Viral News: విద్యార్థిని కాలితో తన్నిన లెక్చరర్‌పై ఇంటర్ బోర్డ్ సీరియస్.. కాలేజీ గుర్తింపు రద్దు విషయంలో…
Viral News: విజయవాడలో బెంజ్ సర్కిల్లో ఉన్న శ్రీ చైతన్య కళాశాల భాస్కర్ భవన్ క్యాంపస్‌లో ఓ లెక్చరర్ విద్యార్థిని కాలితో తన్నిన అంశం పెద్ద చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. క్లాస్ రూమ్‌లో మాట్లాడాడని ఓ విద్యార్థిని అధ్యాపకుడు చెంపలు వాయించడంతో పాటు...
Viral News: విజయవాడలో బెంజ్ సర్కిల్లో ఉన్న శ్రీ చైతన్య కళాశాల భాస్కర్ భవన్ క్యాంపస్‌లో ఓ లెక్చరర్ విద్యార్థిని కాలితో తన్నిన అంశం పెద్ద చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. క్లాస్ రూమ్‌లో మాట్లాడాడని ఓ విద్యార్థిని అధ్యాపకుడు చెంపలు వాయించడంతో పాటు, కాలితో తన్నిన ఘటన శుక్రవారం వైరల్‌గా మారింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఈ విషయం కాస్త ఏపీ ఇంటర్ బోర్డ్ వరకు చేరింది.
దీంతో ఇంటర్ బోర్డ్ చర్యలకు పూనుకుంది. శ్రీ చైతన్య కళాశాల భాస్కర్ క్యాంపస్ కు ఏపీ ఇంటర్ బోర్డ్ జాయింట్ సెక్రటరీ షోకాజ్ నోటీసులు జారీచేశారు. దాడి ఘటనలో కాలేజి గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో 5 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. ఈ విషయమై ఇంటర్ బోర్డ్ విద్యామండలి జాయింట్ సెక్రటరీ జీఎస్ఆర్ కృష్ణారావు మాట్లాడుతూ.. ‘శుక్రవారం సాయంత్రం ఇంటర్మీడియట్ విద్యామండలికి ఫిర్యాదు వచ్చింది. లెక్చలర్ రవికుమార్, ప్రిన్సిపాల్ వద్ద వివరాలు తీసుకున్నాం. ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖాధికారి సీఎస్ఎన్ రెడ్డి, ఆర్ఐఓ రవికుమార్, చైల్డ్ లైన్ అధికారులతో విచారణ చేశాము. చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటాం.
ఈ విషయమై చైతన్య కాలేజ్ కు షోకాజ్ నోటీస్ ఇచ్చాము. సరైన వివరణ ఇవ్వకపోతే గుర్తింపు రద్దు చేస్తాం. పొక్సో యాక్టు సహా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. విద్యాచట్టం ప్రకారం కానీ హింసించడం నేరం. ఏ కారణంతో చేసిన అమానుష ఘటనను ఉపేక్షించబోము’ అని హెచ్చరించారు.
వైరల్ అయిన వీడియో ఇదే..
Sri chaithanya Bhaskar bhavan #Vijayawada.@ysjagan@AndhraPradeshCM@APPOLICE100 pic.twitter.com/yKyAKzvHdJ
— ??????????? ???????? (@hari_bheemani) September 16, 2022
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..