Aadhaar: మీ ఆధార్‌లో మొబైల్‌ నంబర్‌ను మార్చుకోవడం ఎలా? పూర్తి వివరాలు

ఆధార్ నంబర్ అనేది వ్యక్తిగత గుర్తింపు మాత్రమే కాదు, ముఖ్యమైన అవసరాలకు తప్పనిసరి అయిపోయింది. చాలా ప్రభుత్వ కార్యాలయాల్లో ఆధార్ ప్రధాన వనరుగా పరిగణిస్తున్నారు. దీంతో చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరికీ ఆధార్‌ను తప్పనిసరి చేశారు. బోర్డింగ్ స్కూల్ నుండి ఆసుపత్రి వరకు, ప్రతిచోటా ఆధార్‌ను ప్రాథమిక వనరుగా..

Aadhaar: మీ ఆధార్‌లో మొబైల్‌ నంబర్‌ను మార్చుకోవడం ఎలా? పూర్తి వివరాలు
Aadhaar
Follow us
Subhash Goud

|

Updated on: Jul 12, 2024 | 8:43 AM

ఆధార్ నంబర్ అనేది వ్యక్తిగత గుర్తింపు మాత్రమే కాదు, ముఖ్యమైన అవసరాలకు తప్పనిసరి అయిపోయింది. చాలా ప్రభుత్వ కార్యాలయాల్లో ఆధార్ ప్రధాన వనరుగా పరిగణిస్తున్నారు. దీంతో చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరికీ ఆధార్‌ను తప్పనిసరి చేశారు. బోర్డింగ్ స్కూల్ నుండి ఆసుపత్రి వరకు, ప్రతిచోటా ఆధార్‌ను ప్రాథమిక వనరుగా అడుగుతారు. మీరు మీ ఆధార్ కార్డును మర్చిపోయినా లేదా పోగొట్టుకున్నా, మీరు మీ ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో సులభంగా తిరిగి పొందవచ్చు. ఇందుకోసం ఆధార్‌కు ప్రత్యేక వెబ్‌సైట్ కూడా ఉంది. మీరు ఈ వెబ్‌సైట్‌కి వెళ్లి మీ మొబైల్ నంబర్‌ను నమోదు చేస్తే, మీ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని నమోదు చేసి ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి: నీతా అంబానీ ధరించిన కుర్తా-షల్వార్‌ హైదరాబాద్‌లో తయారు చేసిందే.. స్పెషల్ ఏమిటంటే..

మొబైల్ నంబర్ మార్చాలంటే ఏం చేయాలి?

అయితే ఆధార్‌లో మొబైల్‌ నంబర్‌ను మార్చుకోవాలని సులభంగా చేసుకోవచ్చు. మీ మొబైల్ నంబర్ తప్పుగా ఉంటే, మీరు వెంటనే దాన్ని మార్చుకోవాలి. లేదా మీరు వేరే నంబర్‌ను యాడ్‌ చేయాలన్నా చేసుకోవచ్చు. కానీ మీరు ఆన్‌లైన్‌లో మొబైల్ నంబర్‌ను మార్చలేరు. మీరు మీ ఇంటికి సమీపంలోని ఈ-సేవా కేంద్రాల్లో మాత్రమే మీ మొబైల్ నంబర్‌ను మార్చుకోవచ్చు.

ఆధార్‌లో మొబైల్ నంబర్‌ని మార్చడం ఎలా?

  • మీ సమీపంలోని ఆధార్ ఇ సేవా కేంద్రానికి వెళ్లండి.
  • అక్కడ మీకు దిద్దుబాట్లు చేయడానికి ఒక ఫారమ్ అందిస్తారు. అందులో మీరు ఉపయోగించాలనుకుంటున్న మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి.
  • తర్వాత చేతిముద్ర, కంటి నమోదు చేయించుకోవాలి.
  • తర్వాత నింపిన ఫారాన్ని మీసేవ కేంద్రాల అధికారులకు అందజేయాలి. ఇందుకు రూ.50 రుసుము వసూలు చేస్తారు.
  • దీన్ని అనుసరించి మార్పులు చేయడానికి మీకు నంబర్ ఇవ్వబడుతుంది. ఆధార్ వెబ్‌సైట్ ద్వారా ఆ నంబర్‌తో మీ మొబైల్ నంబర్ మారిందో లేదో చెక్ చేసుకోవచ్చు.

మీ మొబైల్ నంబర్ 90 రోజుల్లో అప్‌డేట్ అవుతుంది.

గతంలో ఆధార్ నంబర్ బదిలీ సర్వీస్ వెబ్‌సైట్ ద్వారా అందించేవారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా దీన్ని మార్చుకునేందుకు ఈ-సేవా కేంద్రాలకు వెళ్లే వెసులుబాటును UDAI కల్పించింది. అందుకే మీరు ఆధార్‌లో మొబైల్ నంబర్‌ను మార్చాలనుకుంటే, మీరు పై పద్ధతిని అనుసరించి, సేవా కేంద్రాలలో మార్పులు చేసుకోవచ్చు.

ఇది కూడా చదవండి: ఏడాదికి రూ.436 ప్రీమియంతో రూ.2 లక్షల బీమా.. అదిరిపోయే స్కీమ్‌!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

భారత్‌-జర్మనీ మధ్య సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌..!
భారత్‌-జర్మనీ మధ్య సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌..!
రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..
రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!
వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!
ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.
ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.
శివునికి నమస్కరిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి... CPR చేసినా..
శివునికి నమస్కరిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి... CPR చేసినా..