Andhra Pradesh: విద్యారంగం బలోపేతానికి జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ఇకపై ప్రతీ మండలానికి ఇద్దరు…
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో అధికారికంలోకి వచ్చిన నాటి నుంచి వైసీపీ ప్రభుత్వం విద్యారంగం బలోపేతానికి తీవ్ర కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నాడు-నేడు, జగనన్న విద్యా కానుక, అమ్మ ఒడి పథకాలతో విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి పెట్టిన జగన్ సర్కారు...
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో అధికారికంలోకి వచ్చిన నాటి నుంచి వైసీపీ ప్రభుత్వం విద్యారంగం బలోపేతానికి తీవ్ర కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నాడు-నేడు, జగనన్న విద్యా కానుక, అమ్మ ఒడి పథకాలతో విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి పెట్టిన జగన్ సర్కారు తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్న ప్రతీ మండలానికి ఇద్దరు ఎంఈఓ పోస్టులను మంజూరు చేస్తూ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఇందులో భాగంగా ఏపీ ప్రభుత్వం రాష్ట్రం మొత్తం మీద 679 ఎంఈఓ-2 పోస్టులను మంజూరు చేసింది. దీంతో ఇకపై రాష్ట్రంలో ప్రతీ మండలానికి ఇద్దరు ఎంఈఓలు ఉండనున్నారు. ఎంఈఓ-1 బోధనా పర్యవేక్షణ కోసం కాగా, ఎంఈఓ-2 బోధనేతర కార్యక్రమాలను పర్యవేక్షించనున్నారు. గతంలో ఉన్న 666 పోస్టులను ఎంఈఓ-1 గా మారుస్తూ అదనంగా మరో 13 పోస్టులు కల్పించారు. ఈ నిర్ణయంతో ఇకపై పాఠశాలల్లో విద్యతో పాటు ఇతర కార్యక్రమాల్లోనూ మెరుగైన పనితీరు కనిపించనుందని అధికారులు చెబుతున్నారు. విద్యాశాఖను మరింత పటిష్టం చేసే దిశలో అదనపు మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు తోడ్పడుతారని ప్రభుత్వం భావిస్తోంది.
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..