Srivari Brahmotsavas: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. బ్రహ్మోత్సవాల వాహన సేవల సమయంలో మార్పులు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

స్వామివారు విహరించే ఆలయ మాడ వీధులతో పాటు.. తిరుమల క్షేత్రం అందంగా ముస్తాబైంది. కనులకు విందు చేసే విధంగా విద్యుత్ దీప కాంతులు, రంగు రంగుల పువ్వుల వంటి వివిధ రకాలుగా అలంకరించుకుంది..

Srivari Brahmotsavas: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. బ్రహ్మోత్సవాల వాహన సేవల సమయంలో మార్పులు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Srivari Brahmotsavas
Follow us
Surya Kala

|

Updated on: Sep 17, 2022 | 2:28 PM

Srivari Brahmotsavas: కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతిలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు మొత్తం తొమ్మిది రోజులు కన్నులపండువగా జరుగుతాయి. రెండేళ్ల తర్వాత భ‌క్తుల స‌మ‌క్షంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వ‌హించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 27 నుండి అక్టోబ‌రు 5వ తేదీ వ‌ర‌కు జరగణాలున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారి ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి 9 రోజుల పాటు 16 వాహనాలపై ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. కోవిడ్ కార‌ణంగా గత రెండేళ్ల‌పాటు ఆల‌యంలో ఏకాంతంగా బ్ర‌హ్మోత్స‌వాలు నిర్వ‌హించిన సంగతి తెలిసిందే. ఈ సారి భక్తుల సమక్షంలో బ్రహ్మోత్సవాలు జరగనుండడంతో అన్ని ప్రాంతాల భక్తులు భారీ సంఖ్యలో హాజరుకానున్నారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అందుకు తగిన ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ. అంతేకాదు  20వ తేదీ నాటికి అన్ని పనులు పూర్తి చేసే దిశగా పనుల వేగం పెంచింది.

స్వామివారు విహరించే ఆలయ మాడ వీధులతో పాటు.. తిరుమల క్షేత్రం అందంగా ముస్తాబైంది. కనులకు విందు చేసే విధంగా విద్యుత్ దీప కాంతులు, రంగు రంగుల పువ్వుల వంటి వివిధ రకాలుగా అలంకరించుకుంది.. దేదీప్యమానంగా వెలిగిపోతోంది తిరుమల క్షేత్రం. భారీ సంఖ్యలో భక్తులు రానున్నారని అంచనా నేపథ్యంలో పటిష్టమైన బ్యారికేడ్‌ వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది.  తిరుమల గిరులపై భక్తుల సౌకర్యాలను కల్పింస్తుంది. కా టేజీలు, ఆఫీసులు, భక్తులు రద్దీగా ఉండే ప్రాంతాల్లో విద్యుత్‌ దీపాలు, లైటింగ్‌ కటౌట్లను ఏర్పాటు చేస్తోంది.

ప్రత్యేక కార్యక్రమాలు:

ఇవి కూడా చదవండి

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవ సందర్భంగా వాహన సేవలు జరిగే సమయంలో సాంప్రదాయ కళారూపాల ప్రదర్శనకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ కళారూపాలు భక్తులకు కనుల విందు చేయనున్నాయి.  దేశంలోని ఏడూ రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి చెందిన కళాకారులు వాహన సేవల్లో పాల్గొననున్నారు. తమ తమ కళానృత్య ప్రదర్శన చేయనున్నారు. వాహన సేవల సమయంలో ప్రముఖ పండితులు తమ వ్యాఖ్యానం ద్వారా వాహన సేవల విశిష్టతను తెలియజేయనున్నారు.

బ్రహ్మోత్సవాల సమయంలో వాహన సేవల సమయాల్లో మార్పు: 

బ్రాహ్మోత్సవాల సమయంలో వాహన సేవలు ఉదయం, రాత్రి 9 గంటల సమయంలో నిర్వహించేవారు. అయితే ఈ ఏడాది రాత్రి వాహన సేవల సమయంలో టీటీడీ మార్పులు చేసింది. ఈ ఏడాది ఉదయం వాహన సేవలు 8 గంటలకు నిర్వహించనుండగా.. రాత్రి 7 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ నెల 26 రాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుండగా.. 27న సాయంత్రం 5.15 నుంచి 6.15 గంటల వరకు శ్రీవారికి ధ్వజారోహణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 27వ తేదీ సాయంత్రం 7గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం జగన్ పట్టు వ్రస్తాలను సమర్పించనున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..