AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: జార్ఖాండ్‌లో దారుణం.. 8 మంది పిల్లల తండ్రికి 8వ తరగతి చదివే బాలికతో వివాహం

Crime News: జార్ఖండ్‌లోని జమ్తారా జిల్లాలో ఓ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ నడివయస్కుడు మైనర్ బాలికని పెళ్లి చేసుకుని తన ఇంటికి తీసుకెళ్లి తప్పుడు

Crime News: జార్ఖాండ్‌లో దారుణం.. 8 మంది పిల్లల తండ్రికి 8వ తరగతి చదివే బాలికతో వివాహం
Jharkhand
uppula Raju
|

Updated on: Nov 09, 2021 | 7:00 PM

Share

Crime News: జార్ఖండ్‌లోని జమ్తారా జిల్లాలో ఓ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ నడివయస్కుడు మైనర్ బాలికని పెళ్లి చేసుకుని తన ఇంటికి తీసుకెళ్లి తప్పుడు పనులు చేయమని ఒత్తిడి చేశాడు. ఆ అమ్మాయి ఎలాగోలా తప్పించుకుని కర్మతాండ్‌కి చేరుకోగా విషయం బయటికి వచ్చింది. ఈ వ్యవహారంపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం..

ఇప్పటికే ఎనిమిది మంది పిల్లలకు తండ్రి అయిన జమ్తారాకు చెందిన వ్యక్తి 8వ తరగతి చదువుతున్న మైనర్‌ బాలికని వివాహం చేసుకున్నాడు. ఆ వ్యక్తి బాలిక బంధువులకు మాయమాటలు చెప్పి మోసం చేశాడు. పెళ్లయిన తర్వాత మైనర్‌ని ఇంటికి తీసుకెళ్లి వ్యభిచారం చేయమని ఒత్తిడి చేశాడు. ఆమె నిరాకరించడంతో తీవ్రంగా కొట్టారు. ఆమెను వివిధ రకాలుగా హింసించారు. ఆ తర్వాత ఒకరోజు బాధితురాలు ఇంటి నుంచి పారిపోయి కర్మతాండ్‌కు చేరుకొని జరిగిన విషయాన్ని ప్రజలకు చెప్పింది.

పెళ్లయిన తర్వాత తొలిసారిగా అత్తమామల ఇంటికి వచ్చిన అమ్మాయి ఆ వ్యక్తికి ఇదివరకే పెళ్లైందని తెలిసి షాక్‌కి గురైంది. అంతేకాదు అతనికి ఎనిమిది మంది పిల్లలు. ఈ విషయమై భర్తతో గొడవ పడింది. విషయం విడాకుల వరకు చేరింది. ఇంతలో బాలిక కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని రూ.50 వేలకు విడాకులు ఇచ్చేందుకు అంగీకరించారు. బాలిక తండ్రికి డబ్బులు రాకపోవడంతో కూతురిని తన వెంట తీసుకెళ్లాడు. ఆ తర్వాత నిందితుడు మళ్లీ బాలిక ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చి మళ్లీ ఆమె ఇంటికి తీసుకెళ్లాడు.

బాలికను తిరిగి తన ఇంటికి తీసుకెళ్లిన తర్వాత నిందితుడు మళ్లీ ఆమెను చిత్రహింసలకు గురి చేయడం ప్రారంభించారు. బాలికను శారీరకంగా హింసించారు. తల వెంట్రుకలు కత్తిరించారు. కనుబొమ్మల వెంట్రుకలు పీకేశారు. వేధింపులతో విసిగిపోయి బాలిక ఇంటి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా స్థానికులు ఆమెను పట్టుకుని మళ్లీ భర్త వద్దకు తీసుకెళ్లారు. అయితే ఆ తర్వాత పారిపోయేందుకు ప్రయత్నించి కర్మతాండ్‌కు చేరుకున్న ఆమె స్థానిక జర్నలిస్టులకు తన బాధను చెప్పుకుంది. అనంతరం పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Vivo నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌.. 50MP సెల్ఫీ కెమెరా 64MP బ్యాక్‌ కెమెరా.. ధర ఎంతో తెలుసా..?

బాస్మతి బిర్యానీ ఇప్పుడు చాలా ఖరీదు.. ఈ విషయం తెలిస్తే నిజమే అంటారు..!

Tamil Nadu Rains: తమిళనాడుకు వాతావరణ శాఖ హెచ్చరిక.. మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలుంటాయని వెల్లడి..