Volksfest 2024: వోక్స్‌వ్యాగన్ పండుగ ఆఫర్లు షురూ.. కస్టమర్లకు బోలెడన్ని ప్రయోజనాలు
భారతదేశంలో ప్రస్తుతం పండుగల సీజన్ ప్రారంభమైంది. ఇప్పటికే మార్కెట్‌లో వినాయక చవితి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే తాజాగా ప్రముఖ కార్ల తయారీ కంపెనీ అయిన వోక్స్‌వ్యాగన్ పండుగ వేళ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. వోక్స్ వ్యాగన్ ఇండియా 'వోక్స్ ఫెస్ట్ 2024' సెలబ్రేటరీ ఆఫర్లను అందుబాటులో ఉంచింది. ఈ పండుగ సీజన్‌లో వర్టస్, టైగన్, టిగువాన్ వంటి కార్ల మోడల్స్‌పై ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది.
భారతదేశంలో ప్రస్తుతం పండుగల సీజన్ ప్రారంభమైంది. ఇప్పటికే మార్కెట్‌లో వినాయక చవితి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే తాజాగా ప్రముఖ కార్ల తయారీ కంపెనీ అయిన వోక్స్‌వ్యాగన్ పండుగ వేళ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. వోక్స్ వ్యాగన్ ఇండియా ‘వోక్స్ ఫెస్ట్ 2024’ సెలబ్రేటరీ ఆఫర్లను అందుబాటులో ఉంచింది. ఈ పండుగ సీజన్‌లో వర్టస్, టైగన్, టిగువాన్ వంటి కార్ల మోడల్స్‌పై ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. వోక్స్‌ఫెస్ట్ 2024 సెప్టెంబర్ 14 నుంచి అక్టోబర్ 31, 2024 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ నేపథ్యంలో వోక్స్ ఫెస్ట్‌లో భాగంగా అనేక ఆఫర్లు, ప్రయోజనాలను ప్రకటించింది. వోక్స్ ఫెస్ట్ 2024 కింద ఇప్పటికే వోక్స్ వ్యాగన్ కార్ల వినియోగదారులకు భారతదేశం అంతటా ప్రీమియం మాల్స్‌లో ఉచిత పార్కింగ్, వాలెట్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో వోక్స్ ఫెస్ట్ 2024 గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
ముఖ్యంగా ఉచిత పార్కింగ్ అందుబాటులో ఉన్న మాల్స్‌లో వోక్స్ వ్యాగన్ ప్రోడక్ట్ డెమోలను అందించే ‘ఎక్స్పీరియన్స్ జోన్లు’ కూడా ఉంటాయ. అలాగే ఎంగేజ్ మెంట్ జోన్ పేరుతో ప్రత్యేక పోటీలను నిర్వహించి బహుమతులను కూడా ఇవ్వనుంది. అలాగే ఈ మాల్స్ దగ్గర ‘ట్రస్ట్ డ్రైవ్’ జోన్ కూడా ఉంటుంది. వోక్స్ వ్యాగన్ డీలర్ల దగ్గర టెస్ట్ డ్రైవ్‌లతో పాటు కార్లను బుక్ చేసుకునే వారికి ప్రత్యేక బహుమతులు ఇవ్వనున్నారు. వోక్స్ ఫెస్ట్ 2024 గురించి వోక్స్ వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ ఇండియా బ్రాండ్ డైరెక్టర్ ఆశిష్ గుప్తా మాట్లాడుతూ వోక్స్ ఫెస్ట్ అనేది మా వార్షిక వేడుక అయినా ఈ పండుగ సీజన్‌లో వినియోగదారులకు ప్రత్యేక ఆఫర్లను అందిస్తామని వివరించారు.
ఈ ఆఫర్లను కస్టమర్లకు మరింత దగ్గరగా చేసేందుకు ప్రీమియం మాల్స్ ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ ఆఫర్లలో భాగంగా ఇప్పటికే ఉన్న వోక్స్వ్యాగన్ కస్టమర్లు యాడ్-ఆన్ వారెంటీలు, సర్వీస్ వాల్యూ ప్యాకేజీలతో సహా ఆఫ్టర్ సేల్ సర్వీసెస్‌పై ప్రత్యేకమైన ప్రయోజనాలను పొందవచ్చని పేర్కొన్నారు. ముఖ్యంగా విర్టస్, టైగన్ మోడల్స్‌కు సంబంధించిన ఓనం ఎడిషన్లు కేరళలోని డీలర్ల వద్ద అందుబాటులో ఉన్నాయని వివరించారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..