AIESL Jobs: ఏఐ ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్‌లో 371 ఎయిర్‌క్రాఫ్ట్ టెక్నీషియన్ ఉద్యోగాలు.. పదో తరగతి/డిప్లొమా అర్హత..

ముంబయిలోని ఏఐ ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్.. 371 ఫిక్స్‌డ్ టర్మ్ ఎంప్లాయ్‌మెంట్ ప్రాతిపదికన ఎయిర్‌క్రాఫ్ట్ టెక్నీషియన్స్, టెక్నీషియన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు..

AIESL Jobs: ఏఐ ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్‌లో 371 ఎయిర్‌క్రాఫ్ట్ టెక్నీషియన్ ఉద్యోగాలు.. పదో తరగతి/డిప్లొమా అర్హత..
AI Engineering Services Limited
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 27, 2023 | 1:41 PM

ముంబయిలోని ఏఐ ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్.. 371 ఫిక్స్‌డ్ టర్మ్ ఎంప్లాయ్‌మెంట్ ప్రాతిపదికన ఎయిర్‌క్రాఫ్ట్ టెక్నీషియన్స్, టెక్నీషియన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు.. పోస్టును బట్టి ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ సబ్జెక్టులతో పదో తరగతి, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ, ఏఎమ్ఈ డిప్లొమా సర్టిఫికేట్‌, ఇంజనీరింగ్‌లో డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు మార్చి 1, 2023 నాటికి 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితి విషయంలో సడలింపు ఉంటుంది.

ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో మార్చి 20, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ కేటగిరికి చెందిన వారు రూ.1000లు, ఎస్సీ/ఎస్టీ/ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్ధులు రూ.500లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించాలి. స్కిల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, టెక్నికల్ అసెస్‌మెంట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.25,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • ఎయిర్‌క్రాఫ్ట్ టెక్నీషియన్(ఎ అండ్‌ సి) పోస్టులు: 199
  • ఎయిర్‌క్రాఫ్ట్ టెక్నీషియన్(ఏవియానిక్స్) పోస్టులు: 97
  • స్కిల్డ్ టెక్నీషియన్(ఫిట్టర్ అండ్‌ షీట్ మెటల్) పోస్టులు: 31
  • స్కిల్డ్ టెక్నీషియన్ (పెయింటర్) పోస్టులు: 12
  • స్కిల్డ్ టెక్నీషియన్ (టైలర్) పోస్టులు: 14
  • స్కిల్డ్ టెక్నీషియన్ (వెల్డర్) పోస్టులు: 1
  • స్కిల్డ్ టెక్నీషియన్ (డ్రాఫ్ట్స్‌మ్యాన్- మెకానికల్) పోస్టులు: 1
  • స్కిల్డ్ టెక్నీషియన్ (ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్) పోస్టులు: 10
  • స్కిల్డ్ టెక్నీషియన్ (కార్పెంటర్) పోస్టులు: 2
  • ఎంఆర్‌ఏసీ(మెకానికల్ రిఫ్రిజిరేషన్ ఎయిర్ కండిషన్) పోస్టులు: 2
  • ఎంఎంఓవీ(మెకానికల్ మోటార్ వెహికల్) పోస్టులు: 2

నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.