AP Inter Result 2022: ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షా ఫలితాలు వచ్చేశాయ్.. ఇలా చెక్ చేసుకోండి..
AP Inter Result 2022: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. నెల రోజుల లోపే అధికారులు పరీక్షా ఫలితాలను విడుదల చేశారు...

AP Inter Result 2022: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. నెల రోజుల లోపే అధికారులు పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు. పరీక్షలకు హాజరైన విద్యార్థులు తమ ఫలితాలను నేరుగా tv9telugu.com లేదా అధికారిక వెబ్‌సైట్ bie.ap.gov.inలో తెలుసుకోవచ్చు.
పరీక్షలో మొత్తం 2,41,591 (54 శాతం) మంది ఉత్తీర్ణత సాధించగా, సెకండ్ ఇయర్‌లో శాతం 2,58,449 (61 శాతం) మంది పాస్ అయ్యారు. ఫస్ట్ ఇయర్‌లో బాలుర ఉత్తీర్ణత శాతం 49%గా ఉండగా, బాలికలు 65 శాతం పాస్ అయ్యారు. ఇక సెకండ్ ఇయర్‌లో బాలురు 54 శాతం, బాలికలు 68 శాతం ఉత్తీర్ణత సాధించారు. జిల్లాల పరంగా చూసుకుంటే అత్యధికంగా కృష్ణ జిల్లా 72 శాతం, స్వల్పంగా కడప 55 శాతం నమోదైంది.
ఫలితాలు ఇక్కడ తెలుసుకోండి..
ఇదిలా ఉంటే ఈసారి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలకు హాజరైన వారు 5,19,319, ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలకు హాజరైన వారి సంఖ్య 4,89,539 మంది. ఈ ఏడాది మొత్తం ఇంటర్ పరీక్షలకు 10,01,850 మంది హాజరయ్యారు.
