AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GST Collection: జీఎస్టీ వసూళ్లలో కీలక పరిణామం.. ఒక్క నెలలోనే రూ.1.84 లక్షల కోట్ల వసూళ్లు

వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) గురించి వ్యాపార వర్గాలకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. భారతదేశంలో గతంలో పన్ను విధానం చాలా సంక్లిష్టంగా ఉండేది. దీన్ని సులభతరం చేసేలా తీసుకొచ్చిన జీఎస్టీ విధానం రోజురోజుకూ ప్రజాదరణ పొందుతుంది. ఫిబ్రవరి 2025లో జీఎస్టీ వసూళ్లు 9.1 శాతం పెరిగి దాదాపు రూ.1.84 లక్షల కోట్లకు చేరుకున్నాయని ఓ నివేదిక ద్వారా వెల్లడైంది.

GST Collection: జీఎస్టీ వసూళ్లలో కీలక పరిణామం.. ఒక్క నెలలోనే రూ.1.84 లక్షల కోట్ల వసూళ్లు
Nikhil
|

Updated on: Mar 02, 2025 | 7:11 PM

Share

మార్చి 1 విడుదలైన అధికారిక డేటా ప్రకారం కేంద్ర జీఎస్టీ నుంచి వసూళ్లు రూ.35,204 కోట్లు ఉండగా రాష్ట్ర జీఎస్టీ రూ.43,704 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.90,870 కోట్లు, పరిహార సెస్ రూ.13,868 కోట్లుగా ఉన్నాయి. ఫిబ్రవరిలో దేశీయ లావాదేవీల ద్వారా వచ్చే జీఎస్టీ ఆదాయాలు 10.2 శాతం పెరిగి రూ. 1.42 లక్షల కోట్లకు చేరుకోగా దిగుమతుల ద్వారా వచ్చే ఆదాయాలు 5.4 శాతం పెరిగి రూ.41,702 కోట్లకు చేరుకున్నాయి . ఫిబ్రవరిలో జారీ చేసిన మొత్తం రిటర్న్స్ రూ.20,889 కోట్లుగా ఉన్నాయి.  ఇది గత సంవత్సరంతో పోలిస్తే 17.3 శాతం పెరుగుదల అని, ఫిబ్రవరి 2025లో నికర జీఎస్టీ వసూళ్లు 8.1 శాతం పెరిగి రూ.1.63 లక్షల కోట్లకు చేరుకున్నాయి. అయితే ఫిబ్రవరి 2025లో స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.1.84 లక్షల కోట్లుగా ఉంటే జనవరి 2025లో సేకరించిన రూ.1.96 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం.

ఈ సంవత్సరం జీఎస్టీ వసూళ్లు దాదాపు లక్ష్యంలోనే ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. 2025 ఆర్థిక సంవత్సరానికి ఇది సవరించిన అంచనాలు ఆర్థిక లోటును 4.8 శాతంగా నిర్ణయించడంతో బడ్జెట్‌లో పేర్కొన్న 4.9 శాతం కంటే తక్కువగా ఉందని వివరిస్తున్నారు. దేశీయ జీఎస్టీ సేకరణలో 10.1 శాతం వృద్ధితో పోలిస్తే దిగుమతులపై జీఎస్టీ పెరుగుదల 7.2 శాతం మాత్రమే ఉండడం మంచి పరిణామమని నిపుణులు పేర్కొంటున్నారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంలో భాగంగా జీఎస్టీ వసూళ్లు పెరగడం మంచిదని నిపుణులు వివరిస్తున్నారు. ముఖ్యంగా రీఫండ్‌లలో 15.8 శాతం పెరుగుదల సానుకూల సంకేతమని చెబుతున్నారు. 

ఈ ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్-ఫిబ్రవరి) ఇప్పటివరకు స్థూల జీఎస్టీ వసూళ్లు 9.4 శాతం పెరిగి రూ. 20.13 లక్షల కోట్లకు చేరుకోగా నికర జీఎస్టీ వసూళ్లు 8.6 శాతం పెరిగి రూ.17.79 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఫిబ్రవరిలో జారీ చేసిన సగటు కంటే ఎక్కువ రీఫండ్‌లు నికర జీఎస్టీ వసూళ్ల సంఖ్యల్లో సగటు కంటే తక్కువ వృద్ధి రేటుకు దారితీశాయని మరికొంతమంది నిపుణులుపేర్కొంటున్నారు. కేంద్ర నిర్మాణాల ద్వారా వసూళ్ల వృద్ధి రేటు, రాష్ట్ర నిర్మాణాల ద్వారా వసూళ్ల వృద్ధి రేటు కంటే ఎక్కువగా ఉందని, ఇది కేంద్ర నిర్మాణాల దర్యాప్తు విభాగాల గణనీయమైన విజయాల వల్ల సాధ్యమైందని పేర్కొంటున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని  బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..