AP TET and DSC 2024: ఏపీ టెట్‌, డీఎస్సీ పరీక్షలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఒక్కో పరీక్షకు ఏకంగా 90 రోజుల గ్యాప్‌!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం టెట్, మెగా డీఎస్సీ పరీక్షల ప్రిపరేషన్‌కు తగినంత సమయమివ్వాలని తాజాగా నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో టెట్, మెగా డీఎస్సీ అభ్యర్థుల అభ్యర్థన మేరకే పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో పరీక్షల కోసం సన్నద్ధం అవ్వడానికి మరింత సమయం ఇవ్వాలని నిర్ణయిస్తూ టెట్ నిర్వహణకు నోటిఫికేషన్ జారీచేసింది. టెట్, మెగా డీఎస్సీ అభ్యర్థుల అభ్యర్థన మేరకు పరీక్షల కోసం..

AP TET and DSC 2024: ఏపీ టెట్‌, డీఎస్సీ పరీక్షలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఒక్కో పరీక్షకు ఏకంగా 90 రోజుల గ్యాప్‌!
AP govt key decisions on TET and DSC 2024
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 03, 2024 | 8:38 PM

అమరావతి, జులై 3: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం టెట్, మెగా డీఎస్సీ పరీక్షల ప్రిపరేషన్‌కు తగినంత సమయమివ్వాలని తాజాగా నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో టెట్, మెగా డీఎస్సీ అభ్యర్థుల అభ్యర్థన మేరకే పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో పరీక్షల కోసం సన్నద్ధం అవ్వడానికి మరింత సమయం ఇవ్వాలని నిర్ణయిస్తూ టెట్ నిర్వహణకు నోటిఫికేషన్ జారీచేసింది. టెట్, మెగా డీఎస్సీ అభ్యర్థుల అభ్యర్థన మేరకు పరీక్షల కోసం సన్నద్ధం అవ్వడానికి మరింత సమయం ఇవ్వాలనే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేర ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 16,347 పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ ఫైల్​పై ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి సంతకం చేసిన విషయం తెలిసిందే. ఈ మొత్తం ప్రక్రియను ఆరు నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నూతనంగా బీఈడీ, డీఈడీ పూర్తి చేసుకున్న వారికి కూడా మెగా డీఎస్సీ రాసేందుకు అవకాశం కల్పించేలా టెట్ నిర్వహించాలని వచ్చిన అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకొని టెట్ నిర్వహించడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది.

టెట్, మెగా డీఎస్సీ పరీక్షలకు సన్నద్ధం అవ్వడానికి తమకు మరింత సమయం ఇవ్వాలని అభ్యర్థులు, వివిధ విద్యార్థి, యువజన సంఘాలు విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్​ను కలిసి విజ్ఞప్తి చేశారు. అభ్యర్థుల వినతుల మేరకు మంత్రి లోకేశ్ విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. దీనిపై అందరి అభిప్రాయాలు తీసుకున్న తరువాత అభ్యర్థులు పరీక్ష రాయడానికి సన్నద్ధం అవ్వడానికి మరింత సమయం ఇవ్వాలని నిర్ణయించారు. టెట్ పరీక్ష నిర్వహణకు 90 రోజులు, మెగా డీఎస్సీ నిర్వహణకు 90 రోజుల సమయం ఇస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే టెట్, డీఎస్సీ నిర్వహణకు కొత్త తేదీలను ప్రభుత్వం త్వరలోనే ప్రకటించనుంది.

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ మొత్తం ప్రక్రియ 6 నెలల్లో పూర్తిచేసేలా కార్యాచరణ రూపొందించాలని మంత్రి నారా లోకేశ్‌ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. కొత్తగా బీఈడీ, డీఎడ్‌ పూర్తి చేసుకున్న వారికీ మెగా డీఎస్సీలో అవకాశం కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. మొత్తంగా ఈ ఏడాది డిసెంబర్‌లోగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేసి 2025 జనవరి నాటికి ఉద్యోగాలు ఇచ్చేలా కార్యాచరణ సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించినట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.