AP TET 2024 Exam Date: బాబోయ్.. ఏపీ టెట్‌కు పోటెత్తిన దరఖాస్తులు! ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారో తెలుసా?

ఆంధ్రప్రదేశ్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌) 2024కు దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఆగస్టు 3వ తేదీతో దరఖాస్తు ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సారి టెట్‌ పరీక్షకు ఏకంగా 4 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ పోస్టులకు అర్హత పరీక్ష అయిన పేపర్‌ 1-ఎకు 1,82,609 మంది దరఖాస్తు చేసుకున్నారు. సెకెండరీ గ్రేడ్‌టీచర్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్ పేపర్‌ 1 బికు 2,662 మంది చొప్పున దరఖాస్తులు..

AP TET 2024 Exam Date: బాబోయ్.. ఏపీ టెట్‌కు పోటెత్తిన దరఖాస్తులు! ఎంత మంది దరఖాస్తు చేసుకున్నారో తెలుసా?
AP TET 2024 Exam
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 06, 2024 | 6:28 AM

అమరావతి, ఆగస్టు 6: ఆంధ్రప్రదేశ్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌) 2024కు దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఆగస్టు 3వ తేదీతో దరఖాస్తు ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సారి టెట్‌ పరీక్షకు ఏకంగా 4 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ పోస్టులకు అర్హత పరీక్ష అయిన పేపర్‌ 1-ఎకు 1,82,609 మంది దరఖాస్తు చేసుకున్నారు. సెకెండరీ గ్రేడ్‌టీచర్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్ పేపర్‌ 1 బికు 2,662 మంది చొప్పున దరఖాస్తులు వచ్చాయి. ఇక స్కూల్‌ అసిస్టెంట్‌ టీచర్‌ పోస్టులకు అర్హత పరీక్ష అయిన పేపర్‌ 2-ఎ లాంగ్వేజెస్‌కు 64,036 మంది దరఖాస్తు చేసుకోగా.. మ్యాథ్స్‌ అండ్‌ సైన్స్‌కు అత్యధికంగా 1,04,788 మంది అప్లై చేసుకున్నారు. మొత్తం 4,27,300 మంది దరఖాస్తు చేసుకున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. ఈ మేరకు దరఖాస్తుల వివరాలను వెల్లడించింది. సోషల్‌ స్టడీస్‌ పేపర్‌కు సంబంధించి 70,767 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. స్కూల్‌ అసిస్టెంట్‌ టీచర్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్ పేపర్‌ 2- బి విభాగంలో 2,438 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. ఈసారి మెగా డీఎస్సీలో పోస్టుల సంఖ్య అత్యధికంగా ఉండటంతో పోటీపడే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

టెట్‌ పరీక్షలు ఆన్‌లైన్‌లో నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలు గతంలో నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారమే అక్టోబర్‌ 3 నుంచి 20 వరకు నిర్వహిస్తామని.. పరీక్షల తేదీల్లో ఎలాంటి మార్పు ఉండబోదని, అభ్యర్థులంతా సన్నద్ధం కావాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ విజయరామరాజు ఓ ప్రకటనలో వెల్లడించారు. కాగా రాష్ట్రంలో 16,347 టీచర్‌ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీకి త్వరలో విద్యాశాఖ నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. ఈ పోస్టుల భర్తీకి ఏపీ సర్కార్‌ మరోసారి టెట్‌ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఇందుకు సంబంధించి ఈ ఏడాది జులై 2వ తేదీన టెట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చిన విద్యాశాఖ ఆగస్టు 3 వరకు దరఖాస్తులు స్వీకరించింది. అలాగే పరీక్షల సన్నద్ధతకు కూడా మరింత సమయం ఇచ్చింది. దాదాపు 3 నెలల గడువు ఇస్తున్నట్లు ప్రకటించింది కూడా. ఈ మేరకు టెట్‌ షెడ్యూల్‌లో పలు మార్పులు చేసింది. పాత నోటిఫికేషన్‌ ప్రకారం ఆగస్టు 5 నుంచి 20 వరకు టెట్‌ పరీక్షలు జరగాల్సి ఉంది. ఈ తేదీలను అక్టోబర్‌ 3 నుంచి 20 వరకు నిర్వహించాలని నిర్ణయిస్తూ ప్రకటన జారీ చేసింది. డీఎస్సీలో టెట్‌కు 20 శాతం వెయిటేజీ ఉండటంతో ఈ పరీక్షలో స్కోరు పెంచుకొనేందుకు ఈసారి భారీగా పోటీపడుతున్నారు. టెట్ హాల్‌ టికెట్లు సెప్టెంబర్ 22 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.