AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Home Loan: సొంతింటి కల సాకారం.. ఆ బ్యాంకుల్లో హోమ్‌లోన్స్‌పై అతి తక్కువ వడ్డీ

భారతదేశంలోని ప్రజలకు సొంత ఇల్లు అనేది ఓ తీరని కోరికగా ఉంటుంది. సొంతింటి కలను నెరవేర్చుకునేందుకు ప్రతి ఒక్కరూ తమ పొదుపును ఉపయోగించడంతో పాటు హోమ్ లోన్ తీసుకుని నెలనెలా ఈఎంఐ రూపంలో చెల్లిస్తూ ఉంటారు. అయితే చాలా బ్యాంకులు ఈఎంఐలపై అదిరే ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఏయే బ్యాంకుల్లో తక్కువ వడ్డీతో సొంతింటి కలను నెరవేర్చుకోవచ్చో? ఓసారి చూద్దాం.

Home Loan: సొంతింటి కల సాకారం.. ఆ బ్యాంకుల్లో హోమ్‌లోన్స్‌పై అతి తక్కువ వడ్డీ
Home Loan
Nikhil
|

Updated on: Dec 01, 2024 | 7:45 PM

Share

నిధుల కొరత కారణంగా చాలా మంది వ్యక్తులు సొంతింటిని కొనుగోలు చేసుకోవాలనే లక్ష్యానికి దూరంగా ఉంటాయి. చాలా బ్యాంకులు గృహ రుణంపై తక్కువ వడ్డీతో లోన్లను అందిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగులకు గృహ రుణం చెల్లింపు అనేది అనువుగా ఉండడంతో గృహ రుణాలను తీసుకుంటూ ఉంటారు. అయితే గృహ రుణంపై వడ్డీ తక్కువగా ఉన్న కొన్ని బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజుతో బాదేస్తూ ఉంటాయి.  కాబట్టి నవంబర్-డిసెంబర్ 2024కి సంబంధించి పోటీ వడ్డీ రేట్లతో ప్రముఖ బ్యాంకులు గ‌ృహ రుణాలను అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏయే బ్యాంకుల్లో ఎంత వడ్డీతో రుణాలను పొందవచ్చో? ఓసారి తెలుసుకుందాం.

గృహ రుణాలపై వడ్డీ రేట్లు ఇలా

  • యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో గృహ రుణాలకు వడ్డీ రేటు 8.35 శాతంగా ఉంది. అలాగే ప్రాసెసింగ్ ఫీజు 0.50 శాతంగా ఉంది. 
  • బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి గృహ రుణానికి ప్రాసెసింగ్ రుసుము లేదు. ఈ బ్యాంకు 8.35 శతం వడ్డీ రేటుతో గృహ రుణాలను అందిస్తుంది. 
  • బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు లేకుండా గృహ రుణాన్ని అందిస్తుంది. 8.35 శాతం వడ్డీ రేటుతో రుణాన్ని అందిస్తుంది. 
  • బ్యాంక్ ఆఫ్ బరోడా 8.40 శాతం నుండి వడ్డీ రేటుతో గృహ రుణాలను అందిస్తుంది. అయితే ఈ బ్యాంకులో ప్రాసెసింగ్ రుసుము నుంచి మినహాయింపు ఉంటుంది.
  • పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన గృహ రుణాల ప్రాసెసింగ్ ఫీజును కూడా మాఫీ చేస్తుంది. ఈ బ్యాంకు 8.40 శాతం వడ్డీ రేటుతో గృహ రుణాన్ని అందిస్తుంది. 

ఆ ఖర్చులపై జాగ్రత్తలు మస్ట్

బ్యాంకు నుంచి గృహ రుణం తీసుకునే సమయంలో కేవలం వడ్డీ రేటు మాత్రమే చూస్తే నష్టపోవాల్సి ఉంటుంది. వడ్డీ రేటుతో పాటు అదనపు ఖర్చులను అర్థం చేసుకోవడం కూడా కీలకం. ప్రాసెసింగ్ ఫీజులు, ప్రీపేమెంట్ ఛార్జీలు, స్థిరమైన లేదా ఫ్లోటింగ్ వడ్డీ రేట్ల ప్రభావం కారణంగా మీ మొత్తం ఈఎంఐ మొత్తం ప్రభావితమవుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!