Income Tax: ఈ ట్యాక్స్ పేయర్లకు గుడ్‌న్యూస్‌.. డిసెంబర్ 15 వరకు గడువు పెంపు..!

Income Tax: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) అంతర్జాతీయ లావాదేవీలు చేసే పన్ను చెల్లింపుదారుల కోసం 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడానికి గడువును..

Income Tax: ఈ ట్యాక్స్ పేయర్లకు గుడ్‌న్యూస్‌.. డిసెంబర్ 15 వరకు గడువు పెంపు..!
Follow us
Subhash Goud

|

Updated on: Dec 01, 2024 | 7:18 PM

ITR Filing: ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ప్రతి ఏడాది తప్పకుండా ఆదాయపు పన్ను రిటర్నులు ఫైల్ చేయాల్సి ఉంటుంది. అయితే పన్ను చెల్లింపుదారుల్లో పలు కేటగిరీలు ఉంటాయి. సాధారణ పన్ను చెల్లింపుదారులకు జులై 31తోనే గడువు ముగుస్తుంది. కానీ, విదేశీ ఆస్తులు గల వారు, వ్యాపారస్థులకు ఈ గడువు తేదీలు వేరుగా ఉంటాయి. ఈ ఆర్థిక సంవత్సరం 2023-24కి (2024-25 మదింపు సంవత్సరం) సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించాల్సి ఉంటుంది. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ యాక్ట్‌ 1961లోని సెక్షన్ 92ఇ కింద రిటర్నులు ఫైల్ చేసే వారికి ఊరట కల్పించే నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సీబీడీటీ.

ఇది కూడా చదవండి: PAN 2.0: పాన్ 2.0లో పాత పాన్ కార్డ్ చెల్లదా?.. ప్రభుత్వం ఏం చెబుతోంది?

ఇవి కూడా చదవండి

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) అంతర్జాతీయ లావాదేవీలు చేసే పన్ను చెల్లింపుదారుల కోసం 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయడానికి గడువును 15 రోజుల పాటు అంటే డిసెంబర్ 15 వరకు పొడిగించింది. సెక్షన్ 92Eలో సూచించిన నివేదికలను సమర్పించాల్సిన పన్ను చెల్లింపుదారులకు ఈ సౌకర్యం అందించింది. ఇంతకు ముందు ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 139(1) కింద ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయడానికి చివరి తేదీ నవంబర్ 30.

కేంద్ర ప్రభుత్వం వార్షిక ప్రాతిపదికన అంటే అక్టోబర్-మార్చి మధ్య మూలధన వ్యయాన్ని 25% పెంచవచ్చు. ప్రభుత్వ మొత్తం వ్యయం కూడా 15 శాతం పెరగవచ్చు. ఎన్నికల సమయంలో ప్రజాకర్షక పథకాలు పెరిగినప్పటికీ, మౌలిక సదుపాయాల కల్పనలో పెట్టుబడులు పెట్టేందుకు కేంద్రం కట్టుబడి ఉంది.

ఇది కూడా చదవండి: LPG Gas Price: గ్యాస్ వినియోగదారులకు షాక్‌.. పెరిగిన సిలిండర్‌ ధర.. ఎంత పెరిగిందో తెలుసా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి