AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Post Office FD: పోస్ట్ ఆఫీస్ బంపర్ స్కీమ్.. ఒకసారి పెట్టుబడి పెడితే 10 లక్షల లాభం..

మీరు ఆర్ధిక భద్రతతో పాటు రాబడికి హామీ ఉన్న చోట మీ డబ్బును పెట్టుబడి పెట్టాలనుకుంటే.. పోస్టాఫీస్ లోని వివిధ పథకాలు బెస్ట్ ఎంపిక. ఈ రోజు మనం పోస్ట్ ఆఫీస్ లో సరికొత్త గొప్ప పథకం గురించి తెలుసుకుందాం.. ఈ పథకంలో, మీరు ఒకసారి డబ్బు పెట్టుబడి పెట్టడం ద్వారా పెట్టుబడి కాకుండా... 10 లక్షల రూపాయల ప్రత్యక్ష లాభం సంపాదించవచ్చు. మరి పోస్ట్ ఆఫీస్ బంపర్ స్కీమ్ ఏమిటంటే..

Post Office FD: పోస్ట్ ఆఫీస్ బంపర్ స్కీమ్.. ఒకసారి పెట్టుబడి పెడితే 10 లక్షల లాభం..
Post Office Term Deposit
Surya Kala
|

Updated on: Sep 01, 2025 | 3:46 PM

Share

ప్రతి వ్యక్తి తన పొదుపు మొత్తాన్ని తన పిల్లల భవిష్యత్తు కోసం డబ్బు సురక్షితంగా, రాబడి అధికంగా ఉండే ప్రదేశంలో పెట్టుబడి పెట్టాలని కోరుకుంటాడు. అటువంటి పరిస్థితిలో పోస్టాఫీసు పెట్టుబడి పథకాలు సురక్షితమైన ఎంపిక. ఈ రోజు మనం పోస్టాఫీసుకి సంబంధించిన గొప్ప పథకం గురించి తెలుసుకుందాం.. ఈ పథకంలో ఒకేసారి రూ. 5 లక్షలు పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు రూ. 15 లక్షలు అంటే రూ. 10 లక్షల ప్రత్యక్ష ప్రయోజనం పొందవచ్చు.. ఎలా 10 లక్షలు లాభం వస్తుందంటే..

ఈ పథకం ఏమిటి?

ఈ పథకం పోస్ట్ ఆఫీస్ టర్మ్ డిపాజిట్. దీనిని సాధారణ భాషలో పోస్ట్ ఆఫీస్ FD అని కూడా పిలుస్తారు. దీనిలో ఒక పెద్ద మొత్తాన్ని డిపాజిట్ చేస్తే.. ఆ డిపాజిట్ పై ప్రతి సంవత్సరం వడ్డీని పొందుతారు. ఈ పథకంలోని అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే.. ఇది ప్రభుత్వ పథకం.. కనుక ఇందులో పెట్టుబడి పెట్టడం వలన డబ్బు పోతుందనే భయం ఉండదు. ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ 5 సంవత్సరాల టర్మ్ డిపాజిట్‌పై 7.5% వార్షిక వడ్డీని అందిస్తోంది. ఇది చాలా బ్యాంకులు అందించే వడ్డీ కంటే ఎక్కువ.

5 లక్షలను 15 లక్షలుగా ఎలా మారతాయంటే..

ఎవరైనా ఒకేసారి 5 లక్షల రూపాయలను పోస్టాఫీస్ FDలో పెట్టుబడి పెట్టాలి. ఈ పథకంలో పెట్టిన పెట్టుబడి 5 సంవత్సరాల పాటు ఉంచాలి. అప్పుడు దీనిపై సంవత్సరానికి 7.5% వడ్డీ లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

5 సంవత్సరాల తర్వాత, మీ పెట్టుబడి దాదాపు రూ.7,24,974కి పెరుగుతుంది. అయితే ఈ పతాకంలో పెట్టిన డబ్బులను వెంటనే తీసుకోవద్దు.. ఈ డబ్బును మరో 5 సంవత్సరాల పాటు అదే పథకంలో తిరిగి పెట్టుబడి పెట్టండి. అప్పుడు మరో 5 సంవత్సరాలలో ఈ మొత్తం రూ.10,51,175కి పెరుగుతుంది. ఇప్పుడు దానిని మళ్ళీ మూడవసారి 5 సంవత్సరాల పాటు డిపాజిట్ చేయండి. ఈసారి ఈ మొత్తం దాదాపు రూ.15,24,149కి పెరుగుతుంది. అంటే మీ ప్రారంభ మొత్తం రూ.5 లక్షలు ఇప్పుడు 15 సంవత్సరాలలో మూడు రెట్లు ఎక్కువ అవుతుంది.

ప్రయోజనాలు ఏమిటంటే..

పోస్టాఫీస్ FDలో ఒక్కసారి మాత్రమే రూ. 5 లక్షలు డిపాజిట్ చేసి 15 సంవత్సరాలు ఈ డబ్బుని తాకకుండా ఉంచాలి. ఈ స్క్రీమ్ లో నెల నెలా ఎటువంటి వాయిదా చెల్లించాల్సిన అవసరం లేదు. అంతేకాదు ఎటువంటి మార్కెట్ రిస్క్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. అయినప్పటికీ 15 సంవత్సరాల తర్వాత మీకు రూ. 15 లక్షలకు పైగా రాబడి లభిస్తోంది. అంటే రూ. 10 లక్షల ప్రత్యక్ష లాభం పొందుతారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
శుక్రుడి అనుకూలత.. వారికి ధన యోగాలు, సిరిసంపదలు..!
శుక్రుడి అనుకూలత.. వారికి ధన యోగాలు, సిరిసంపదలు..!
ఇంట్లో పాము ఫొటో ఉండొచ్చా? ఉంటే ఏం జరుగుద్దో తెలిస్తే వణకాల్సిందే
ఇంట్లో పాము ఫొటో ఉండొచ్చా? ఉంటే ఏం జరుగుద్దో తెలిస్తే వణకాల్సిందే
ఆ మూవీకి రూ. 25 కోట్లు నష్టం..! అందుకే నా మేకింగ్ స్టైల్ మారింది.
ఆ మూవీకి రూ. 25 కోట్లు నష్టం..! అందుకే నా మేకింగ్ స్టైల్ మారింది.
ఆ మూగజీవం బతికింది.. ఆ బుజ్జిగాడి ప్రాణం పోయింది!
ఆ మూగజీవం బతికింది.. ఆ బుజ్జిగాడి ప్రాణం పోయింది!
'సంతోషం' సినిమాలోని ఈ పిల్లోడు గుర్తున్నాడా? ఇప్పుడు ఫేమస్ హీరో
'సంతోషం' సినిమాలోని ఈ పిల్లోడు గుర్తున్నాడా? ఇప్పుడు ఫేమస్ హీరో
సమోసా రాజధాని.. ఒక్కసారి తింటే మర్చిపోలేరు.. ఈ నగరంలో మాత్రమే!
సమోసా రాజధాని.. ఒక్కసారి తింటే మర్చిపోలేరు.. ఈ నగరంలో మాత్రమే!
'రాసిపెట్టుకోండి.. ఈసారి టైటిల్ మాదే'
'రాసిపెట్టుకోండి.. ఈసారి టైటిల్ మాదే'
పోటీలేదు.. తిరుగుండదు.! కేవలం రూ. 5 వేల పెట్టుబడితో
పోటీలేదు.. తిరుగుండదు.! కేవలం రూ. 5 వేల పెట్టుబడితో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్.
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్.
పిల్లల్లో తెలివితేటలు పెంచే  షుగర్ ఫ్రీ లడ్డూ.. ఒక్కటి తింటే చాలు
పిల్లల్లో తెలివితేటలు పెంచే  షుగర్ ఫ్రీ లడ్డూ.. ఒక్కటి తింటే చాలు