AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TGPSC Gurukula PET Posts: జులై 4 నుంచి గురుకుల పీఈటీ అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన.. ఎంత మంది ఎంపికయ్యారంటే!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల్లో వ్యాయామ ఉపాధ్యాయులు నియామకాలకు సంబంధించి ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల రెండో జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) విడుదల చేసింది. 1:4 నిష్పత్తి చొప్పున అభ్యర్ధులను ఎంపిక చేశారు. ఆ ప్రకారంగా మొత్తం 1074 అభ్యర్థులు ఎంపికయ్యారు. ఎంపికైన అభ్యర్థులందరికీ జులై 04 నుంచి 11వ తేదీ వరకు హైదరాబాద్‌లోని..

TGPSC Gurukula PET Posts: జులై 4 నుంచి గురుకుల పీఈటీ అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన.. ఎంత మంది ఎంపికయ్యారంటే!
Certificate verification for TGPSC PET posts
Srilakshmi C
|

Updated on: Jul 03, 2024 | 5:28 PM

Share

హైదరాబాద్‌, జులై 3: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల్లో వ్యాయామ ఉపాధ్యాయులు నియామకాలకు సంబంధించి ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల రెండో జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) విడుదల చేసింది. 1:4 నిష్పత్తి చొప్పున అభ్యర్ధులను ఎంపిక చేశారు. ఆ ప్రకారంగా మొత్తం 1074 అభ్యర్థులు ఎంపికయ్యారు. ఎంపికైన అభ్యర్థులందరికీ జులై 04 నుంచి 11వ తేదీ వరకు హైదరాబాద్‌లోని టీజీపీఎస్సీ కార్యాలయంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ఉంటుంది.

సంబంధిత ధృవీకరణ పత్రాలతో ఎంపికైన వారంతా జులై 4 నుంచి జులై 12 వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవాలని కమిషన్‌ సూచించింది. కాగా తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీల్లో పీఈటీ ఖాళీలకు గాను 2017 సెప్టెంబర్‌ 17, 18 తేదీల్లో రాత పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి తదుపరి ప్రక్రియను చేపట్టేందుకు టీజీపీఎస్సీ ఇన్నాళ్లు తాత్సారం చేస్తూ వచ్చింది. ఇన్నాళ్లకు మళ్లీ నియామక ప్రక్రియకు సంబంధించి కమిషన్‌ చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా తాజాగా ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల రెండో జాబితాను వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచింది.

జులై 4, 5 తేదీల్లో తెలంగాణ ట్రిపుల్‌ ఐటీల్లో ధ్రువపత్రాల పరిశీలన

తెలంగాణ ఆర్‌జీయూకేటీ పరిధిలోని ట్రిపుల్‌ ఐటీ కోర్సుల్లో ప్రవేశాలకు బాసర క్యాంపస్‌లోప్రవేశాలకు సంబంధించి స్పెషల్‌ కేటగిరీ ధ్రవీకరణ పత్రాల పరిశీలనకు ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్ధులందరికీ జులై 4, 5వ తేదీల్లో బాసర క్యాంపస్‌లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది. స్పోర్ట్స్‌, పీహెచ్‌ అభ్యర్థులకు జులై 4.. క్యాప్‌, ఎన్‌సీసీ కేటగిరీ అభ్యర్థులకు జులై 5న ఉంటుంది. ఎంపికై అభ్యర్ధులందరూ సంబంధిత ధ్రువీకరణపత్రాలతో హాజరుకావాల్సి ఉంటుంది. ఎంపికైన విద్యార్థుల తుది జాబితా త్వరలో విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి

తెలంగాణ ట్రిపుల్‌ ఐటీల్లో ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.