Business Idea: ఇంట్లో ఉండే వ్యాపారం చేద్దామనుకుంటున్నారా? బెస్ట్ ఆప్షన్‌ ఇదే..

ఇక సాధారణంగా వ్యాపారం అనగానే లక్షల్లో ఖర్చు, పెద్ద పెద్ద సెటప్‌ అనే భావనలో ఉంటారు. అయితే ఆలోచనే ఉండాలే కానీ తక్కువ బడ్జెట్‌లో కేవలం శ్రమనే పెట్టుబడిగా మార్చుకొని వ్యాపారం ప్రారంభించవచ్చు. ముఖ్యంగా ప్రస్తుతం ఫుడ్‌ బిజినెస్‌కు మార్కెట్లో...

Business Idea: ఇంట్లో ఉండే వ్యాపారం చేద్దామనుకుంటున్నారా? బెస్ట్ ఆప్షన్‌ ఇదే..
Business Idea
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 20, 2024 | 10:30 PM

ప్రస్తుతం ప్రజల ఆలోచనల్లో మార్పులు వస్తున్నాయి. ఉద్యోగం కంటే వ్యాపారానికి మొగ్గు చూపుతున్నారు. పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో చదువుకున్న వారు కూడా తమదైన తెలివైన ఆలోచనలతో స్టార్టప్‌లను ప్రారంభించి మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. తాము డబ్బులు సంపాదించడమే కాకుండా మరో నలుగురికి ఉపాధి కల్పిస్తున్నారు.

ఇక సాధారణంగా వ్యాపారం అనగానే లక్షల్లో ఖర్చు, పెద్ద పెద్ద సెటప్‌ అనే భావనలో ఉంటారు. అయితే ఆలోచనే ఉండాలే కానీ తక్కువ బడ్జెట్‌లో కేవలం శ్రమనే పెట్టుబడిగా మార్చుకొని వ్యాపారం ప్రారంభించవచ్చు. ముఖ్యంగా ప్రస్తుతం ఫుడ్‌ బిజినెస్‌కు మార్కెట్లో భారీ డిమాండ్ నెలకొంది. ఇప్పుడు ఫుడ్‌ బిజినెస్‌, నష్టం లేని ఒక బెస్ట్‌ ఆప్షన్‌ను చూస్తున్నారు. అయితే ఫుడ్‌ బిజినెస్‌ అనగానే రెస్టారంట్‌ లేదా హోటల్ ఏర్పాటు అని చాలా మంది అనుకుంటారు.

కానీ ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరి యాప్స్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత క్లౌడ్‌ బిజినెస్‌కు భారీగా డిమాండ్ పెరిగింది. మంచి రుచితో ఉన్న వంటకాలు చేయడం మీకు తెలిసి ఉంటే చాలు, భారీ ఆదాయాన్ని పొందొచ్చు. ఈ క్లౌడ్‌ కిచెన్‌ కోసం పెద్దగా ఖర్చు కూడా ఉండదు. ఇంట్లోనే వంటకాలు చేసి ఆన్‌లైన్‌లో విక్రయించవచ్చు. ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరి యాప్స్‌తో ఒప్పందం చేసుకొని మీరు తయారు చేసిన వంటకాలను విక్రయించవచ్చు.

ఉదయం టిఫిన్స్‌ మొదలు మధ్యాహ్నం భోజనం సాయంత్రం స్నాక్స్‌ ఇలా రకరకాల వంటకాలను ఆన్‌లైన్‌లో సేల్ చేసుకోవచ్చు. ఎలాగో ఇంట్లోనే కాబట్టి దీనికి పెద్దగా పెట్టుబడి కూడా అసవరం ఉండదు. తక్కువ మొత్తంలోనే వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. వంటకాలు రుచిగా ఉంటే ఇక మీ వ్యాపారానికి ఢోకా ఉండదు. మీ వంటకాలను సోషల్‌ మీడియా లేదా పాప్లెంట్స్‌ రూపంలో ప్రచారం చేసుకోవాల్సి ఉంటుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..