Pakistan-Sivalingam: పాకిస్తాన్‌లో అద్భుతం.. నానాటికి పెరుగుతున్న శివలింగం.. చూసేందుకు ఎగబడుతున్న జనం..
దాయాది దేశం పాక్‌లో ఉన్న ఓ శివాలయం గురించి ఇప్పడు మనం తెలుసుకోబోతున్నాం. ఈ ఆలయం నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. శంభో శంకర.. హర హర మహాదేవ
దాయాది దేశం పాక్‌లో ఉన్న ఓ శివాలయం గురించి ఇప్పడు మనం తెలుసుకోబోతున్నాం. ఈ ఆలయం నిత్యం భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. శంభో శంకర.. హర హర మహాదేవ అంటూ ఆ ప్రాంతమంతా శివ నామస్మరణలో మార్మోగిపోతుంది. అవును.. సింధ్ రాష్ట్రం ఉమర్‌కోట్ లో ఈ శివాలయం ఉంది. ఉమర్‌కోట్ సిటీలో దాదాపు 80 శాతం మంది హిందువులు ఉన్నారు. దేశ విభజన సమయంలో వివిధ కారణాల వల్ల వీరంతా అక్కడే ఉండటానికి మొగ్గుచూపారు. అందుకే ఈ ఆలయం నిత్యం భక్తులతో అలరారుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే.. ఇక్కడి శివలింగానికి ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే… ఇక్కడి శిలింగం నానాటికి పెరుగతూ వస్తుంది. మొదట్లో శివలింగం ఎలా ఉండేదో ఆ పరిమాణాన్ని ఓ గీత మాదిరిగా గీశారు. ఇప్పుడు ఆ గీతను దాటి శివలింగం పెరగడం స్పష్టంగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పండితులు.. భక్తులు చెబుతున్న వివరాల ప్రకారం.. కొందరు పశువుల కాపర్లు.. తమ పశువులను మేపేందుకు ఇప్పుడు శివలింగం ఉన్న ప్రాంతానికి వచ్చేవారు. అప్పుడు అక్కడ పెద్ద పెద్ద పచ్చిక మైదానాలు ఉండేవి. ఈ క్రమంలో మందలోని కొన్ని ఆవులు.. ఓ ప్రాంతానికి వెళ్లి వాటంతట అవే పాలివ్వడాన్ని గమనించారు. అక్కడికి వెళ్లి చూడగా వారికి శివలింగం దర్శనమిచ్చింది. అప్పటి నుంచి అక్కడ పూజలు ప్రారంభమయ్యాయి. శివరాత్రి సమయంలో భక్తుల రద్దీ ఇక్కడ విపరీతంగా ఉంటుంది. ఆలయాన్ని కూడా చాలా చక్కగా వృద్ధి చేశారు. ఎటువంటి మత వైష్యమాలు తమ మధ్య ఉండవని అక్కడి హిందువులు, ముస్లింలు చెబుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Auntys dance video: అట్లుంటది మరి ఆంటీస్ రంగంలోకి దిగితే.. దుమ్ములేచిపోవాల్సిందే.. ఆంటీలు మీరు కేక..
Variety Thief video: వీడో వెరైటీ దొంగ.. ఏం దొంగతనం చేశాడో చూస్తే ఆశ్చర్యపోవడమే కాదు.. ఛీ.. అంటారు..