AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Budget 2024: మరింత చవకగా గృహ రుణాలు? వడ్డీ రేట్లు తగ్గిపోతాయా? మధ్యంతర బడ్జెట్‌ ఇస్తున్న సంకేతమదేనా?

గృహ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గనున్నాయా? ఈఎంఐల భారం కూడా తేలికగా మారనుందా? అంటే అవుననే సమధానాన్నే నిపుణులు ఇస్తున్నారు. మధ్యతరగతి ప్రజలు తమ సొంత ఇళ్లు కొనుక్కోవడం/నిర్మించుకోవడం కోసం ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రారంభించాలని చూస్తోంది. వచ్చే ఐదేళ్లలో 2 కోట్ల ఇళ్లను నిర్మించడంపై దృష్టి సారించిన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) గ్రామీణ్ కూడా గృహ రుణాలకు ఊతమిచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

Budget 2024: మరింత చవకగా గృహ రుణాలు? వడ్డీ రేట్లు తగ్గిపోతాయా? మధ్యంతర బడ్జెట్‌ ఇస్తున్న సంకేతమదేనా?
Home Loan
Madhu
|

Updated on: Feb 06, 2024 | 6:21 AM

Share

గృహ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గనున్నాయా? ఈఎంఐల భారం కూడా తేలికగా మారనుందా? అంటే అవుననే సమధానాన్నే నిపుణులు ఇస్తున్నారు. ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్-2024 ప్రకారం గృహ రుణాలపై వడ్డీ రేట్లలో మార్పులుండే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే బడ్జెట్‌లో ఆర్థిక లోటు 5.1 శాతానికి తగ్గింది. ఇది ఊహించిన దాని తక్కువగా రుణాలు తీసుకునేందుకు కేంద్రానికి వెసులుబాటునిస్తోంది. అంటే దాదాపు రూ.1 లక్ష కోట్లు తక్కువగా రుణాలు తీసుకోవచ్చు. అంతేకాకుండా, ప్రభుత్వ వ్యయంలో ఎక్కువ భాగం మూలధన వ్యయం వైపు మళ్లించడంతో, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తగ్గే అవకాశం ఉంది. ఈ కారణాలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)కు వడ్డీ రేట్లు తగ్గించేందుకు మార్గం సుగమం చేస్తుందని పలు ఆన్‌లైన్‌ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. కేవలం రుణ సంస్థలను ఉద్దేశించి.. ఫిస్కల్ డెఫిసిట్, తక్కువ వడ్డీ రేట్లు, తక్కువ ద్రవ్య లోటును కొనసాగించడం కోసం.. కేంద్ర ప్రభుత్వ రుణాలను తగ్గించడం ద్వారా, ద్రవ్యతను పెంచడం, వడ్డీ రేట్లను సడలించడం కోసం ఆర్‌బీఐ కొత్త ప్రణాళిక చేసే అవకాశం ఉంది. ప్రభుత్వం తన పాత్రను పోషించింది కాబట్టి ఇప్పుడు, రుణాలను మరింత సులభం చేయడం ద్వారా ప్రైవేట్ రంగ పెట్టుబడులను ప్రోత్సహించేలా చేయడం కోసం ఆర్బీఐ చర్యలు చేపట్టాల్సి ఉంది.

చాలా సంతోషకరమైన అంశం..

సీఏ, డిజిటల్ కంటెంట్ సృష్టికర్త నియాటీ మావిన్‌కర్వ్‌ మాట్లాడుతూ ఇది పెద్ద బ్యాంగ్ బడ్జెట్ కాదని ఆర్థిక మంత్రి ఇప్పటికే ప్రకటించారన్నారు. అయితే ద్రవ్య లోటు సంఖ్యలు దాని కంటే తక్కువగా ఉన్నాయని గమనించడం చాలా సంతోషకరమైనదిగా ఆయన పేర్కొన్నారు. తక్కువ ద్రవ్య లోటు అంటే రుణాలపై వడ్డీ ఖర్చును తక్కువ చేసి.. మరిన్ని ముఖ్యమైన విషయాలపై ఖర్చు ఎక్కువ చేయడానికి డబ్బు అందుబాటులో ఉంటుందన్నారు. ఇంకా, హౌసింగ్ లోన్లను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి రెండు హౌసింగ్ అఫర్డబిలిటీ ఇనిషియేటివ్లను పరిచయం చేయాల్సి ఉందన్నారు.

ఇవి కూడా చదవండి

కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా..

  • మధ్యతరగతి ప్రజలు తమ సొంత ఇళ్లు కొనుక్కోవడం/నిర్మించుకోవడం కోసం ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రారంభించాలని చూస్తోంది. వచ్చే ఐదేళ్లలో 2 కోట్ల ఇళ్లను నిర్మించడంపై దృష్టి సారించిన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) గ్రామీణ్ కూడా గృహ రుణాలకు ఊతమిచ్చే అవకాశం ఉంది.
  • పారిశ్రామికవేత్తలు, పర్యాటక రంగంలో ఉన్నవారు తక్కువ వడ్డీ రేట్లు,ఇతర ప్రయోజనాలను చూసే అవకాశం ఉంది.
  • పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, ప్రభుత్వం 50 సంవత్సరాల పాటు వడ్డీ లేని రుణాలను అందించడానికి రూ. 1 లక్ష కోట్లతో ఫండ్‌ను ఏర్పాటు చేస్తుంది. ఆవిష్కరణలు, పరిశోధనలను పెంచడానికి ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించడానికి ఈ నిధులు తక్కువ వడ్డీ రేట్లను అందిస్తాయి.
  • పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్రాలకు దీర్ఘకాలిక వడ్డీలేని రుణాలను అందించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
  • ‘విక్షిత్ భారత్’ పథకం కింద, 50 మందికి వడ్డీ లేని రుణాలను అందించడానికి సుమారు రూ. 75,000 కోట్లు కేటాయించాలని కేంద్రం ప్రతిపాదించింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..