AP TET (July) 2024: ఇవాళ్టి నుంచి ఏపీ టెట్‌ ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం.. త్వరలోనే పరీక్ష తేదీలు వెల్లడి

ఆంధ్రప్రదేశ్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌) జులై 2024కు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. నిన్నటి నుంచి ఫీజు చెల్లింపులు ప్రారంభంకాగా నేటి నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరణ మొదలైంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు జులై 4 నుంచి జులై 17, 2024వ తేదీ వరకు టెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే టెట్‌ పరీక్షకు, డీఎస్సీకి సన్నద్ధం కావడానికి మరింత సమయం ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం జులై 3న ప్రకటించింది. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది..

AP TET (July) 2024: ఇవాళ్టి నుంచి ఏపీ టెట్‌ ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం.. త్వరలోనే పరీక్ష తేదీలు వెల్లడి
Andhra Pradesh TET July 2024 online Registration
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 04, 2024 | 2:43 PM

అమరావతి, జులై 4: ఆంధ్రప్రదేశ్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌) జులై 2024కు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. నిన్నటి నుంచి ఫీజు చెల్లింపులు ప్రారంభంకాగా నేటి నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు స్వీకరణ మొదలైంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు జులై 4 నుంచి జులై 17, 2024వ తేదీ వరకు టెట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే టెట్‌ పరీక్షకు, డీఎస్సీకి సన్నద్ధం కావడానికి మరింత సమయం ఇస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం జులై 3న ప్రకటించింది. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఆ ప్రకారంగానే త్వరలోనే టెట్‌, డీఎస్సీ పరీక్షల తేదీలను ప్రకటించనుంది. ఈ ప్రక్రియ మొత్తం 6 నెలల్లోనే పూర్తి చేసేలా కార్యచరణ రూపొందిస్తున్నారు. కొత్తగా బీఈడీ, డీఎడ్‌ పూర్తి చేసుకున్న వారికి కూడా మెగా డీఎస్సీలో అవకాశం కల్పించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇప్పటికే మంత్రి లోకేష్‌ వెల్లడించారు.

టెట్‌, మెగా డీఎస్సీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు మరింత సమయం కావాలని పలువురు విద్యార్థి, యువజన సంఘాల నేతలు, ఎమ్మెల్సీలు లోకేశ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రిపరేషన్‌కు సమయం ఇస్తే బాగుంటుందని కోరడంతో ఆయన విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించి ఈ నిర్ణయం తీసుకున్నారు. టెట్‌కు 90 రోజులు, మెగా డీఎస్సీకి 90 రోజుల సమయం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ ఏడాది డిసెంబర్‌లోగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేసి, వచ్చే ఏడాది జనవరి నాటికి ఉద్యోగాలు ఇచ్చేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు.

దరఖాస్తు రుసుములు చెల్లింపులు జులై 3 నుంచి 16వ తేదీ వరకు స్వీకరించనున్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల సమర్పణ జులై 04 నుంచి 17వ తేదీ వరకు కొనసాగుతుంది. ఆన్‌లైన్ మాక్ టెస్ట్‌లు జులై 16 నుంచి నిర్వహిస్తారు. త్వరలో కొత్తగా టెట్‌ పరీక్షల తేదీలు వెల్లడికానున్నాయి. టెట్‌ పరీక్ష రోజుకు రెండు సెషన్ల చొప్పున జరుగుతుంది. సెషన్-1 పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, సెషన్ 2 పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 వరకు జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!