AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: రేండుళ్లుగా అటవీ అధికారులకు చుక్కలు చూపించిన దుప్పి.. ఎట్టకేలకు విముక్తి కల్పించారు..!

Elk Tyre : అడవిలో స్వేచ్ఛగా తిరుగాడే దుప్పి రెండేళ్లుగా పెను భారాన్ని మోస్తూ కాలం వెళ్లదీసింది. తనకు ఏం జరుగుతుందో తెలియదు.. తానేం మోస్తుందో తెలియదు..

Watch: రేండుళ్లుగా అటవీ అధికారులకు చుక్కలు చూపించిన దుప్పి.. ఎట్టకేలకు విముక్తి కల్పించారు..!
Elk
Shiva Prajapati
| Edited By: Anil kumar poka|

Updated on: Oct 13, 2021 | 3:52 PM

Share

Elk Tyre : అడవిలో స్వేచ్ఛగా తిరుగాడే దుప్పి రెండేళ్లుగా పెను భారాన్ని మోస్తూ కాలం వెళ్లదీసింది. తనకు ఏం జరుగుతుందో తెలియదు.. తానేం మోస్తుందో తెలియదు.. కానీ రెండేళ్ల పాటు ఇబ్బందులు పడుతూనే బతికేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. కొండ కోనల్లో హాయిగా విహరించే ఆ దుప్పి మెడలోకి ఓ టైరు వచ్చి పడింది. అదెలా వచ్చిందో తెలియదు గానీ పాపం రెండేళ్లుగా దానిని మోస్తూనే వచ్చింది. అలా మెడలో టైర్‌తో పరుగెడుతున్న ఈ దుప్పిని కొలరాడో వన్యప్రాణి సంరక్షణ అధికారులు గమనించారు. దానిని టైర్ నుంచి విముక్తి కల్పించేందుకు అధికారులు తీవ్రంగా శ్రమించారు. ఆ దుపపి పట్టుకునేందుకు రెండేళ్లుగా అధికారులు వెతికారు. ఎట్టకేలకు వారి ప్రయత్నాలు ఫలించాయి. అక్టోబరు 9న దానిని పట్టుకున్నారు అధికారులు. ఆ దుప్పికి మత్తు మందు ఇచ్చి.. దాని మెడలో ఇరుక్కుపోయిన టైర్‌ని తొలగించారు. దాంతో వారు హ్యాపీగా ఫీల్ అయ్యారు.

అయితే, దీనికి ముందు ఆ దుప్పి అటవీశాఖ అధికారులకు చుక్కలు చూపించింది. నాలుగున్నరేళ్ల వయసున్న ఆ దుప్పి గత వారం రోజుల్లో నాలుగుసార్లు చిక్కినట్టే చిక్కి తప్పించుకుపోయింది. ఈ విషయాన్ని పార్క్‌ అధికారి స్కాట్‌ ముర్దోచ్‌ తెలిపారు. తొలుత దుప్పిని పట్టుకుని టైర్‌ని కట్‌ చేద్దామని అనుకున్నప్పటికీ సాధ్య పడలేదట. ఇక లాభం లేదనుకున్న అధికారులు.. పక్కా స్కెచ్ వేశారు. ఐదోసారి దుప్పిని టైర్‌ మోత నుంచి రక్షించారు. మట్టి, రాళ్లతో నిండిన ఆ టైర్‌ బరువు సుమారు 16 కిలోల వరకు ఉంటుందని, దాని వల్ల దుప్పి ఆరోగ్యంపై ప్రభావం పడేదని ఫారెస్ట్ అధికారులు వెల్లడించారు. అయితే, రెండేళ్లుగా అంత బరువు మోసినా దుప్పి మెడ ఎప్పటిలా మామూలుగా ఉండటం గొప్ప విషయమని పేర్కొన్నారు. ఏదేమైనా రెండేళ్లుగా టైర్ బరువు మోస్తూ తిరుగుతున్న దుప్పికి ఆ మోత బరువు నుంచి విముక్తి లంభించడంతో అధికారులు సంతోషం వ్యక్తం చేశారు.

Also read: ‘Pelli SandaD’ posters: థియేటర్ లో సందడి కి సిద్ధంగా ‘పెళ్లి సందD’.. సోషల్ మీడియాలో పోస్టర్స్…

Atchannaidu Naidu Felldown: అయ్యో.. అచ్చెన్న పడిపోయారే..

NASA – Aliens: అంగారకుడిపై ఏలియన్స్ ఉన్నాయా ?.. నాసా విడుదల చేసిన ఫోటోలోని ఆధారాలు నిజమేనా..

Bus Accident: 982 అడుగుల లోయలో పడిన బస్సు.. 32 మంది దుర్మరణం.. 15 మందికి గాయాలు..