Accident: జోధ్‌పూర్‌లో ఆడి కారు బీభత్సం.. ఒకరు మృతి.. తొమ్మిది మందికి గాయాలు..
రాజస్థాన్‌లో మంగళవారం ఉదయం ఘోరం జరిగింది. జోధ్‌పూర్‌లోని ఎయిమ్స్ రోడ్డులో అతివేగంగా వెళ్తున్న ఆడి కారు పలువురిపైకి దూసుకెళ్లడంతో ప్రమాదం చోటుచేసుకుంది....
రాజస్థాన్‌లో మంగళవారం ఉదయం ఘోరం జరిగింది. జోధ్‌పూర్‌లోని ఎయిమ్స్ రోడ్డులో అతివేగంగా వెళ్తున్న ఆడి కారు పలువురిపైకి దూసుకెళ్లడంతో ప్రమాదం చోటుచేసుకుంది. కారు యాక్సిడెంట్ సీసీటీవీలో రికార్డు అయ్యాయి. ఆడి కారు అధిక వేగంతో ప్రయాణిస్తూ అనేక మంది బైకర్లను ఎలా ఢీకొట్టిందో వీడియోలో స్పష్టం కనిపించింది. ద్విచక్రవాహనదారులను ఢీకొన్న తర్వాత కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న మురికివాడలోకి దూసుకెళ్లి విధ్వంసం సృష్టించింది.
#Rajasthan : shocking cctv footage of deadly accident when a speedy audi killed 3 in #Jodhpur #RoadSafety pic.twitter.com/tTCXp0axMh
— Ravish Pal Singh (@ReporterRavish) November 9, 2021
వాహనం ప్రజలపైకి దూసుకెళ్లడంతో గుడిసెలో ఉన్నవారిలో ఒకరు అక్కడికక్కడే మరణించగా, 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న బస్ని పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను జోధ్‌పూర్‌లోని మధురదాస్ మాథుర్ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత ఎయిమ్స్ కు తీసుకెళ్లారు. ఘటనా స్థలం నుంచి కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జోధ్‌పూర్‌లోని చౌపాస్ని హౌసింగ్ బోర్డ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ క్షతగాత్రులను పరామర్శించేందుకు విమానాశ్రయం నుంచి నేరుగా ఎయిమ్స్‌కు చేరుకున్నారు. క్షతగాత్రులలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని, 16 ఏళ్ల బాలుడు మృతి చెందాడని సీఎం వెల్లడించారు. మృతులకు సంతాపం తెలిపిన సీఎం గెహ్లాట్, క్షతగాత్రులకు సరైన వైద్యం అందించడమే ప్రథమ ప్రాధాన్యమని అన్నారు. ఈ ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
Read Also.. Crime News: జార్ఖాండ్‌లో దారుణం.. 8 మంది పిల్లల తండ్రికి 8వ తరగతి చదివే బాలికతో వివాహం