MI Electric Scooter: ఎంఐ నుంచి కొత్త ఈవీ స్కూటర్.. మోడల్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..

ఎంఐ కంపెనీ కూడా సరికొత్త ఈవీ వాహనాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. Xiaomi ఎలక్ట్రిక్ స్కూటర్ 4 అల్ట్రా ఎండబ్ల్యూసీ 2023 ఇటీవల కంపెనీ లాంచ్ చేసింది. ఈ కొత్త స్కూటర్ ఓ సారి చార్జి చేస్తే 70 కిలో మీటర్ల పరిధితో వస్తుంది. 940 వాట్స్ పీక్ పవర్‌ మోటార్‌తో గంటకు 25 కిలో మీటర్ల గరిష్ట వేగంతో ఈ స్కూటర్ వస్తుంది.

MI Electric Scooter: ఎంఐ నుంచి కొత్త ఈవీ స్కూటర్.. మోడల్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..
Xiaomi Electric Scooter
Follow us
Srinu

|

Updated on: Mar 01, 2023 | 2:45 PM

ప్రస్తుతం దేశంలో నడుస్తున్న ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్‌కు అనుగుణంగా చాలా కంపెనీలు కొత్తకొత్తగా ఎలక్ట్రిక్ వాహనాలు రిలీజ్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఇదే కోవలోకి ఎంఐ కంపెనీ కూడా సరికొత్త ఈవీ వాహనాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. Xiaomi ఎలక్ట్రిక్ స్కూటర్ 4 అల్ట్రా ఎండబ్ల్యూసీ 2023 ఇటీవల కంపెనీ లాంచ్ చేసింది. ఈ కొత్త స్కూటర్ ఓ సారి చార్జి చేస్తే 70 కిలో మీటర్ల పరిధితో వస్తుంది. 940 వాట్స్ పీక్ పవర్‌ మోటార్‌తో గంటకు 25 కిలో మీటర్ల గరిష్ట వేగంతో ఈ స్కూటర్ వస్తుంది. ముఖ్యంగా పట్టణ ప్రాంత వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ స్కూటర్‌ను కంపెనీ లాంచ్ చేసింది. డ్యుయల్ సస్పెన్షన్‌తో పాటు విశాలమైన డెక్, సౌకర్యవంతమైన ప్రయాణం కోసం పొడవైన హ్యాండిల్ బార్‌లు ఉన్నాయి. 940 వాట్స్ పీక్ పవర్‌తో 500 వాట్స్ మోటర్‌తో పని చేస్తుంది. ఇందులో నాలుగు రైడ్ మోడ్‌లు అందుబాటులో ఉన్నాయి. అలాగే పాదచారుల సెట్టింగ్ కోసం 6 కిలో మీటర్ల పరిధి ఉంది. 561.5 డబ్ల్యూహెచ్ లిథియం-అయాన్ బ్యాటరీతో వస్తుంది. హై పవర్ అడాప్టర్ వల్ల 6.5 గంటల్లో పూర్తిగా చార్జ్ అవుతుంది. 

ముఖ్యంగా ప్రయాణ గణాంకాలను లెక్కించడానికి ఎంఐ హోం సపోర్ట్‌తో వస్తుంది. 10 ఇంచుల డ్యూరా జెల్ టైర్లతో పాటు ట్యాబ్‌లెస్ ఫెసిలిటీతో వస్తుంది. సెల్ఫ్ సీలింగ్‌తో ఆకట్టుకుంటుంది. ఈ-ఏబీఎస్, డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్, హెడ్ లైట్, టెయిల్ లైట్ వంటివి ఉపయోగకరంగా ఉంటాయి. ఈ స్కూటర్ మొత్తం బరువు 24.5 కిలోలు. అలాగే 120 కిలోల బరువును మోస్తుంది. అయితే ఈ స్కూటర్ ఇండియాలో ఎప్పటి నుంచి అందుబాటులో ఉంటుందో కంపెనీ పేర్కొనలేదు. అలాగే ప్రస్తుతం స్పెయిన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తలు చదవండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!