APPSC Group 2 Mains Postponed: ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష వాయిదా! కారణం ఇదే..
ఆంధ్రప్రదేశ్ గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా పడింది. ఈ మేరకు పరీక్ష వేసినట్లు ఏపీపీఎస్సీ బుధవారం (జులై 7) ప్రకటన వెలువరించింది. తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు జులై 28న మెయిన్స్ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. అయితే అడ్మినిస్ట్రేటివ్ కారణాలతో పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ తన ప్రకటనలో పేర్కొంది. పరీక్షను మళ్లీ ఎప్పుడు నిర్వహించాలన్న దానిపై త్వరలో కొత్త తేదీకి సంబంధించి మరో షెడ్యూల్ విడుదల..
అమరావతి, జులై 3: ఆంధ్రప్రదేశ్ గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా పడింది. ఈ మేరకు పరీక్ష వేసినట్లు ఏపీపీఎస్సీ బుధవారం (జులై 7) ప్రకటన వెలువరించింది. తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు జులై 28న మెయిన్స్ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. అయితే అడ్మినిస్ట్రేటివ్ కారణాలతో పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ తన ప్రకటనలో పేర్కొంది. పరీక్షను మళ్లీ ఎప్పుడు నిర్వహించాలన్న దానిపై త్వరలో కొత్త తేదీకి సంబంధించి మరో షెడ్యూల్ విడుదల చేయనున్న ఏపీపీఎస్సీ ఈ సందర్భంగా తన ప్రకటనలో వెల్లడించింది.
కాగా మొత్తం 899 పోస్టుల భర్తీకి గానూ గత ఏడాది డిసెంబర్ 7న ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు సంబంధించి ఫిబ్రవరి 25వ తేదీన ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించగా.. ఏప్రిల్ 10న ఫలితాలు వెలువడ్డాయి. 1:100 నిష్పత్తిలో మెయిన్స్‌కు అభ్యర్ధులను ఎంపిక చేశారు. దీంతో మొత్తం 92,250 మంది అభ్యర్ధులను మెయిన్స్‌కు ఎంపికయ్యారు. మెయిన్స్‌కు ఎంపికైన వారంతా జూన్ 5 నుంచి 18 వరకూ పరీక్ష కేంద్రం, పోస్టు, జోనల్, జిల్లా ప్రిఫరెన్సు వివరాలు నమోదు చేసుకోవాలని, ఆ మేరకు ఆప్షన్లు ఇచ్చుకోవాలని కమిషన్ కోరింది. తీరా పరీక్ష సమీపిస్తున్న సమయానికి మెయిన్స్ పరీక్షను వాయిదా వేస్తూ కమిషన్ నిర్ణయం తీసుకుంది.
అయితే తాజా నిర్ణయం మెయిన్స్ అభ్యర్ధుల్లో అందోళన కన్నా సంతోషాన్నే ఇచ్చింది. ఎందుకంటే ఈ సారి గ్రూప్ 2 సిలబస్‌లో మార్పులు చేయడంతోపాటు, ఎన్నికల ప్రక్రియ వల్ల పూర్తి స్థాయిలో పరీక్షకు సన్నద్ధం కాలేకపోయామంటూ కొందరు అభ్యర్ధులు.. మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలంటూ గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. పరీక్షకు సన్నద్ధమవడానికి మరికొంత సమాయం కావాలని ఏపీపీఎస్సీకి విజ్ఞప్తులు సైతం సమర్పించారు. ఈ క్రమంలో తాజాగా కమిషన్ మెయిన్స్ వాయిదా వేయడంతో పరీక్ష సన్నద్ధతకు మరింత సమయం లభించిందని అభ్యర్ధులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.