Govt Job Offers: భారీ ఉద్యోగ ప్రకటన.. పెళ్లికాని మహిళలు మాత్రమే అర్హులు.. పూర్తి వివరాలివే..

NDA, Naval Recruitment: భారత అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల ప్రకారం.. నేషనల్ డిఫెన్స్, ఇండియన్ నేవల్ అకాడమీలో మహిళలకు కూడా ప్రవేశాలు కల్పిస్తున్నట్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్..

Govt Job Offers: భారీ ఉద్యోగ ప్రకటన.. పెళ్లికాని మహిళలు మాత్రమే అర్హులు.. పూర్తి వివరాలివే..
Woman
Follow us
Shiva Prajapati

| Edited By: Janardhan Veluru

Updated on: Sep 25, 2021 | 2:29 PM

NDA, Naval Recruitment: భారత అత్యున్నత న్యాయస్థానం(సుప్రీంకోర్టు) ఆదేశాల ప్రకారం.. నేషనల్ డిఫెన్స్, ఇండియన్ నేవల్ అకాడమీలో మహిళలకు కూడా ప్రవేశాలు కల్పిస్తున్నట్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. ఎన్డీయే; నావల్ అకాడమీ పరీక్షకు అవివాహితులైన మహిళా అభ్యర్థులు అక్టోబర్ 8వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చునని ప్రకటించింది. వచ్చే ఏడాది మే నుంచి మహిళలను ఎన్డీయేలోకి తీసుంటామన్ని కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తోసిపుచ్చిన సుప్రీంకోర్టు.. ఎన్డీయే, నావల్ అకాడమీలో మహిళలకు కూడా పురుషులతో సమానమైన అవకాశం కల్పించాలని ఆదేశించింది.

దీని ప్రకారం.. యూపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. జూన్ 9న విడుదల చేసిన మార్గదర్శకాలు మహిళా అభ్యర్థులకు కూడా వర్తిస్తాయని, ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే మహిళా అభ్యర్థులు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఇక ఎన్డీయే, నావల్ అకాడమీ పరీక్ష నవంబర్ 14వ తేదీన ఉంటుందని తెలిపారు. కాగా, పుణె, ఖడక్‌వాస్లా ఎన్డీయే అకాడమీల్లో మొత్తం 370 సీట్లు ఉండగా.. కేరళలోని కన్నూరు ఎజిమాలా, కన్నూరు జిల్లాలోని నావల్ కాడమీలో 30 సీట్లు ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాల కోసం upsconline.nic.in ని సంప్రదించవచ్చునని తెలిపారు.

Also read:

Lungs Health: మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నిర్లక్ష్యం చేశారో ప్రాణాలకే ముప్పు..

Monkey Revenge: విలన్‌గా మారిన కోతి.. రివేంజ్ తీర్చుకోవడానికి ఏకంగా 22 కిలోమీటర్లు ప్రయాణించింది..

Beauty Tips For Skin: మొటిమలు, మచ్చలు లేని ముఖారవిందం కావాలా? అయితే ఈ 5 టిప్స్ ఫాలో అవ్వండి..