APPSC Recruitment: నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. నాన్‌ గెజిటెడ్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేసిన ఏపీపీఎస్సీ.

APPSC Recruitment 2021: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న నాన్‌ గెజిటెడ్‌ పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా...

APPSC Recruitment: నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. నాన్‌ గెజిటెడ్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేసిన ఏపీపీఎస్సీ.
Follow us

|

Updated on: Oct 13, 2021 | 2:39 PM

APPSC Recruitment 2021: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న నాన్‌ గెజిటెడ్‌ పోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 38 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి, అర్హులెవరు.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 38 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో అసిస్టెంట్‌ పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్లు (ఏపీ ఇన్ఫర్మేషన్‌ సబార్డినేట్‌ సర్వీస్‌) పోస్టులు 6 ఉన్నాయి. వీటికి దరఖాస్తు చేసుకునే వారు బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణతో పాటు జర్నలిజం/ పబ్లిక్‌ రిలేషన్స్‌లో డిగ్రీ/ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.

* అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్లు (ఏపీ ఎకనమిక్స్‌ అండ్‌ స్టాటిస్టికల్‌ సబ్‌ సర్వీస్‌) 29 ఖాళీలు ఉన్నాయి. వీటికి దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో స్టాటిస్టిక్స్‌/ మ్యాథమెటిక్స్‌/ ఎకనమిక్స్‌/ కామర్స్‌ / కంప్యూటర్‌ సైన్స్‌లో బ్యాచిలర్‌ డిగ్రీని పూర్తి చేయాలి.

* ఫుడ్‌ సేఫ్టీ ఆఫీసర్‌ (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌, పబ్లిక్‌ హెల్త్‌ సబార్డినేట్‌ సర్వీస్‌ – 01 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టు్ల్లో డిగ్రీ ఉత్తీర్ణత పొందాలి.

* హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్లు (ఉమెన్‌) ఏపీబీసీ వెల్ఫేర్‌ సబార్డినేట్‌ సర్వీస్‌ (02) పోస్టులు ఉన్నాయి. వీటికి దరఖాస్తు చేసుకునే వారు గ్రాడ్యుయేషన్‌తో పాటు బీఈడీ పూర్తి చేసి ఉండాలి.

* అభ్యర్థుల వయసు 01-17-2021 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ 12-11-2021న ప్రారంభమవుతుండగా 07-12-2021తో ముగియనుంది.

* పూర్తి వివరాల కోసం ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

Also Read: Fruit Prices: నవరాత్రుల సందర్భంగా పెరిగిన పండ్ల ధరలు.. కొనాలంటే జేబు ఖాళీ కావాల్సిందే..

Phone Saves Man: షాకింగ్ ఇన్సిడెంట్.. బుల్లెట్ నుంచి వ్యక్తి ప్రాణాలు కాపాడిన స్మార్ట్‌ఫోన్..!

ICSI CS June Result 2021: ఐసీఎస్‌ఐ ఫలితాలు విడుదల.. రిజల్ట్‌ కోసం ఇలా చెక్‌ చేయండి..!