AP Inter Results 2022: ఏపీ ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ ఇక్కడ చెక్ చేసుకోండి..

| Edited By: Team Veegam

Updated on: Jun 22, 2022 | 5:57 PM

AP Inter 1st, 2nd Year Results 2022 Updates: ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ ఫస్ట్ ఇయర్, సెకండ్‌ ఇయర్‌ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం...

AP Inter Results 2022: ఏపీ ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ ఇక్కడ చెక్ చేసుకోండి..
Inter students

AP Inter 1st, 2nd Year Results 2022 Updates: ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ ఫస్ట్ ఇయర్, సెకండ్‌ ఇయర్‌ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం ఫలితాలను విడుదల చేశారు. పరీక్షలకు హాజరైన విద్యార్థులు తమ ఫలితాలను నేరుగా tv9telugu.com లేదా అధికారిక వెబ్‌సైట్‌ bie.ap.gov.inలో తెలుసుకోవచ్చు.

పరీక్షలో మొత్తం 2,41,591 (54 శాతం) మంది ఉత్తీర్ణత సాధించగా, సెకండ్ ఇయర్‌లో శాతం 2,58,449 (61 శాతం) మంది పాస్‌ అయ్యారు. ఫస్ట్‌ ఇయర్‌లో బాలుర ఉత్తీర్ణత శాతం 49%గా ఉండగా, బాలికలు 65 శాతం పాస్‌ అయ్యారు. ఇక సెకండ్ ఇయర్‌లో బాలురు 54 శాతం, బాలికలు 68 శాతం ఉత్తీర్ణత సాధించారు. జిల్లాల పరంగా చూసుకుంటే అత్యధికంగా కృష్ణ జిల్లా 72 శాతం, స్వల్పంగా కడప 55 శాతం నమోదైంది.

జిల్లాల పరంగా చూస్తే 72 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్ల మొదటి స్థానంలో ఉండగా, 50 శాతంతో కడప జిల్లా చివరి స్థానంలో నిలిచింది. ఇదిలా ఉంటే రెండో స్థానంలో 68 శాతంతో గుంటూరు నిలవగా తర్వాతి స్థానాల్లో వరుసగా.. నెల్లూరు (67 శాతం), విశాఖపట్నం (65), వెస్ట్‌ గోదావరి (64), ప్రకాశం (59), చిత్తూరు (58), ఈస్ట్‌ గోదావరి (58), శ్రీకాకుళం (57), కర్నూలు (55), అనంతపురం (55), విజయనగరం (50), కడప (50) ఉత్తీర్ణత సాధించారు. బాలురుల్లో అత్యధికంగా ఉత్తీర్ణత సాధించిన జిల్లాగా 66 శాతంతో కృష్ణ, అమ్మాయిల విషయంలో 72 శాతంతో కృష్ణ జిల్లా నిలిచింది. ఇక అత్యల్ప ఉత్తీర్ణతగా బాలురు 34 శాతం, బాలికలు 47 శాతం కడపలో నమోదైంది.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 22 Jun 2022 01:28 PM (IST)

    ముఖ్యమైన విషయాలు..

    * విద్యార్థులకు ఈ నెల 25 నుంచి జూలై 5 వరకూ రీ కౌంటింగ్ కు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. * ఫెయిల్‌ అయిన అభ్యర్థులు ఆగస్టు 3 నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో హాజరు కావొచ్చు.

  • 22 Jun 2022 12:53 PM (IST)

    ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు ఇక్కడ చెక్ చేసుకోండి..

  • 22 Jun 2022 12:51 PM (IST)

    జిల్లాల పరంగా చూస్తే...

    జిల్లాల పరంగా చూసుకుంటే అత్యధికంగా కృష్ణ జిల్లా 72 శాతం, స్వల్పంగా కడప 55 శాతం నమోదైంది.

  • 22 Jun 2022 12:44 PM (IST)

    ఎంత మంది పాస్ అయ్యారంటే..

    ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. రికార్డు స్థాయిలో పరీక్షలు నిర్వహించిన 28 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేశారు. ఈసారి జరిగి ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలో మొత్తం 2,41,591 (54 శాతం) మంది ఉత్తీర్ణత సాధించగా, సెకండ్ ఇయర్‌లో శాతం 2,58,449 (61 శాతం) మంది పాస్‌ అయ్యారు.

  • 22 Jun 2022 12:22 PM (IST)

    గతంలో పాస్‌ పర్సటేంజ్‌ ఎలా ఉందంటే..

    2020లో 59 శాతం మంది, 2019లో 55 శాతం, 2018లో 57 శాతం, 2017లో 60.01 శాతం, 2016లో 60.59 శాతం, 2015లో 55.87 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మరి ఈసారి పాస్‌ పర్సెంటేజ్‌ ఎంత నమోదవుతుందో చూడాలి.

  • 22 Jun 2022 11:59 AM (IST)

    మొత్తం ఎంత మంది హాజరయ్యారంటే..

    ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ పరీక్షలకు హాజరైన వారు 5,19,319, ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ పరీక్షలకు హాజరైన వారి సంఖ్య 4,89,539 మంది. ఈ ఏడాది మొత్తం ఇంటర్‌ పరీక్షలకు హాజరైన వారి సంఖ్య 10,01,850.

  • 22 Jun 2022 11:57 AM (IST)

    గ్రేడ్స్‌ ఎలా ఇస్తారంటే..

    * 75 శాతం కంటే ఎక్కువ మార్కులు వస్తే A గ్రేడ్‌ * 60 నుంచి 75 శాతం మార్కులు వస్తే B గ్రేడ్‌ * 50 నుంచి 60 శాతం మార్కులు వస్తే C గ్రేడ్‌ * 35 నుంచి 50 శాతం మార్కులు వస్తే D గ్రేడ్‌

  • 22 Jun 2022 11:54 AM (IST)

    ఫలితాలు వెల్లడైన వెంటనే..

    ఏపీ ఇంటర్ పరీక్షా ఫలితాలను విడుదల చేసిన వెంటనే మార్క్స్ మెమో డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. 12.30 గంటలకు ఫలితాలు విడుదలకానున్నాయి.

Published On - Jun 22,2022 11:47 AM

Follow us
Latest Articles