ANU Recruitment: ఆచార్య నాగార్జున వర్సిటీలో టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలు.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
ANU Recruitment 2021: ఆంధ్రప్రదేశ్‌లోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. గుంటూరులో ఉన్న ఈ విశ్వవిద్యాలయంలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. రాత పరీక్ష ద్వారా నియామకాలు చేపట్టనున్న...
ANU Recruitment 2021: ఆంధ్రప్రదేశ్‌లోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. గుంటూరులో ఉన్న ఈ విశ్వవిద్యాలయంలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. రాత పరీక్ష ద్వారా నియామకాలు చేపట్టనున్న ఈ దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 07 ఖాళీలను భర్తీ చేయనున్నారు. * ఇందులో భాగంగా 03 టీచింగ్ పోస్టులు, 04 నాన్ టీచింగ్ పోస్టులు ఉన్నాయి. * టీచింగ్ పోస్టుల్లో భాగంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ (రూరల్ డెవలప్‌మెంట్, కంప్యూటర్ సైన్స్), అసోసియేట్ ప్రొఫెసర్ ( ఇంగ్లిష్) ఖాళీలను భర్తీ చేయనున్నారు. * నాన్ టీజింగ్ పోస్టులకు గాను స్వీపర్, క్లీనర్, యుటెన్‌పిల్ క్లీనర్, మార్కర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. * టీచింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెకట్టుల్లో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ డిగ్రీ ఉత్తీ్ర్ణత పొంది ఉండాలి. అంతేకాకుండా నెట్/స్లెట్/సెట్ అర్హత పొంది ఉండాలి. * నాన్ టీచింగ్ పోస్టులను దరఖాస్తు చేసుకనే వారు మార్కర్ పోస్టులకి పదో తరగతి, మిగతా పోస్టులకి సంబంధిత పనిలో అనుభవంతో పాటు చదవడం, రాయడం వచ్చి ఉండాలి.
ముఖ్యమైన విషయాలు..
* పైన తెలిపిన ఖాళీలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 13,000 నుంచి రూ. 40,270 జీతంగా చెల్లిస్తారు. * అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. * అభ్యర్థులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. * ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీగా 20-08-2021 నిర్ణయించారు. * పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: రైతులకు గుడ్ న్యూస్..! విదేశీ కూరగాయాలకు పెరుగుతున్న డిమాండ్.. బ్రోకలి సాగుతో అధిక లాభాలు..
Corona Eta Variant: కరోనా వైరస్ కొత్త వేరియంట్ ‘ఈటా’ కేసు వెలుగులోకి..
Rummy Online: మాయదారి రమ్మీ.. ఆ కుటుంబాన్ని మింగేసింది.. విషాద కథనం