TS EAPCET 2024 Counselling: నేటి నుంచి తెలంగాణ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రారంభం.. ఈ సర్టిఫికెట్లు తప్పనిసరి
తెలంగాణ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ నేటి నుంచి ప్రారంభమవుతుంది. ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో బీటెక్/బీఈ సీట్ల భర్తీకి ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. నేటి నుంచి జులై 13 వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించవచ్చు. జులై 6 నుంచి 13 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది. జులై 8 నుంచి 15 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇస్తారు. జులై 19న ఇంజినీరింగ్ తొలి విడత సీట్ల కేటాయింపు చేస్తారు..
హైదరాబాద్, జులై 4: తెలంగాణ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ నేటి నుంచి ప్రారంభమవుతుంది. ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో బీటెక్/బీఈ సీట్ల భర్తీకి ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. నేటి నుంచి జులై 13 వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించవచ్చు. జులై 6 నుంచి 13 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది. జులై 8 నుంచి 15 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇస్తారు. జులై 19న ఇంజినీరింగ్ తొలి విడత సీట్ల కేటాయింపు చేస్తారు. జులై 19 నుంచి జులై 26 వరకు విద్యార్ధులు సీట్లు పొందిన కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
ఇక జులై 26 నుంచి ఇంజినీరింగ్ రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. జులై 27న రెండో విడత కౌన్సెలింగ్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్, జులై 27, 28 తేదీల్లో వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇస్తారు. జులై 31న ఇంజినీరింగ్ రెండో విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. జులై 31 నుంచి ఆగస్టు 2 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఆగస్టు 8 నుంచి మూడో విడత కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది. మూడో విడత కౌన్సెలింగ్‌కు ఆగస్టు 9న సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఆగస్టు 9, 10 తేదీల్లో వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇస్తారు. ఆగస్టు 13న ఇంజినీరింగ్ మూడో విడత సీట్ల కేటాయింపుతో పాటు అదే రోజు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి.
కౌన్సెలింగ్‌కు హాజరయ్యే విద్యార్ధులు తప్పనిసరిగా పదో తరగతి మర్క్స్ మెమో, ఇంటర్మీడియట్ మార్కుల మెమో, ట్రాన్స్ ఫర్ సర్టిఫికేట్(టీసీ), స్టడీ సర్టిఫికెట్, లేటెస్ట్ ఇన్‌కం సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ సర్టిఫికెట్, తెలంగాణ ఈఏపీసెట్ 2024 హాల్‌టికెట్, తెలంగాణ ఈఏపీసెట్ 2024 ర్యాంక్ కార్డు, ఆధార్‌కార్డు, పాస్‌పోర్టు సైజ్ ఫొటోలు తమతో పాటు తీసుకెళ్లాలి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.