Electric Cycle: ఇవి కొత్త తరం సైకిళ్లు.. ఎల్సీడీ డిస్ ప్లే.. బ్యాటరీ సపోర్టు.. మామూలుగా లేవుగా..
అటు ఆరోగ్యంతో పాటు, ఇటు ఇంధనం కూడా ఆదా అవుతుండటంతో అందరూ ఎలక్ట్రిక్ సైకిళ్లను వినియోగిస్తున్నారు. దీంతో కంపెనీలు కూడా కొత్త కొత్త ఫీచర్లతో కూడిన ఎలక్ట్రిక్ సైకిళ్లను లాంచ్ చేస్తున్నాయి. ఇదే క్రమంలో ప్రముఖ విద్యుత్ వాహనాల తయారీ దారైన విర్టస్ మోటార్ సరికొత్త ఎలక్ట్రిక్ సైకిళ్లను లాంచ్ చేసింది. ఆల్ఫా ఏ, అల్ఫా ఐ పేరిట మన దేశ మార్కెట్లో అడుగుపెట్టిన ఈ ఎలక్ట్రిక్ సైకిళ్లలో ప్రత్యేకత ఏమిటంటే ఎల్సీడీ డిస్ ప్లే. బైక్ లు, స్కూటర్లలో లాగా దీనిలో స్క్రీన్ ఉంటుంది.
ఇటీవల కాలంలో ఫిట్ నెస్ కు ప్రాధాన్యం పెరగడంతో సైక్లింగ్ ను అందరూ ఇష్టపడుతున్నారు. పైగా ఇంధన ధరలు అంతకంతకూ పెరుగుతుండటంతో ఇంటి అవసరాలకు ఎక్కువ ఎలక్ట్రిక్ సైకిళ్లను వినియోగిస్తున్నారు. దీంతో ఎలక్ట్రిక్ సైకిళ్లకు ప్రాధాన్యం పెరుగుతోంది. అటు ఆరోగ్యంతో పాటు, ఇటు ఇంధనం కూడా ఆదా అవుతుండటంతో అందరూ ఎలక్ట్రిక్ సైకిళ్లను వినియోగిస్తున్నారు. దీంతో కంపెనీలు కూడా కొత్త కొత్త ఫీచర్లతో కూడిన ఎలక్ట్రిక్ సైకిళ్లను లాంచ్ చేస్తున్నాయి. ఇదే క్రమంలో ప్రముఖ విద్యుత్ వాహనాల తయారీ దారైన విర్టస్ మోటార్ సరికొత్త ఎలక్ట్రిక్ సైకిళ్లను లాంచ్ చేసింది. ఆల్ఫా ఏ, అల్ఫా ఐ పేరిట మన దేశ మార్కెట్లో అడుగుపెట్టిన ఈ ఎలక్ట్రిక్ సైకిళ్లలో ప్రత్యేకత ఏమిటంటే ఎల్సీడీ డిస్ ప్లే. బైక్ లు, స్కూటర్లలో లాగా దీనిలో స్క్రీన్ ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఏడో వార్షికోత్సవం సందర్భంగా..
విర్టస్ మోటార్స్ ఏడో వార్షికోత్సవం సందర్భంగా ఈ ఎలక్ట్రిక్ సైకిళ్లను కంపెనీ లాంచ్ చేసింది. వీటిని వినియోగదారుల ఫీడ్ బ్యాక్ తీసుకొని తయారు చేసినట్లు కంపెనీ ప్రకటించింది. దీనిలో ఫిక్స్ డ్ బ్యాటరీ ఉంటుంది. 8.0ఏహెచ్ సామర్థ్యంతో ఈ బ్యాటరీ ఉంటుంది. స్థిరమైన శక్తిని ఎక్కువకాలం అందిస్తుంది. ముందు వైపు డిస్క్ బ్రేకులు అందించారు. సింగిల్ స్పీడ్ డిజైన్ దీనిని తీసుకొచ్చారు.
ఫీచర్లు ఇవి..
ఈ సైకిళ్లలో సింగిల్ లెవల్ పెడల్ అసిస్టెంట్, థ్రోటిల్ ఉంటారు. ఇవి వినియోగదారుల అవసరాన్ని బట్టి మోడ్స్ ఈజీగా మార్చుకునేందుకు ఉపకరిస్తాయి. అలాగే వన్ టచ్ ఎల్సీడీ డిస్ ప్లే ఉంటుంది. ఇది రైడర్లకు రియల్ టైం సమాచారాన్ని అందిస్తుంది. తద్వారా రైడర్లకు ఇబ్బంది లేని వాతావరణాన్ని కల్పిస్తుంది. ఈ సందర్భంగా విర్టస్ కంపెనీ కో ఫౌండర్ అండ్ డైరెక్టర్ తుషార్ బజాజ్ మాట్లాడుతూ ఈ అల్ఫా ఏ, అల్ఫా ఐ ఎలక్ట్రిక్ సైకిళ్లు సంప్రదాయ సైకిళ్లకు, ఎలక్ట్రిక్ సైకిళ్లకు మధ్య ఉన్న ధరల వ్యత్యాసాన్ని గణనీయంగా తగ్గిస్తుందన్నారు.
ధర, లభ్యత..
విర్టస్ మోటార్స్ ఈ రెండు ఎలక్ట్రిక్ సైకిళ్లపై ప్రారంభ ఆఫర్ ను ప్రకటించింది. మొదట కొనుగోలు చేసే 50మంది వినియోగదారులకు ఒక్కొక్క సైకిల్ ను రూ. 15,999కే అందిస్తున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత మరో 100 మందికి రూ. 17,999కి విక్రయిస్తామని తెలిపింది. ఆ తర్వాత కొనుగోలు చేసేవారికి రూ. 19,999కి లాంచింగ్ ఆఫర్ కింద అందిస్తామని ఆ కంపెనీ వెల్లడించింది. అయితే ఈ సైకిల్ అసలు ధర రూ. 24,999గా ఉంది. ప్రస్తుతం ఈ ఎలక్ట్రిక్ సైకిళ్లను కంపెనీకి చెందిన అధికారిక వెబ్ సైట్ నుంచి మాత్రమే కొనుగోలు చేసే అవకాశం ఉంది. ప్రారంభ ఆఫర్ ముగిసిన తర్వాత ఈ-కామర్స్ ప్లాట్ ఫారంలు అయిన అమెజాన్, బజాబ్ మాల్.ఇన్ వంటి వెబ్ సైట్లతో పాటు వివిధ నగరాల్లోని పలు డీలర్లవద్ద కూడా విక్రయానికి ఉంచుతామని కంపెనీ ప్రకటించింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..