AIIMS Recruitment: రాయ్‌పూర్ ఎయిమ్స్‌లో టీచింగ్ పోస్టులు.. నెలకు రూ. 2 లక్షలకు పైగా జీతం పొందే అవకాశం..
AIIMS Recruitment 2021: ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకి చెందిన..

AIIMS Recruitment 2021: ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకి చెందిన రాయ్‌పూర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పలు టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 169 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో ప్రొఫెసర్ (37), అడిషనల్ ప్రొఫెసర్ (31), అసోసియేట్ ప్రొఫెసర్ (52), అసిస్టెంట్ ప్రొఫెసర్ (49) ఖాళీలు ఉన్నాయి.
* అనెస్తీషియాలజీ, బయోకెమిస్ట్రీ, కార్డియాలజీ, డెర్మటాలజీ, మైక్రోబయాలజీ, న్యూరాలజీ వంటి విభాగాలున్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత స్పెషలైజేషన్లలో పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ (ఎండీ/ ఎంఎస్)లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. వీటితో పాటు టీచింగ్/ పరిశోధనలో అనుభవం తప్పనిసరి.
* అభ్యర్థులను స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్/ ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* ముందుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని, హార్డ్ కాపీలను రిక్రూట్మెంట్ సెల్, సెకండ్ ఫ్లోర్, మెడికల్ కాలేజీ బిల్డింగ్, గేట్ నెం5, ఏయిమ్స్ రాయిపూర్, జీబీ రోడ్, రాయిపూర్-492099 అడ్రస్‌కు పంపించాల్సి ఉంటుంది.
* ప్రొఫెసర్ పోస్టుకు ఎంపికైన వారికి నెలకు రూ. 2,20,000 జీతంగా చెల్లిస్తారు.
* అడిషనల్ ప్రొఫెసర్ పోస్టుకు ఎంపికైన వారికి నెలకు రూ. 2,00,000 జీతంగా చెల్లిస్తారు.
* అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 1,88,000 జీతంగా అందిస్తారు.
* అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 1,42,506 జీతంగా చెల్లిస్తారు.
* ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు 25-12-2021 చివరి తేదీగా, హార్డ్ కాపీలను పంపడానికి 10-01-2022ని చివరి తేదీగా నిర్ణయించారు.
* పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: Accident: జోధ్‌పూర్‌లో ఆడి కారు బీభత్సం.. ఒకరు మృతి.. తొమ్మిది మందికి గాయాలు..




