OTT: ఓటీటీ లవర్స్‌కి గుడ్‌న్యూస్‌.. ఈ రీఛార్జ్‌తో సబ్‌స్క్రిప్షన్‌ ఉచితం..

ఓటీటీ సేవలకు ఆదరణ లభిస్తోన్న తరుణంలో టెలికం కంపెనీలు యూజర్లను అట్రాక్ట్‌ చేస్తూ రకరకాల రీఛార్జ్‌ ప్లాన్స్‌ను తీసుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ టెలికం సంస్థ జియో యూజర్లకు ఉచితంగా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్‌ పొందో అవకాశం కల్పించింది. ఇంతకీ ఆ ప్లాన్స్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

OTT: ఓటీటీ లవర్స్‌కి గుడ్‌న్యూస్‌.. ఈ రీఛార్జ్‌తో సబ్‌స్క్రిప్షన్‌ ఉచితం..
Jio
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 01, 2024 | 4:24 PM

ప్రస్తుతం ఓటీటీ సేవలకు ఆదరణ భారీగా పెరుగుతోంది. దీంతో టెలికం కంపెనీలు సైతం యూజర్లను ఆకర్షించే క్రమంలో రకరకాల ప్లాన్స్‌ను అందిస్తున్నాయి. రెగ్యులర్‌ బెనిఫిట్స్‌తో పాటు ఉచితంగా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్స్‌ను అందిస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్‌ జియో అదిరిపోయే ప్లాన్స్‌ను తీసుకొచ్చింది. ఈ రీఛార్జ్‌ ప్లాన్స్‌తో ఉచితంగా నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌ సేవలను పొందొచ్చు. ఆ ప్లాన్స్‌ ఏంటి.? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

రూ. 1799 ప్లాన్‌..

ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే 84 రోజలు వ్యాలిడిటీ లభిస్తుంది. ప్రతీ రోజూ 3జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ 5జీ యాక్సెస్‌ పొందొచ్చు. ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే నెట్‌ఫ్లిక్స్‌ బేసిక్‌ సబ్‌స్క్రిప్షన్‌ పొందొచ్చు. ఈ ప్లాన్‌తో అన్‌లిమిటెడ్‌ వాయిస్‌ కాల్స్‌త పాటు రోజుకు ఉచితంగా 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లను పొందొచ్చు. వీటికి అదనంగా జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్‌కు యాక్సెస్ పొందొచ్చు.

రూ. 1299 ప్లాన్‌..

ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే నెట్‌ఫ్లిక్స్‌ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ పొందొచ్చు. ఈ ప్లాన్‌తో 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. రోజుకు 2 జీబీ డేటా, అన్‌లిమిటెడ్‌ వాయిస్‌కాల్స్‌ పొందొచ్చు. అలాగే రోజుకు ఉచితంగా 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లను పొందొచ్చు. అదనంగా జియో క్లౌడ్‌, జియో సినిమా వంటి సేవలను పొందొచ్చు.

జియో పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌..

జియో రూ. 749 పోస్ట్‌ పెయిడ్ ప్లాన్‌కు కూడా భారీ ఆదరణ ఉంది. ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే నెట్‌ఫ్లిక్స్ బేసిక్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు, అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ కూడా పొందొచ్చు. ఈ ప్లాన్‌లో ప్రతీ నెల 1000 జీబీ డేటా పొందొచ్చు. అలాగే ముగ్గురు కుటుంబ సభ్యులకు అదనపు సిమ్ లభిస్తుంది. అన్‌లిమిటెడ్‌ వాయిస్‌ కాల్స్‌ పొందొచ్చు. ఈ ప్లాన్‌ల అదనంగా జియో సినిమా, జియో క్లౌడ్‌ వంటి సేవలు ఉచితంగా పొందొచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

సూపర్ నేచురల్స్‎తో కుర్ర హీరోలు..రియలిస్టిక్‌ కథలతో స్టార్ హీరోలు
సూపర్ నేచురల్స్‎తో కుర్ర హీరోలు..రియలిస్టిక్‌ కథలతో స్టార్ హీరోలు
శాంసన్, సూర్య ఔట్.. లక్కీ ఛాన్స్ పట్టేసిన ఫ్యూచర్ స్టార్?
శాంసన్, సూర్య ఔట్.. లక్కీ ఛాన్స్ పట్టేసిన ఫ్యూచర్ స్టార్?
ఆ విషయంలో టాలీవుడ్‌ను ఫాలో అవుతున్న బాలీవుడ్.. ఎందులోనో తెలుసుకోం
ఆ విషయంలో టాలీవుడ్‌ను ఫాలో అవుతున్న బాలీవుడ్.. ఎందులోనో తెలుసుకోం
'మీ క్లారిటీతో మరింత దిగజారారు'.. 90 గంటల పనిపై దీపిక మరో పోస్ట్
'మీ క్లారిటీతో మరింత దిగజారారు'.. 90 గంటల పనిపై దీపిక మరో పోస్ట్
బాలయ్యతో సినిమా కోసం హరీష్ ప్రయత్నాలు
బాలయ్యతో సినిమా కోసం హరీష్ ప్రయత్నాలు
నేడు టీటీడీ ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం.. కీలక తీర్మానాలు..!
నేడు టీటీడీ ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం.. కీలక తీర్మానాలు..!
కొత్త ఇల్లు కొన్న హీరోయిన్.. ఏకంగా రూ.100 కోట్లు.
కొత్త ఇల్లు కొన్న హీరోయిన్.. ఏకంగా రూ.100 కోట్లు.
ఊరికి ఇలాంటి వ్యక్తి ఒక్కరున్నా చాలు.. రూ.9లక్షలతో స్కూల్ కట్టాడు
ఊరికి ఇలాంటి వ్యక్తి ఒక్కరున్నా చాలు.. రూ.9లక్షలతో స్కూల్ కట్టాడు
దెయ్యాలను దత్తత తీసుకుంటున్న నిర్మాత
దెయ్యాలను దత్తత తీసుకుంటున్న నిర్మాత
ఓరీ దేవుడో.. ఈ జాలరీ పంట పండింది.. ఒకే ఒక్క చేప ఖరీదు రూ.11కోట్లు
ఓరీ దేవుడో.. ఈ జాలరీ పంట పండింది.. ఒకే ఒక్క చేప ఖరీదు రూ.11కోట్లు