AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tamil Nadu Rains: తమిళనాడుకు వాతావరణ శాఖ హెచ్చరిక.. మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలుంటాయని వెల్లడి..

తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. పలు జిల్లాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. అయితే వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. చెన్నైలో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది...

Tamil Nadu Rains: తమిళనాడుకు వాతావరణ శాఖ హెచ్చరిక.. మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలుంటాయని వెల్లడి..
Rain
Srinivas Chekkilla
|

Updated on: Nov 09, 2021 | 5:35 PM

Share

తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. పలు జిల్లాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. అయితే వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. చెన్నైలో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో నవంబర్ 9 మంగళవారం తెన్కాసి, తిరునల్వేలి, తూత్తుకుడి, కడలూరు, మదురై, శివగంగై జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. చాలా వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని పేర్కొంది.

చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్‌పట్టు, అరియలూరు, పెరంబలూరు, తిరుచిరాపల్లి, విల్లుపురం జిల్లాలు, పుదుచ్చేరిలోని కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మిగిలిన ప్రాంతాల్లో చాలా చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. అక్టోబర్ 10న కడలూరు, విల్లుపురం, పుదుకోట్టై, శివగంగ, రామనాథపురం, పుదుచ్చేరి, కారైకాల్‌లో అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. చెన్నై, తిరునల్వేలి, కన్యాకుమారి, తెన్‌కాసి, విరుదునగర్, మదురై, అరియలూరు, పెరంబలూరు, కాంచీపురం, తిరువళ్లూరు మరియు చెంగల్‌పట్టు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

నవంబర్ 11వ తేదీన చెన్నై, కాంచీపురం, చెంగల్‌పట్టు, విల్లుపురం, తిరువణ్ణామలై జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తిరువణ్ణామలై, విల్లుపురం, చెన్నై, చెంగల్పట్టు, కాంచీపురం, తిరువలూరులకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. నీలగిరి, కోయంబత్తూరు, తిరుప్పూర్, దిండిగల్, సేలం, కళ్లకురుచ్చి, తిరుపత్తూరు, వెల్లూరు, రాణిపేట్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. రానున్న 36 గంటల్లో నైరుతి, దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు చెప్పింది. ఇది నవంబర్ 11 తెల్లవారుజామున ఉత్తర తమిళనాడు తీరానికి చేరుకునే అవకాశం ఉందని పేర్కొంది.

చెన్నైలో నవంబర్ 9 మధ్యాహ్నం నుండి మంచి స్పెల్ ఉంటుందని తమిళనాడు వెదర్‌మ్యాన్ అనే పేరు గల ప్రదీప్ జాన్ చెప్పాడు. రాత్రి నుండి వర్షం పెరుగుతుందని తెలిపారు. నవంబర్ 10 నుంచి11 మధ్యాహ్నం వరకు నాన్‌స్టాప్‌గా వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నాడు. వేదారణ్యం-తిరువారూర్ బెల్ట్ లో ఇప్పటికే ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. చెన్నై కార్పొరేషన్ ఇప్పటికే 41లోతట్టు ప్రాంతాలను గుర్తించిందని, ఆ ప్రాంతాల్లో నివసించే ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని కార్పొరేషన్ కమిషనర్ చెప్పారు. నవంబర్ 9 మధ్యాహ్నం 12.30 గంటలకు IMD విడుదల చేసిన బులెటిన్‌లో, డెల్టా జిల్లాలు, పుదుకోట్టై, రామనాథపురం, కారైకాల్‌లోని ఏకాంత ప్రదేశాలలో అతి భారీ వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది.

తెన్కాసి, తిరునల్వేలి, తూత్తుకుడి, కడలూరు, మదురై మరియు శివగంగై జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు మరియు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్‌పట్టు, అరియలూరు, పెరంబలూరు, తిరుచిరాపల్లి, విల్లుపురం జిల్లాలు, పుదుచ్చేరిలోని కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మిగిలిన తమిళనాడులో చాలా చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. అదేవిధంగా, అక్టోబర్ 10 నాటికి, IMD డెల్టా జిల్లాలు, కడలూరు, విల్లుపురం, పుదుకోట్టై, శివగంగ, రామనాథపురం మరియు పుదుచ్చేరి మరియు కారైకాల్‌లో అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. చెన్నై, తిరునల్వేలి, కన్యాకుమారి, తెన్‌కాసి, విరుదునగర్, మదురై, అరియలూరు, పెరంబలూరు, కాంచీపురం, తిరువళ్లూరు మరియు చెంగల్‌పట్టు జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. నవంబర్ 11వ తేదీన చెన్నై, కాంచీపురం, చెంగల్‌పట్టు, విల్లుపురం మరియు తిరువణ్ణామలై జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

Read Also.. Mizoram CM: మా మంత్రులకు హిందీ, ఇంగ్లీషు రాదు.. మా భాష తెaలిసిన సీఎస్ ఉంటే బెటర్.. కేంద్రానికి మిజోరం సీఎం లేఖ

Follow Us
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?