AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP TRANSCO Jobs: ఏపీ విద్యుత్తు శాఖలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం.. ఎలాంటి రాత పరీక్ష లేదు

రాష్ట్ర నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ శాఖలో పలు ఉద్యోగాల భర్తీకి ట్రాన్స్ కో నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా నేరుగా విద్యార్హతల ఆధారంగా ఎంపిక చేయనున్నారు..

AP TRANSCO Jobs: ఏపీ విద్యుత్తు శాఖలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం.. ఎలాంటి రాత పరీక్ష లేదు
AP TRANSCO
Srilakshmi C
|

Updated on: Nov 24, 2024 | 3:41 PM

Share

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ శాఖలో పలు ఉద్యోగాల భర్తీకి ఏపీ ట్రాన్స్‌కో ప్రకటన జారీ చేసింది. ఈ మేరకు విజయవాడలోని ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్‌ ఉద్యోగ నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్‌ కింద కాంట్రాక్ట్ ప్రాతిపదికన ట్రాన్‌కో, ఏపీపీసీసీలో కార్పొరేట్ లాయర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆఫ్‌లైన్‌ దరఖాస్తులకు డిసెంబర్‌ 10, 2024వ తేదీని చివరి తేదీగా నిర్ణయించింది. ఈ ప్రకటన కింద మొత్తం 5 కార్పొరేట్ లాయర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిల్లో ట్రాన్‌కో పోస్టులు ఒకటి, ఏపీపీసీసీలో కార్పొరేట్ లాయర్ పోస్టులు నాలుగు ఉన్నాయి.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ లేదా ఎల్‌ఎల్‌ఎం లేదా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ లా కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే బార్‌ కౌన్సిల్‌లో నాలుగేళ్ల ఉద్యోగానుభవం ఉండాలి. ఎలాంటి వయోపరిమితి లేదు. ఏడాది కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తారు. ఎంపికైన వారికి ప్రొఫెషనల్ ఫీజు కింద నెలకు రూ.1,20,000 వరకు చెల్లిస్తారు. ఆసక్తి కలిగిన వారు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ప్రకటన ఇచ్చిన తేదీ నుంచి 21 రోజులలోపు దరఖాస్తులను ఈ కింది అడ్రస్‌కు పంపించాలి. నోటిఫికేషన్ నవంబర్‌ 19, 2024వ తేదీన జారీ చేశారు. ఎలాంటి రాత పరీక్ష ఉండదు. విద్యార్హతలు, ఉద్యోగానుభవం, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్:

The Chairman and Managing Director, APTRANSCO, Vidyut Soudha, Gunadala, Vijayawada -520004.

ఇవి కూడా చదవండి

(చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, ఏపీ ట్రాన్స్‌కో, విద్యుత్ సౌధ, గుణదల, విజయవాడ-520004)

ఏపీ ట్రాన్స్‌కోలో ట్రాన్‌కో, ఏపీపీసీసీలో కార్పొరేట్ లాయర్ పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

చిన్న వయసులోనే తెల్ల జుట్టు ఎందుకొస్తుంది.. అసలు నిజాలు తెలిస్తే
చిన్న వయసులోనే తెల్ల జుట్టు ఎందుకొస్తుంది.. అసలు నిజాలు తెలిస్తే
బట్టతల, పల్చటి జుట్టును ఒత్తుగా మార్చే సింపుల్ చిట్కాలు..!
బట్టతల, పల్చటి జుట్టును ఒత్తుగా మార్చే సింపుల్ చిట్కాలు..!
అసలే అమావాస్య అర్ధరాత్రి.. కల్లాపి కోసం ఇంటి వరండాలోకి..
అసలే అమావాస్య అర్ధరాత్రి.. కల్లాపి కోసం ఇంటి వరండాలోకి..
3 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. కట్‌చేస్తే.. గంభీర్, సూర్య స్కెచ్‌కు బలి
3 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. కట్‌చేస్తే.. గంభీర్, సూర్య స్కెచ్‌కు బలి
రేషన్ కార్డులేనివారికి బంపర్ ఛాన్స్.. ప్రభుత్వం మళ్లీ అవకాశం
రేషన్ కార్డులేనివారికి బంపర్ ఛాన్స్.. ప్రభుత్వం మళ్లీ అవకాశం
స్పీ బాలు చెప్పిన మాటలు.. మరోసారి మీ ముందుకు..
స్పీ బాలు చెప్పిన మాటలు.. మరోసారి మీ ముందుకు..
ఘోర ప్రమాదం.. ట్రాక్ తప్పిన రైళ్లు.. చెల్లాచెదురైన బతుకులు..
ఘోర ప్రమాదం.. ట్రాక్ తప్పిన రైళ్లు.. చెల్లాచెదురైన బతుకులు..
నో రూల్స్ అంటున్న సమంత, నయన్, రష్మిక..కాన్సట్రేషన్ అంతా దాని మీదే
నో రూల్స్ అంటున్న సమంత, నయన్, రష్మిక..కాన్సట్రేషన్ అంతా దాని మీదే
హెచ్ఐవీ భయంతో మరణించిన మానవత్వం..! తల్లి శవంతో పదేళ్ల బాలుడు..
హెచ్ఐవీ భయంతో మరణించిన మానవత్వం..! తల్లి శవంతో పదేళ్ల బాలుడు..
శివుడికి ఇష్టమైన 5 రాశులు ఇవే.. వీరికి ఏ లోటూ రానివ్వడు!
శివుడికి ఇష్టమైన 5 రాశులు ఇవే.. వీరికి ఏ లోటూ రానివ్వడు!