైన్‌లోనే పూర్తి చేయవల్సి ఉంటుంది. ఈ పోస్టులకు కూడా డిసెంబర్ 4 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. డిసెంబర్‌ 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.