AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Electric Auto: ఇది కదా కావాల్సింది! కేవలం 15 నిమిషాల్లోనే బ్యాటరీ ఫుల్.. కొత్త ఎలక్ట్రిక్ ఆటో మామూలుగా లేదుగా..

కార్గో ఆటో కూడా ఎలక్ట్రిక్ వేరియంట్లో అందుబాటులోకి వచ్చింది. అల్టిగ్రీన్ అనే కంపెనీ ఎక్స్ పోనెంట్ ఎనర్జీతో కలిసి త్రీ వీలర్ కార్గో ఎలక్ట్రిక్ వాహనాన్ని లాంచ్ చేసింది. దీని పేరు ఎన్ఈఈవీ తేజ్. దీనిని అత్యాధునిక సాంకేతికతో ఈ ఏడాది జనవరిలో ఆవిష్కరించింది. దీనిలో అత్యద్భుతమైన టెక్నికల్ స్పెసిపికేషన్లు ఉన్నాయి. అడ్వాన్స్ డ్ టెక్నాలజీ, ఇంజినీరింగ్ పద్ధతులను దీని తయారీలో వాడారు.

Electric Auto: ఇది కదా కావాల్సింది! కేవలం 15 నిమిషాల్లోనే బ్యాటరీ ఫుల్.. కొత్త ఎలక్ట్రిక్ ఆటో మామూలుగా లేదుగా..
Neev Tez Electric Three Wheeler Cargo
Madhu
|

Updated on: Aug 11, 2023 | 4:15 PM

Share

ఇప్పటి వరకూ కార్లు, స్కూటర్లు, బైక్ లు, కొన్ని చోట్ల బస్సులు మాత్రమే ఎలక్ట్రిక్ వేరియంట్లో మన దేశంలో కనిపిస్తున్నాయి. అయితే ఇకపై ఆటోలు కూడా దర్శనమివ్వనున్నాయి. ఇప్పటికే పలు నగరాల్లో ప్యాసెంజర్ ఆటోలు ఎలక్ట్రిక్ వేరియంట్లో ఉన్నాయి. అయితే ఇప్పుడు కార్గో ఆటో కూడా ఎలక్ట్రిక్ వేరియంట్లో అందుబాటులోకి వచ్చింది. అల్టిగ్రీన్ అనే కంపెనీ ఎక్స్ పోనెంట్ ఎనర్జీతో కలిసి త్రీ వీలర్ కార్గో ఎలక్ట్రిక్ వాహనాన్ని లాంచ్ చేసింది. దీని పేరు ఎన్ఈఈవీ తేజ్. దీనిని అత్యాధునిక సాంకేతికతో ఈ ఏడాది జనవరిలో ఆవిష్కరించింది. దీనిలో అత్యద్భుతమైన టెక్నికల్ స్పెసిపికేషన్లు ఉన్నాయి. అడ్వాన్స్ డ్ టెక్నాలజీ, ఇంజినీరింగ్ పద్ధతులను దీని తయారీలో వాడారు. దీనిలోని అన్నింటి కన్నా దీనిలో ఆసక్తి దాయకమైన అంశం ఏమిటంటే దీనిలోని ర్యాపిడ్ చార్జింగ్ సదుపాయం. ఈ సదుపాయంతో కేవలం 15నిమిషాల్లోనే బ్యాటరీ ఫుల్ చార్జ్ చేయొచ్చని కంపెనీ ప్రకటించింది. ఈ ఎలక్ట్రిక్ ఆటోకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఎన్ఈఈవీ తేజ్ స్పెసిఫికేషన్స్..

అల్టిగ్రీన్ కంపెనీ ఆవిష్కరించిన ఈ త్రీ వీలర్ కార్గో వాహనం ఎన్ఈఈవీ 8.2 కిలోవాట్ అవర్ సామర్థ్యంతో బ్యాటరీతో వస్తుంది. ఎల్ఎఫ్పీ సెల్ కెమిస్ట్రీ సాయంతో కూడిన ఎక్స్ పోనెంట్ ఎనర్జీని దీని తయారీకి వినియోగించారు. దీనిలో 8.25 కిలో వాట్ల సామర్థ్యంతో కూడిని మోటార్ ఉంటుంది. ఇది45ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. దీని పొడవు 1920ఎంఎం, వెడల్పు 1590ఎంఎం, ఎంత్తు 1645ఎంఎం ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ 220ఎంఎం ఉంటుంది. ఇది 950 కేజీల బరువును సునాయాసంగా మోయగలుగుతుంది.

ఎన్ఈఈవీ తేజ్ ఫీచర్లు ఇవి..

దీనిలో రీజనరేటివ్ బ్రేకింగ్ టెక్నాలజీని వినియోగించారు. వాహనం నెమ్మదించినప్పుడు, బ్రేకులు వినియోగించినప్పుడు బ్యాటరీ ఆటోమేటిక్ గా రీచార్జ్ అవుతుంది. ఇది బ్యాటరీ రేంజ్ ను పెంచుతుంది. పలు సేఫ్టీ ఫీచర్లను కూడా దీనిలో జోడించారు. ట్యూబ్ లెస్ టైర్లు ఉంటాయి. దీని ద్వారా రోడ్డుపై ప్రయాణించేటప్పుడు మంచి గ్రిప్ ఇస్తుంది.

ఇవి కూడా చదవండి

ఫాస్ట్ చార్జింగ్..

ఈ ఎలక్ట్రిక్ ఆటో ప్రత్యేకత ఏమిటంటే ప్రపంచంలో ఫాస్టెస్ట్ చార్జింగ్ ఫీచర్ ఉంది. దీనిలో బ్యాటరీని మీరు కేవలం 15 నిమిషాల్లోనే సున్నా నుంచి 100శాతం చార్జ్ అవుతుంది. సింగిల్ చార్జ్ పై 98కిలోమీటర్ల రేంజ్ ఇది ఇస్తుంది. గరిష్టంగా గంటలకు 53 కిలోమీటర్ల వేగంతో ఈ ఎలక్ట్రకి్ ఆటో ప్రయాణింగచలుగుతుంది.

రెండు వేరియంట్లు.. ఈ త్రీ వీలర్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. హై డెక్, లో డెక్. హై డెక్ వేరియంట్ వాహనం పూర్తిగా మూసి వేసిన కంటైనర్ బాక్స్ తో ఉంటుంది. దీనిలో 20శాతం అధికంగా స్పేస్ ఉంటుంది.

ధర ఎంతంటే.. ఈ మూడు చక్రాల కార్గో ఆటో ప్రారంభ ధర మన దేశంలో రూ. 3,55,000గా ఉంది. దీని రాజీ లేని పనితీరు, తక్కువ మెయింటెనెన్స్ చార్జీలు మిమ్మిల్ని దీని వైపు చూడకుండా ఉండనివ్వదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..