Murder Mystery: సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని తలపిస్తున్న ఐదేళ్ల చిన్నారి హత్య కేసు.. పోలీసుల దర్యాప్తులో కొత్త కోణాలు!
క్లూస్ దొరకడం లేదు. చంపింది ఎవరో తెలియదు. ఎందుకు హతమార్చారో అంతుచిక్కడం లేదు. ఐదేళ్ల చిన్నారి డెత్ కేసులో మిస్టరీ ఛేదించడం హైదరాబాద్ పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది.
Panjagutta Baby Girl Murder mystery: క్లూస్ దొరకడం లేదు. చంపింది ఎవరో తెలియదు. ఎందుకు హతమార్చారో అంతుచిక్కడం లేదు. ఐదేళ్ల చిన్నారి డెత్ కేసులో మిస్టరీ ఛేదించడం హైదరాబాద్ పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది. బెంగుళూరు బేబీ మర్డర్ కేసు…సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని తలపిస్తోంది. ఈనెల 4న బాలిక మృతదేహాన్ని పంజాగుట్టలో గుర్తించారు పోలీసులు. చిన్నారిని బెంగుళూరులో చంపి.. హైదరాబాద్ తీసుకువచ్చి పంజాగుట్ట ప్రాంతంలో పడేసినట్లుగా పోలీసులు నిర్దారించారు.
మొదట అనుమానాస్పదమృతిగా భావించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. హైదరాబాద్ నడిబొడ్డున ముఖ్యమంత్రి కార్యాలయానికి కూతవేటు దూరంలో ఘటన జరగడంతో సీరియస్‌గా తీసుకున్న పోలీసులు విచారణలో దూకుడు పెంచారు.. చిన్నారి పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఆధారంగా మర్డర్ కేసుగా తేల్చారు. మృతి చెందిన బాలిక కడుపుపై, వీపుపై గాయాలున్నట్లు ఉస్మానియా హాస్పిటల్ వైద్యులు రిపోర్టులో పేర్కొన్నారు. బెంగుళూరు బస్టాండ్ నుంచి ఇద్దరు వ్యక్తులు చిన్నారిని తీసుకువచ్చినట్లు సాంకేతిక ఆధారాల ద్వారా గుర్తించారు. అయితే, ఇంత దారుణానికి ఒడిగట్టాల్సిన అవసరం ఏంమొచ్చదన్న కోణంగా పోలీసులు కూపీ లాగుతున్నారు. ఈ దర్యాప్తులో అంతుచిక్కని ప్రశ్నలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. దాదాపు 570 కిలోమీటర్ల దూరం తీసుకొచ్చి పడేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? హత్యకేసులో ప్రమేయమున్న ముగ్గురికి చిన్నారితో ఏం సంబంధం ఉందన్న కోణంలో ఆరా తీస్తున్నారు.
అయితే, ఈ కేసులో మొత్తం ముగ్గురు ఇన్వాల్వ్ అయ్యారని ప్రాథమికంగా పోలీసులు భావిస్తున్నారు. చిన్నారి మృతదేహాన్ని ఓ మహిళ తీసుకొచ్చి పడేసి మెహదీపట్నం వైపు వెళ్లినట్లుగా సీసీ ఫుటేజ్ దొరకడంతో ఆ దిశగా కూపీ లాగుతున్నారు. బాలిక మృతదేహాన్ని పడేసి వెళ్లిన మహిళ, ఆమె వెంట వచ్చిన వ్యక్తి, బాబు ఎవరనే విషయంపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆ మహిళ ఆచూకీ కోసం పదికి పైగానే పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి. ఆ నిందితులు బెంగళూరు పారిపోయే అవకాశాలు ఉండడంతో.. అటు వైపు వెళ్లే మార్గాల్లో పోలీసుల్ని అలర్ట్ చేశారు. నిందితులు వెళ్లిన దారిలోనే సీసీటీవీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. అన్నీ పోలీస్ స్టేషన్‌లో చిన్నారి ఫోటోతో వివరాలు కొరకు అరా తీస్తున్నారు.
ఇదిలావుంటే, చిన్నారిని బెంగళూరులో హత్య చేసి హైదరాబాద్‌లో పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఓ ఆటో డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో ముగ్గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరిని విచారించడం ద్వారా పూర్తి సమాచారం రాబట్టే పనిలోపడ్డారు పంజాగుట్ట పోలీసులు.
Read Also… Crime News: పెద్దపల్లి జిల్లాలో మరో దారుణం.. ప్రేమించలేదని యువతి గొంతు కోసిన ఉన్మాది..!