AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Air India: విశాఖపట్నం-ఎయిర్ ఇండియా ఎయిర్‌పోర్టులో ఎగ్జిక్యూటివ్‌ జాబ్స్‌కు ఇంటర్వ్యూలు.. టెన్త్‌/ఇంటర్‌ అర్హత..

విశాఖపట్నంలోని ఎయిర్ ఇండియా ఎయిర్‌పోర్ట్‌ సర్వీసెస్ లిమిటెడ్.. ఒప్పంద ప్రాతిపదికన 56 కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, హ్యాండీమ్యాన్/ హ్యాండీ ఉమెన్‌, జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ తదితర పోస్టుల భర్తీకి..

Air India: విశాఖపట్నం-ఎయిర్ ఇండియా ఎయిర్‌పోర్టులో ఎగ్జిక్యూటివ్‌ జాబ్స్‌కు ఇంటర్వ్యూలు.. టెన్త్‌/ఇంటర్‌ అర్హత..
Air India Visakhapatnam
Srilakshmi C
|

Updated on: Feb 17, 2023 | 9:01 PM

Share

విశాఖపట్నంలోని ఎయిర్ ఇండియా ఎయిర్‌పోర్ట్‌ సర్వీసెస్ లిమిటెడ్.. ఒప్పంద ప్రాతిపదికన 56 కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, హ్యాండీమ్యాన్/ హ్యాండీ ఉమెన్‌, జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఎస్‌ఎస్‌సీ/10వ తరగతి/ఇంటర్మీడియట్‌/ఐటీఐ/డిప్లొమా/గ్రాడ్యుయేషన్‌ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు తప్పనిసరిగా 28 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఫిబ్రవరి 25, 26 తేదీల్లో కింది అడ్రస్‌లో నిర్వహించే ఇంటర్వ్యూకి నేరుగా హాజరుకావచ్చు. రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద రూ.500లు చెల్లించవల్సి ఉంటుంది. ట్రేడ్‌టెస్ట్‌/ పీఈటీ/ పర్సనల్‌/ వర్చువల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.14,610ల నుంచి రూ.19,350ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

  • కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, జూనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఫిబ్రవరి 25న ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఇంటర్వ్యూ జరుగుతుంది.

అడ్రస్‌:

Institute Of Management and Science, No.51-17-2/6, Kranthinagar, Opp.Jayabheri Showroom, Isukathota, Maddilapalem, Visakhapatnam, Andhra Pradesh – 530016 వద్ద రిపోర్ట్‌ చేయాలి.

  • ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్, హ్యాండీమ్యాన్/ హ్యాండీ ఉమెన్‌ పోస్టులకు ఫిబ్రవరి 26న ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఇంటర్వ్యూ జరుగుతుంది.

అడ్రస్‌:

Cargo Complex Back Side, Shuttle Court, Old Airport, Visakhapatnam, Andhra Pradesh – 530009 వద్ద రిపోర్ట్‌ చేయాలి.

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!