Adhaar: నేటితో ముగిసిన ఆధార్‌ ఉచిత అప్‌డేట్‌.. కీలక నిర్ణయం తీసుకున్న ఉడాయ్‌

ఆధార్‌ కార్డులో అడ్రస్‌ లేదా పేరు ఇలా ఏదో ఒక అంశాన్ని అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి చివరి తేదీని ఇప్పటికే UIDAI ప్రకటించింది. దీని ప్రకారం సెప్టెంబర్‌ 14వ తేదీతో ఈ గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ గడువును మరోసారి...

Adhaar: నేటితో ముగిసిన ఆధార్‌ ఉచిత అప్‌డేట్‌.. కీలక నిర్ణయం తీసుకున్న ఉడాయ్‌
Aadhar Card
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 14, 2024 | 2:16 PM

సిమ్‌ కార్డు మొదలు, ఫ్లైట్ టికెట్‌ బుకింగ్‌ వరకు ప్రతీ ఒక్క పనికి ఆధార్‌ కార్డు వినియోగం అనివార్యమనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆధార్‌ కార్డు వినియోగం అనివార్యంగా మారింది. ఇదిలా ప్రతీ పదేళ్లకొకసారి ఆధార్‌ కార్డుకు సంబంధించిన వివరాలను అప్‌డేట్ చేసుకోవాలని అధికారులు ఇప్పటికే ప్రకటించారు.

ఆధార్‌ కార్డులో అడ్రస్‌ లేదా పేరు ఇలా ఏదో ఒక అంశాన్ని అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి చివరి తేదీని ఇప్పటికే UIDAI ప్రకటించింది. దీని ప్రకారం సెప్టెంబర్‌ 14వ తేదీతో ఈ గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ గడువును మరోసారి పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈమేరకు ఉడాయ్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది. 2024 డిసెంబర్‌ 14 వరకు పొడగిస్తున్నట్లు తెలిపింది. దీంతో ఆధార్‌ కార్డులో చిరునామా మార్పులు చేసుకోవాలనుకొనేవారు వెంటనే ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్‌డేట్ చేసుకునే అవకాశం లభించింది.

ఆన్‌లైన్‌లో ఆధార్‌ వివరాలను అప్‌డేట్ చేసుకోవాలనుకునే వారు ఆయా రుజువు పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఉచిత సేవలు ‘మై ఆధార్‌’ పోర్టల్‌ ద్వారా లభిస్తాయి. పేరు, పుట్టినతేదీ, చిరునామా వంటి మార్పులు చేర్పులు ఉచితంగా చేసుకోవచ్చు.

ఇలా అప్‌డేట్ చేసుకోండి..

* ఇందుకోసం ముందుగా యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆధార్‌ నెంబర్‌తో లాగిన్‌ కావాలి.

* అనంతరం రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు ఓటీపీతో వస్తుంది. వెంటనే స్క్రీన్‌పై మీ వివరాలు కనిపిస్తాయి.

* ఇందులో మీరు మార్చాలనుకుంటున్న వివరాలను సెలక్ట్‌ చేసుకోవాలి. తర్వాత కనిపించే డ్రాప్‌డౌన్‌ లిస్ట్‌ సాయంతో డాక్యుమెంట్లను ఎంచుకోవాలి.

* అందుకు సంబంధించిన డాక్యుమెంట్ స్కాన్‌ చేసిన కాపీ అప్‌లోడ్‌ చేసి సబ్‌మిట్‌పై నొక్కాలి. దీంతో 14 నెంబర్ల ‘అప్‌డేట్‌ రిక్వెస్ట్‌ నంబర్‌’ వస్తుంది. దీని ద్వారా అప్‌డేట్‌ స్టేటస్‌ ఎక్కడి వరకు వచ్చిందో ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..