Bank Charges: బ్యాంకులు బాదేస్తున్నాయ్ భయ్యా! ఏకంగా రూ. 35కోట్లు పిండేశాయిగా.. వివరాలు ఇవిగో!
ప్రధానంగా మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెనెన్స్ చార్జీలు, పరిమితికి మించి ఏటీఎం కార్డుల వినియోగం, ఎస్ఎంఎస్ సర్వీస్ చార్జీలు, లావాదేవీలు క్యాన్సలేషన్ లేదా రిజక్టెడ్ ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు బ్యాంకులు కొంత రుసుంను తీసుకుంటాయి. అయితే వాటి గురించి మనం పెద్దగా పట్టించుకోం. కానీ పలు పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు, అలాగే ఐదు ప్రధాన ప్రైవేటు సెక్టార్ బ్యాంకులు కలిపి 2018 నుంచి ఇప్పటి వరకూ రూ. 35 కోట్లను ఈ చార్జీల రూపంలో వసూలు చేశాయి.
బ్యాంకుల్లో చాలా సర్వీసులు మనకు అందుబాటులో ఉంటాయి. డిజిటల్ బ్యాంకింగ్ అందుబాటులోకి వచ్చాక ఫీచర్ల సంఖ్య కూడా బాగా పెరిగాయి. ఇది వరకూ బ్రాంచ్ కు వెళ్లి ఖాతాలు నిర్వహించాలంటే కష్టమయ్యేది. ఇప్పుడు అరచేతిలోని సెల్ ఫోన్ నుంచే అన్నీ చేసేసుకుంటున్నాం. దీంతో సర్వీస్ ల సంఖ్య ను బ్యాంకులు పెంచాయి. అయితే వీటిల్లో అన్ని ఉచితంగా బ్యాంకులు అందించవు. చార్జీలు వసూలు చేస్తాయి. అయితే గమనించకుండా మనం లావాదేవీలు నిర్వహిస్తుంటాం. కానీ మనకు తెలియకుండానే పలు బ్యాంక్ లు చార్జీలను మన ఖాతా నుంచి డిడక్ట్ చేసుకుంటాయి. వాటిల్లో ప్రధానంగా మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెనెన్స్ చార్జీలు, పరిమితికి మించి ఏటీఎం కార్డుల వినియోగం, ఎస్ఎంఎస్ సర్వీస్ చార్జీలు, లావాదేవీలు క్యాన్సలేషన్ లేదా రిజక్టెడ్ ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు బ్యాంకులు కొంత రుసుంను తీసుకుంటాయి. అయితే వాటి గురించి మనం పెద్దగా పట్టించుకోం. కానీ పలు పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు, అలాగే ఐదు ప్రధాన ప్రైవేటు సెక్టార్ బ్యాంకులు కలిపి 2018 నుంచి ఇప్పటి వరకూ రూ. 35 కోట్లను ఈ చార్జీల రూపంలో వసూలు చేశాయి. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ రాజ్యసభలో ప్రకటించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
రాజ్యసభలో సభ్యులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కరద్ రాతపూర్వకంగా ఇచ్చిన దానిలో ఈ వివరాలు ఉన్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ఐదు ప్రధాన ప్రైవేట్ రంగ బ్యాంకులు ( యాక్సిస్ బ్యాంక్ , హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ , ఇండస్‌ఇండ్ బ్యాంక్ , ఐసీఐసీఐ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్ ) రూ. 35కోట్లు పేర్కొన్నారు. వీటిలో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెనెన్స్ లేకపోవడంతో రూ. 21,000 కోట్లు, అనుమతికి మించి ఏటీఎం ద్వారా లావాదేవీల చేసిన దానికి ప్రతిగా రూ.8,000 కోట్లకు పైగా వసూలు చేసినట్లు చూపించారు. అలాగే ఎస్ఎంఎస్ చార్జీలు రూ.6,000 కోట్లకు వచ్చాయని కేంద్ర సహాయ మంత్రి వివరించారు.
అసలు బ్యాంకు చార్జీలు ఏంటి?
ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ నిర్వహించకపోవడం, ఉచిత లావాదేవీలకు మించి ఏటీఎంలను ఉపయోగించడం, పరిమితికి మించి నగదు డిపాజిట్ చేయడం వంటి వాటికి బ్యాంకులు చార్జీలు విధిస్తాయి.
- కనీస బ్యాలెన్స్ నిర్వహించడం (నెలవారీ సగటు బ్యాలెన్స్-ఎంఏబీ, లేదా సగటు నెలవారీ బ్యాలెన్స్-ఏఎంబీఅని పిలుస్తారు) అనేది కస్టమర్ ప్రతి నెలా తన ఖాతాలో నిర్వహించాల్సిన మొత్తం. ఇది మెట్రో నుంచి చిన్న నగరాలకు, గ్రామీణ ప్రాంతాలకు మారుతూ ఉంటుంది. ఇది ప్రతి నెలాఖరులో లెక్కిస్తారు. ఈ బ్యాలెన్స్‌ను నిర్వహించడంలో వైఫల్యం చెందితే పెనాల్టీలకు దారి తీస్తుంది. ఆయా బ్యాంకులను బట్టి మెట్రోలలో రూ. 3000 నుంచి రూ. 10,000, పట్టణ ప్రాంతాల్లో రూ. 2000 నుంచి రూ. 5000, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 500 నుంచి రూ. 1000 మధ్య యావరేజీ మంత్లీ బ్యాలెన్స్ ఉండాలి. లేకపోతే రూ.100 నుంచి రూ. 125 వరకూ చార్జీలు వసూలు చేస్తారు.
- అదనపు ఏటీఎం లావాదేవీకి సంబంధించిన చార్జీల గురించి మాట్లాడితే బ్యాంక్ కస్టమర్‌లు తమ సొంత బ్యాంకు ఏటీఎంల నుంచి ప్రతి నెలా ఐదు ఉచిత లావాదేవీలకు (ఆర్థిక, ఆర్థికేతర లావాదేవీలతో సహా) అర్హులు. వారు ఇతర బ్యాంక్ ఏటీఎంల నుండి నిర్ణీత సంఖ్యలో ఉచిత లావాదేవీలకు (ఆర్థిక, ఆర్థికేతర లావాదేవీలతో సహా) కూడా అర్హులు. మెట్రో సెంటర్లలో మూడు లావాదేవీలు, నాన్ మెట్రో సెంటర్లలో ఐదు లావాదేవీలు ఉచితంగా చేసుకోవచ్చు. అంతకు మించితే ఆ లావాదేవీలపై చార్జీలు పడతాయి. ఒక్కో లావాదేవీకి రూ.21 వసూలు చేస్తారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..