Rental Agreement: అద్దె ఒప్పందం 11 నెలలు మాత్రమే ఎందుకు ఉంటుందో తెలుసా..? తప్పక తెలుసుకోండి..!
సొంత ఇల్లు ప్రతి ఒక్కరి కల.. అయితే, అందరికీ ఇది సాధ్యపడదు. అందుకే మన దగ్గర చాలా మంది అద్దె ఇళ్లను ఆశ్రయిస్తుంటారు. కానీ, హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో ఇల్లు అద్దెకు తీసుకోవడం ఒక్కోసారి తలనొప్పిగా అనిపిస్తుంది. కానీ, ఇంటి అద్దెకు సంబంధించిన నియమ నిబంధనలతో ముందుగా అద్దెదారులు తెలుసుకోవాలి. లేకుంటే ఒక్కోసారి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే, అద్దె ఇంటికి వెళ్తున్నప్పుడు ఓనర్ అగ్రిమెంట్ పత్రాలు రాయించుకోవటం కూడా మనం చూస్తుంటాం.. అయితే, దీని వెనుక అసలు ఏంటో మీకు తెలుసా...? అలాగే, ఆ అగ్రిమెంట్ 11నెలలకు మాత్రమే ఉంటుంది..? దీని వెనుక అసలు విషయం ఏంటంటే..

చాలా మంది అద్దెదారులు ఒక విషయం గమనించి ఉండాలి. అద్దె ఒప్పందం ఎప్పుడూ 11 నెలలు మాత్రమే ఎందుకు ఉంటుంది..? ఒక అద్దెదారు ఒకే ఇంట్లో సంవత్సరాలు నివసిస్తున్నప్పటికీ, ఒప్పందం ప్రతి 11 నెలలకు ఒకసారి దాన్ని తిరిగి మారుస్తుంటారు.. కొందరు దీనిని ఇంటి యజమాని చేస్తున్న తెలివైన పనిగా భావిస్తారు. మరికొందరు ఇది కేవలం ఒక ఫార్మాలిటీ అనుకుంటారు.. అయితే, దీని వెనుక బలమైన చట్టపరమైన కారణాలు ఉన్నాయని మీకు తెలుసా..? ఇది చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఆ పూర్తి డిటెల్స్ ఇక్కడ చూద్దాం…
11 నెలల ఒప్పందం చట్టపరమైన దృక్పథం. ఇండియన్ రిజిస్ట్రేషన్ చట్టం 1908 లోని సెక్షన్ 17(d) ప్రకారం అద్దె ఒప్పందం 12 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉంటే, దాని రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ చెల్లింపు తప్పనిసరి అవుతుంది. దీని ఫలితంగా ఇంటి యజమానికి అధిక ఖర్చు, చట్టపరమైన విధి విధానాలు(కొన్ని కఠినమైన) ఉంటాయి. ఈ ఇబ్బందిని నివారించడానికి ఇంటి యజమానులు కేవలం రూ. 100 లేదా రూ. 200 స్టాంప్ పేపర్‌పై 11 నెలల ఒప్పందాన్ని తయారు చేసుకుంటారు.
కోర్టులో దీని విలువ ఎంత?
11 నెలల అద్దె ఒప్పందం సాధారణంగా ఒక అధికారిక పత్రం మాత్రమే. వివాదం తలెత్తినప్పుడు, అది నమోదు చేయబడనందున కోర్టులో దాని చట్టపరమైన విలువ పరిమితం. అయితే, ఇది ఇంటి యజమాని, అద్దెదారు మధ్య నిబంధనలను స్పష్టం చేస్తుంది. వివాదం సంభవించినప్పుడు ప్రారంభ సాక్ష్యంగా పనిచేస్తుంది. కిరాయి దారులు ఎదురుతిరిగినప్పుడు ఇలాంటి రెంటల్ అగ్నిమెంట్లు తప్పనిసరి అవసరం. అయితే, ప్రతి 11నెలలకు దీనిని మార్చాలి..?
ఆస్తి బదిలీ చట్టం ప్రకారం ఒక వ్యక్తి ఒక ఆస్తిని ఎక్కువ కాలం ఆక్రమించినట్లయితే, ఆ ఆస్తిపై తాత్కాలిక హక్కు ఉండే అవకాశం ఉంది. ఈ ప్రమాదం నుండి రక్షించడానికి ఇంటి యజమానులు ప్రతి 11 నెలలకు ఒక కొత్త ఒప్పందాన్ని తయారు చేస్తారు.
అద్దె అద్దె చట్టం ప్రకారం, ఇంటి యజమానులు ఇష్టానుసారంగా అద్దెను పెంచలేరు. అద్దెదారులకు ఆస్తిపై శాశ్వత హక్కు లభించదు. అయితే, ఒప్పందం నమోదు చేయబడితే, అది రెండు పార్టీలకు బలమైన చట్టపరమైన రక్షణను అందిస్తుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








