AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jio Plans: అధిక డేటాతో పాటు ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు.. ఈ జియో ప్లాన్స్ గురించి తెలుసుకోవాల్సిందే..!

ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం భారీగా పెరిగింది. ముఖ్యంగా అన్ని టెలికం కంపెనీలు తక్కువ ధరల్లో డేటాతో పాటు కాల్స్ చేసుకునేలా ప్రత్యేక ప్లాన్స్ ప్రకటించడంతో ఎక్కువ మంది స్మార్ట్ ఫోన్ వినియోగాన్ని ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా ఆ స్మార్ట్ ఫోన్స్‌లో ఇటీవల కాలంలో ఓటీటీ యాప్స్ చూసే వారి సంఖ్య కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లతో ప్రముఖ టెలికం కంపెనీ జియో కొన్ని రీచార్జ్ ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

Jio Plans: అధిక డేటాతో పాటు ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు.. ఈ జియో ప్లాన్స్ గురించి తెలుసుకోవాల్సిందే..!
Nikhil
|

Updated on: Mar 03, 2025 | 11:49 AM

Share

రిలయన్స్ జియో భారతదేశంలోని అతిపెద్ద టెలికాం కంపెనీల్లో ఒకటిగా ఉంది. భారతదేశంలో జియో టెలికం కంపెనీ ఎంట్రీ తర్వాత డేటా చార్జీలు సాధారణ ప్రజలకు కూడా అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా టెలికం రంగ వృద్ధిని జియోకు ముందు, జియోకు తర్వాత అని చెప్పిన తప్పు లేదంటున్నారు నిపుణులు. దేశంలోని కోట్లాది మంది మొబైల్ వినియోగదారులు రిలయన్స్ జియో సిమ్‌లను వాడుతున్నారు. జియో తన వినియోగదారులకు అనేక రకాల రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తూ ఉంది. అయితే వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు యాక్సెస్‌ను ఇస్తూ కొన్ని ప్లాన్స్‌ను జియో అందబాటులోకి తీసుకొచ్చింది. ఓటీటీల్లో వివిధ సిరీస్‌లను ఎంజాయ్ చేసేలా ఆయా ప్లాన్స్‌కు అధిక డేటాను కూాడా ఆఫర్ చేస్తుంది. ఈ నేపథ్యంలో జియో ఓటీటీ సబ్‌స్రిప్షన్స్‌తో పాటు అందించే రీచార్జి ప్లాన్స్ గురించి తెలుసుకుందాం.

రూ. 449 ప్లాన్

రిలయన్స్ జియో రూ. 449 రీఛార్జ్ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్‌లో అపరిమిత కాలింగ్, డైలీ 100 ఎస్ఎంఎస్‌లను పొందవచ్చు. అలాగే ప్రతిరోజూ 3 జీబీ డేటాతో వస్తుంది. రోజువారీ డేటా పరిమితి ముగిసిన తర్వాత కూడా 64 కేబీ వేగంతో డేటాను ఉపయోగించవచ్చు. ఈ రీచార్జ్ ప్లాన్స్ వినియోగదారులు జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్ లకు కూడా ఉచిత యాక్సెస్ అందిస్తుంది. ఈ జియో ప్లాన్‌లో మీరు అపరిమిత 5జీ డేటాను కూడా పొందవచ్చు.

జియో రూ.1199 ప్లాన్

రిలయన్స్ జియో రూ.1199 ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ అన్ని నెట్‌వర్క్‌లలో మాట్లాడటానికి అపరిమిత కాలింగ్ సౌకర్యాలను అందిస్తుంది. అలాగే ఈ ప్లాన్ 252 జీబీ హై-స్పీడ్ 4జీ డేటాను అందిస్తుంది. అంటే ఈ ప్లాన్‌లో రోజుకు 3 జీబీ డేటా అందిస్తుంది. ఈ ప్లాన్ రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో ఉచిత జాతీయ రోమింగ్ పొందవచ్చు. ఈ ప్లాన్‌లో జియో టీవీ, జియో క్లౌడ్ సబ్‌స్క్రిప్షన్‌లు కూడా ఉచితంగా లభిస్తాయి.

ఇవి కూడా చదవండి

జియో 1799 ప్లాన్ 

రిలయన్స్ జియో రూ. 1799 ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ జియో ప్లాన్ ప్రతిరోజూ 3 జీబీ రోజువారీ డేటాను ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ప్లాన్‌లో అపరిమిత 5జీను ఆశ్వాదించవచ్చు. అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు వస్తాయి. ఈ ప్లాన్‌ ద్వారా జియో సినిమా, జియోక్లౌడ్‌తో పాటు జియో టీవీలను ఉచితంగా యాక్సెస్ చేయవచ్చు. ముఖ్యంగా ఈ ప్లాన్2 ద్వారా కూడా ఉన్నాయి. అయితే ఈ ప్లాన్ ద్వారా నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ పొందవచ్చు. 

మరిన్ని  బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..