Phone Saves Man: షాకింగ్ ఇన్సిడెంట్.. బుల్లెట్ నుంచి వ్యక్తి ప్రాణాలు కాపాడిన స్మార్ట్‌ఫోన్..!
Smartphone Saved Man: ఇప్పటివరకు స్మార్ట్‌ఫోన్ అంటే అవసరాలకు వాడుకోవడంతో పాటు.. వీడియోలు చూడటం, గేమ్స్ ఆడుకోవడం, ఫోటోలు తీసుకోడానికే అనుకున్నాం.
Smartphone Saved Man: ఇప్పటివరకు స్మార్ట్‌ఫోన్ అంటే అవసరాలకు వాడుకోవడంతో పాటు.. వీడియోలు చూడటం, గేమ్స్ ఆడుకోవడం, ఫోటోలు తీసుకోడానికే అనుకున్నాం. స్మార్ట్ ఫోన్ వల్లే మనిషి ఆయుష్షు తగ్గుతుందనే మరో నెగిటివ్ ప్రచారం కూడా ఉంది. కానీ, ఇప్పుడు మనం చెప్పుకొనే స్మార్ట్‌ఫోన్ మాత్రం ఏకంగా మనిషి ప్రాణాలే కాపాడింది. అవునండీ ఇది నిజంగా నిజం. మోటరోలాకు చెందిన ఐదేళ్ల పాత మోటో జీ5 స్మార్ట్‌ఫోన్ ఒక మనిషి నిండు ప్రాణాలను రక్షించింది. వేగంగా వస్తున్న బుల్లెట్‌ను అడ్డుకుని బుల్లెట్ ప్రూఫ్ లా పనిచేసింది ఆ స్మార్ట్ ఫోన్. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ మొబైల్ కేసు మీద ది ఇన్ క్రెడిబుల్ హల్క్ డిజైన్ ఉంది.
అసలు ఫోన్ ఏంటి? కాపాడటం ఏంటీ? అని కన్‌ఫ్యూజన్‌లో అయితే, అసలు మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. మార్వెల్ హీరో హల్క్, మోటో జీ5 కలిసి ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడారు. ఈ సంఘటన గత వారం బ్రెజిల్‌లో దొంగతనం జరిగే సమయంలో జరిగింది. ఆ సమయంలో అక్కడున్న వ్యక్తిపై దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ క్రమంలో బుల్లెట్ నేరుగా మోటో జీ5 స్మార్ట్‌ఫోన్‌కు తగిలి దిశ మార్చుకొని నడుము భాగంలోకి దూసుకెళ్లింది. అలా చిన్నపాటి గాయంతో బయటపడ్డ వ్యక్తికి ప్రాణాపాయం తప్పింది. ఇది తప్ప బుల్లెట్ వల్ల మరే ఇతర గాయం లేదు. ఫోన్ యజమానికి చికిత్స చేసిన వైద్యుడు ఈ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. బుల్లెట్, ఫోన్ స్క్రీన్ ను తాకడంతో అది పగిలిపోయింది. ఈ దృశ్యం ఫోటోలో క్లియర్‌గా కనిపిస్తోంది. ఫోన్ వెనుక భాగంలో పెద్ద బొడిపె కూడా ఉంది. ఫోన్ కి హల్క్ కేసు కూడా కనిపిస్తుంది. గతంలో వచ్చిన మోటో జీ5 వంటి ఫోన్లు చాలా మందంగా ఉండేవి. కానీ, ఇప్పుడు వచ్చే ఫోన్లు చాలా స్లిమ్, సున్నితమైన డిజైన్ తో వస్తున్నాయి. ఇలాంటి ఘటనల నుంచి కాపాడతాయా అంటే ఖచ్చితంగా చెప్పలేం.
Also read:
Elk Tyre : రేండుళ్లుగా అటవీ అధికారులకు చుక్కలు చూపించిన దుప్పి.. ఎట్టకేలకు విముక్తి కల్పించారు..!
‘Pelli SandaD’ posters: థియేటర్ లో సందడి కి సిద్ధంగా ‘పెళ్లి సందD’.. సోషల్ మీడియాలో పోస్టర్స్…
NASA – Aliens: అంగారకుడిపై ఏలియన్స్ ఉన్నాయా ?.. నాసా విడుదల చేసిన ఫోటోలోని ఆధారాలు నిజమేనా..