AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AI Bhashini: ఈ యాప్ ఉంటే అన్ని భాషలూ వచ్చినట్టే.. పంచాయతీ పాలనలోనూ కీలకం..!

దేశంలో ప్రతి ఒక్కరికీ తమ మాతృభాషపై పూర్తిస్థాయిలో పట్టు ఉంటుంది. దాని ద్వారా అన్ని విషయాలను చాలా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. ఇతర భాషలు ఎన్ని నేర్చుకున్నా అవన్నీసొంతభాష పునాది మీదే ఆధారపడి ఉంటాయి. మన దేశంలో అనేక భాషలు వాడుకలో ఉన్నాయి. చాలామంది తమ సొంత భాషలో తప్ప మిలిగిన వాటిని అర్థం చేసుకోలేరు.

AI Bhashini: ఈ యాప్ ఉంటే అన్ని భాషలూ వచ్చినట్టే.. పంచాయతీ పాలనలోనూ కీలకం..!
Ai Bhashini
Nikhil
|

Updated on: Dec 01, 2024 | 7:30 PM

Share

భాషా పరమైన అడ్డంకులను తొలగించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. పంచాయతీ పాలనలో ఆర్టిపీషియల్ ఇంటిలిజెన్స్ ఆధారిత భాషిణిని ప్రవేశపెట్టింది. దీని ద్వారా ప్రతి ఒక్కరూ తన సొంత భాషలోనే ప్రభుత్వ విధానాలను తెలుసుకోగలుగుతారు. వారణాసిలో ఇటీవల జరిగిన కాశీ తమిళ సంగమ కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ భాషిణి అనే సాధనాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయన హిందీలో ప్రసంగించారు. ఆ ప్రసంగం భాషిణి ద్వారా తమిళంలోకి అక్కడికక్కడే అనువాదంపై ప్రసారమైంది. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ఆధారంగా పనిచేసే భాషా అనువాద సాధనం ఇది. భారతీయలందరూ తమ సొంత భాషల్లో ఇంటర్నెట్, డిజిటల్ సేవలు పొందేలా చూడడమే భాషిణి ప్రథమ కర్తవ్యం. భాషా అడ్డంకులను తొలగించడంతో పాటు వివిధ ప్రాంతాల వారికి ఈ కొత్త యాప్ ఏకం చేస్తుంది.

పంచాయతీ పాలనలో భాషిణి సేవలను ఉపయోగించుకోవడం ద్వారా ప్రజలకు మరిన్ని సేవలు అందించేందుకు కార్యాచరణ రూపొందించారు. దీనిలో భాగంగా పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ 22 భారతీయ భాషాలలో ఈ టెక్నాలజీని వాడుతోంది. దీనికోసం ఈగ్రామ్ స్వరాజ్ అనే పోర్టల్ ను ఉపయోగిస్తుంది. ప్రస్తుతం కొన్ని మినహా మిగిలిన అన్ని భాషాలలో ఈ సేవలు అందుతున్నాయి. వీటిలో బోడో, సంతాలి తదితర గిరిజన భాషలతో పాటు నేపాలీ, మైథిలి, డోగ్రీ, ఉర్దూ కూడా ఉండడం గమనార్హం. స్థానిక భాషల ద్వారా క్రమబద్ధమైన ప్రణాళిక, బడ్జెట్, పర్యవేక్షణ ద్వారా పంచాయతీ కార్యకలాపాలను మెరుగుపర్చడం భాషిణి ప్రధాన కర్తవ్యం.

దేశంలో భాషాపరమైన అడ్డంకులను బద్ధలు కొట్టడం ద్వారా సమ్మిళిత భాగస్వామ్యాన్ని, మెరుగైన సేవలు అందజేస్తుంది. స్థానిక అవసరాలను తీర్చేందుకు పంచాయతీలకు అవకాశం కలుగుతుంది. మంత్రిత్వ శాఖ వివిధ కాన్ఫరెన్సులు, సెమినార్ నిర్వహించినప్పడు భాషిణిలోని వానియానువాద్ (వాయిస్ టు వాయిస్) ను ఉపయోగిస్తుంది. స్థానిక భాషలలో కంటెంట్ ను పంపిణీ చేయడానికి దీని ద్వారా అవకాశం కలుగుతుంది. పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్ 2024పై ఇటీవల జాతీయ వర్క్ షాపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐ ఆధారిత సాధనాలు బెంగాలీ, తమిళం, గుజరాత్, తెలుగుతో సహా ఎనిమిది ప్రాంతీయ భాషల్లో ప్రత్యక్ష ప్రసారాలు చేశాయి. ఏఐ సాంకేతికతతో అనేక ప్రయోజనలు కలుగుతున్నాయి. బడ్జెట్ ను స్థానిక భాషల్లోకి ప్రసారం చేయడానికి ప్రభుత్వానికి సాయం పడుతుంది. తద్వారా పంచాయతీ కార్యకలాపాలను పెంచడానికి దోహద పడుతుంది. గ్రామాల్లో సమస్యలు పరిష్కరించుకోవడానికి అవకాశం కలుగుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి