Best credit cards: విమానాశ్రయాల్లో ఉచిత ఆతిధ్యం కావాలా.. ఈ క్రెడిట్ కార్డులు తీసుకుంటే మేలు
విమాన ప్రయాణాలు చేయడం ప్రతి ఒక్కరికి సర్వసాధారణంగా మారింది. చదువు, ఉద్యోగం, విహారం తదితర అవసరాలకు తరచూ ప్రయాణాలు చేస్తున్నారు. ప్రపంచంగా అనేక దేశాలు పర్యాటకులకు ప్రోత్సాహకాలు అందజేస్తున్నాయి. దానిలో భాగంగా భారతీయులు వీసా లేకుండా కొన్ని దేశాలను సందర్శించవచ్చు. అయితే తరచూ విమాన ప్రయాణాలు చేసే వారు విమానాశ్రయంలో వేచి ఉండాల్సి వస్తుంది. అలాంటి వారికి కొన్ని క్రెడిట్ కార్డులు విమానాశ్రయ లాంజ్ సౌకర్యం కల్పిస్తున్నాయి. వాటిలో బెస్ట్ క్రెడిట్ కార్డుల గురించి తెలుసుకుందాం.

బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు వేచి ఉండేందుకు గదులు ఉంటాయి. అలాగే విమానాశ్రయాలలో లాంజ్ లు ఉంటాయి. వీటిలో ప్రయాణికులు నిరీక్షించవచ్చు, అక్కడి వైఫైను ఉపయోగించుకోవచ్చు, ఆహారం, పానీయాలు స్వీకరించవచ్చు. అయితే వీటిలో అందరికీ ప్రవేశం ఉండదు. కొన్ని లాంజ్ లలో అందరికీ అనుమతి ఉన్నా ధరలు భారీగా ఉంటాయి. అయితే కొన్ని క్రెడిట్ కార్డు ఖాతాదారులు వీటిని ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.
హెచ్‌డీఎఫ్‌సీ సిగ్నేచర్ క్రెడిట్ కార్డు
హెడ్ డీఎఫ్సీ సిగ్నేచర్ క్రెడిట్ కార్డు కోసం ఎటువంటి రుసుము కట్టనవసరం లేదు. కార్డు తీసుకున్న 90 రోజుల్లోపు రూ.15 వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. తద్వారా మొదటి సంవత్సరం ఉచితంగా వినియోగించుకోవచ్చు. ఇక ఏడాదికి రూ.75 వేలు ఖర్చు చేస్తే వార్షిక రుసుము నుంచి మినహాయింపు పొందవచ్చు. తద్వారా ఉచితంగా పునరుద్ధరణ చేసుకోవచ్చు. ఈ కార్డు ద్వారా దేశీయ, అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఉచితంగా లాంజ్ యాక్సెస్ పొందవచ్చు.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డైనర్స్ క్లబ్ బ్లాక్ క్రెడిట్ కార్డు
ఈ కార్డు తీసుకోవడానికి రూ.పదివేలతో పాటు పన్నులను అదనంగా చెల్లించాలి. అలాగే వార్షిక రుసుము కూడా అదే విధంగా ఉంటుంది. కార్డు తీసుకున్న 12 నెలల్లోపు రూ.5 లక్షలు చెల్లిస్తే వార్షిక రుసుము నుంచి మినహాయింపు లభిస్తుంది. దీని ద్వారా దేశీయ, అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఉచితంగా లాంచ్ ను వినియోగించుకోవచ్చు.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మిలీనియా క్రెడిట్ కార్డు
ఈ క్రెడిట్ కార్డుకు చేరిక రుసుముగా రూ.వెయ్యి కట్టాలి. దానికి పన్నులు అదనంగా ఉంటాయి. వార్షిక రుసుముగా ఏడాదికి అంతే వసూలు చేస్తారు. అయితే ఏడాదికి రూ.లక్ష ఖర్చు చేసిన వారికి వార్షిక రుసుము నుంచి మినహాయింపు లభిస్తుంది. అన్ని విమానాశ్రయాల్లో లాంజ్ ఉచితం.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ టాటా న్యూ ఇన్సిసిటీ
సభ్యత్వ రుసుముగా రూ.1499 వసూలు చేస్తారు. దానికి ట్యాక్స్ లు అదనంగా ఉంటాయి. వార్షిక రుసుము కూడా అంతే కట్టాలి. ఏడాదికి రూ.3 లక్షలు ఖర్చు చేసిన వారికి తర్వాత ఏడాది వార్షిక చార్జీ నుంచి తగ్గింపు అందజేస్తారు. దీని ద్వారా అన్ని ఎయిర్ పోర్టులలో లాంజ్ సౌకర్యంగా ఉచితంగా అందిస్తారు.
ఎస్బీఐ ఎలైట్
ఎస్బీఐ ఎలైట్ క్రెడిట్ కార్డును ఉచితంగా అందజేస్తారు. రెండో ఏడాది నుంచి వార్షిక రుసుముగా రూ.4999 చెల్లించాలి. దీని మినహాయింపు నిబంధనలను తెలియజేయలేదు. అన్ని విమానాశ్రయాల్లో లాంజ్ యాక్సెస్ ఉచితంగా పొందవచ్చు.
ఎస్బీఐ ప్రైమ్
ఎస్బీఐ ప్రైమ్ క్రెడిట్ కార్డును ఖాతాదారులకు ఉచితంగా అందజేస్తారు. వార్షిక రుసుముగా రెండో ఏడాది నుంచి రూ.2999 చెల్లించాలి. మినహాయింపు షరతులు తెలియదు. దీని ద్వారా నాలుగు అంతర్జాతీయ, 8 దేశీయ విమానాశ్రయ లాంజ్ లలో ఉచిత సందర్శనలు లభిస్తాయి.
ఎస్బీఐ క్లబ్ విస్తారా
ఈ క్రెడిట్ ద్వారా 8 దేశీయ విమానాశ్రయాలలో ఉచితంగా లాంజ్ సౌకర్యం లభిస్తుంది. ఈ కార్డును ఖాతాదారులు ఉచితంగా పొందవచ్చు. రెండో ఏడాది నుంచి వార్షిక రుసుముగా రూ.2,999 చొప్పున చెల్లించాలి.
యాక్సిస్ బ్యాంకు మాగ్నస్
ఈ కార్డు కోసం ముందుగా పన్నులతో పాటు రూ.12,500 చెల్లించాలి. వార్షిక రుసుము కూడా అంతే వసూలు చేస్తారు. ఏడాదికి రూ.25 లక్షలు ఖర్చు చేసిన వారికి వార్షిక రుసుమును మినహాయిస్తారు.
యాక్సిస్ విస్తారా సిగ్నేచర్
యాక్సిస్ విస్తారా సిగ్నేచర్ కార్డు కోసం ముందుగా రూ.3 వేలు చెల్లించాలి. వార్షిక రుసుము కూడా అంతే ఉంటుంది. ఎంపిక చేసిన దేశీయ, అంతర్జాతీయ విమానాశ్రయ లాంజ్ లలో ఉచిత యాక్సెస్ పొందవచ్చు.
ఏయూ బ్యాంక్ జెనిత్
ఖాతాదారులకు ఈ క్రెడిట్ కార్డును ఉచితంగా అందజేస్తారు. వార్షిక చార్జీగా పన్నులతో పాటు రూ.7999 చెల్లించాలి. కార్డు జారీ చేసిన రూ.1.25 లక్షలు ఖర్చు చేస్తే మొదటి సంవత్సరం రుసుము ఉండదు. ఎంపిక చేసిన లాంజ్ లలో యాక్సెస్ అవకాశం ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








