Exams in August Month: ఆగస్టులో జరిగే రాత పరీక్షలు ఇవే.. ఏయే తేదీల్లో ఏయే పరీక్షలు ఉన్నాయంటే
దేశవ్యాప్తంగా పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నియామక సంస్థలు పలు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్‌లను విడుదల అయ్యాయి. అర్హులైన అభ్యర్థులందరూ కొన్ని పోస్టులకు ఇప్పటికే దరఖాస్తు చేసుకోగా.. మరికొన్ని పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. దరఖాస్తులు పూర్తైన పోస్టులకు త్వరలోనే నిర్వహించనున్న పరీక్షలకు అభ్యర్ధులు ముమ్మరంగా..
హైదరాబాద్, ఆగస్టు 5: దేశవ్యాప్తంగా పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నియామక సంస్థలు పలు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్‌లను విడుదల అయ్యాయి. అర్హులైన అభ్యర్థులందరూ కొన్ని పోస్టులకు ఇప్పటికే దరఖాస్తు చేసుకోగా.. మరికొన్ని పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. దరఖాస్తులు పూర్తైన పోస్టులకు త్వరలోనే నిర్వహించనున్న పరీక్షలకు అభ్యర్ధులు ముమ్మరంగా సన్నద్ధమవుతున్నారు. అయితే ఆగస్టు నెలలో పలు ఉద్యోగ, ప్రవేశ ప్రకటనలకు సంబంధించి జరగబోయే పరీక్షల వివరాలు, వాటి తేదీలు ఇక్కడ తెలుసుకుందాం..
ఆగస్టులో జరగనున్న పరీక్షల తేదీలు ఇవే..
- ఆగస్టు 3, 4, 10, 17, 18 తేదీల్లో ఐబీపీఎస్ ఆర్‌ఆర్‌బీ ఆఫీస్ అసిస్టెంట్/ ఆఫీసర్ ప్రిలిమ్స్ పరీక్షలు జరగనున్నాయి.
- ఆగస్టు 9, 10, 11 తేదీల్లో ఆన్‌లైన్ విధానంలో ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ ఏఎఫ్‌క్యాట్ 2024 పరీక్ష జరుగుతుంది.
- ఆగస్టు 3, 10, 11 తేదీల్లో సీబీఎస్‌ఈ గ్రూప్ ఎ, బి, సి రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్ జరుగుతుంది.
- ఆగస్టు 5వ తేదీన ఆర్‌సీఎఫ్‌ఎల్ మేనేజ్‌మెంట్ ట్రెయినీ ఎగ్జామ్ జరుగుతుంది.
బీఏ యానిమేషన్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానం.. ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థులు అర్హులు
తెలంగాణలోని చేవెళ్లలో ఉన్న బీసీ గురుకుల ఫైన్‌ఆర్ట్స్ కాలేజీలో బీఏ యానిమేషన్, వీఎఫ్‌క్స్ కోర్సులో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆగస్టు 17వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి బి సైదులు ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు బీసీ గురుకుల వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. దరఖాస్తును పూర్తి చేసి తర్వాత అప్లికేషన్ ఫాంను డౌన్‌లోడ్ చేసుకుని, mjpanimation45@gmail.comకు ఈ-మెయిల్‌కు సెండ్ చేయాలని తెలిపారు. అలాగే ఆ దరఖాస్తును ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ స్కూల్ మియాపూర్ (జీ), మోడల్ కాలనీ, చేవెళ్ల, రంగారెడ్డి చిరునామాకు పోస్ట్ ద్వారా కూడా పంపించవల్సి ఉంటుంది. ఇతర వివరాలకు 9032644463, 9063242329 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు.