LPG Connection: కొత్త వంట గ్యాస్ కనెక్షన్ కావాలా? సిలిండర్ రీఫిల్ బుక్ చేసుకోవాలా? చాలా సింపుల్ ప్రాసెస్ మీకోసం..
LPG Connection: ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ (IOC) కు చెందిన కొత్త వంట గ్యాస్ (LPG) కనెక్షన్ అవసరమా? అయితే ఈ నెంబర్‌కు..
LPG Connection: ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ (IOC) కు చెందిన కొత్త వంట గ్యాస్ (LPG) కనెక్షన్ అవసరమా? అయితే ఈ నెంబర్‌కు 8454955555 ఒక్క మిస్డ్ కాల్ ఇవ్వండి. అలాగే.. ఇప్పటికే ఉన్న కస్టమర్‌లు రిజిస్టర్డ్ ఫోన్ నంబర్ నుండి మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా LPG రీఫిల్‌ను బుక్ చేసుకోవచ్చు. ఐఓసి చైర్మన్ ఎస్ఎం వైద్య సోమవారం నాడు దేశంలో ఎక్కడైనా కొత్త LPG కనెక్షన్ పొందడానికి మిస్డ్ కాల్ సౌకర్యాన్ని ప్రారంభించినట్లు ప్రకటించారు. దీంతోపాటు.. కస్టమర్ ఇంటి వద్ద డబుల్ బాటిల్ కనెక్షన్ (DBC) వినియోగించుకునే సదుపాయాన్ని కూడా ఆయన ప్రారంభించారు. దీని ప్రకారం.. డెలివరీ సిబ్బంది ఇప్పటికే ఉన్న సింగిల్ బాటిల్ కనెక్షన్ల్(SBC) కస్టమర్లను డబుల్ బాటిల్ కనెక్షన్(DBC)కి మార్చే అవకాశం కల్పించారు. ఆసక్తి ఉన్న వినియోగదారులు సాధారణ 14.2 కిలోల సిలిండర్‌కు బదులుగా 5 కిలోల సిలిండర్‌ను బ్యాకప్‌గా ఎంచుకోవచ్చు.
‘‘దేశీయ వినియోగదారులందరికీ కొత్త LPG కనెక్షన్‌ని పొందడానికి IOC తన మిస్డ్ కాల్ సదుపాయాన్ని విస్తరించింది. దేశవ్యాప్తంగా ఉన్న కస్టమర్‌లు కొత్త కనెక్షన్ పొందడానికి 84549 55555 కి మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు’’ అని ఐఒసి ప్రకటించింది. కాగా, ప్రస్తుతం, ఈ సౌకర్యాన్ని అందించే ఏకైక చమురు మార్కెటింగ్ కంపెనీ ఐఒసి మాత్రమే. దేశ వ్యాప్తంగా కస్టమర్ల సౌలభ్యం కోసం ఈ విధానాన్ని తీసుకువచ్చామని ఎస్ఎం వైద్యం తెలిపారు. ‘నిన్నటి కంటే మెరుగైన సేవలను నేడు అందించాలనేదే మా నిరంతర ప్రయత్నం. వినియోగదారులకు అన్ని రకాల సౌకర్యాలను అందిస్తున్నాము.’’ అని చెప్పుకొచ్చారు.
కాగా, దేశవ్యాప్తంగా రీఫిల్ బుకింగ్ కోసం మిస్డ్ కాల్ సౌకర్యం, ఎంచుకున్న కంపెనీలో కొత్త కనెక్షన్లు 2021, జనవరిలో ప్రారంభం అయ్యాయింది. ఈ మిస్డ్ కాల్ సర్వీస్ కారణంగా వినియోగదారులకు చాలా సమయం ఆదా అవుతోంది. అలాగే.. కొత్త కనెక్షన్ కోసం అప్లై చేసుకోవడానికి ఈ మిస్డ్ కాల్ సర్వీస్ అత్యంత సులభంగా, ఖర్చు లేకుండా ఉపయోగపడనుంది. ఈ విధానంలో ముఖ్యంగా వృద్ధులు, గ్రామీణ ప్రాంతాల వారికి ప్రయోజనం చేకూరనుంది.
కాగా, LPG రీఫిల్స్ కోసం బుకింగ్, చెల్లింపు సౌలభ్యాన్ని అందించడానికి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కంపెనీ.. సరికొత్త టెక్నాలజీని ఉపయోగిస్తుంది. వినియోగదారుడు బుక్ అండ్ భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (BBPS) ద్వారా వారి ఎల్పీజీ రీఫిల్ కోసం చెల్లింపులు జరుపవచచు. అలాగే.. ఇండియన్ వన్ యాప్, లేదా ద్వారా పోర్టల్ Https://cx.Indianoil.In ద్వారా అయినా చెల్లించవచ్చు. ఇక వినియోగదారులు రీఫిల్ కోసం వాట్సాప్ నెంబర్ 75888 88824, SMS/IVRS నెంబర్ 77189 55555 లేదా అమెజాన్, పేటీఎం ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు.
Also read:
YSR Nethanna Nestham: ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. రేపే లబ్ధిదారుల అకౌంట్‌లో రూ.24 వేలు..
Gardening: ఇంటితోట కోసం మొక్కలు కొంటున్నారా? ఈ విషయాలు జాగ్రత్తగా పరిశీలించండి..