business ideas: రూ. 2లక్షల పెట్టుబడి చాలు.. నెలకు రూ. 10లక్షల వరకూ ఆదాయం.. ఈ బిజినెస్‌లో కష్టం తక్కువ.. లాభం ఎక్కువ.. ట్రై చేయండి..
ఉద్యోగాలు చేసి విసిగిపోయారా? చాకిరి ఎక్కువ రాబడి తక్కువ అని భావిస్తున్నారా? తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి, మంచి రాబడులు వచ్చే ఏదైనా వ్యాపారం చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ కథనం మీ కోసమే. అతి తక్కువ పెట్టుబడితో మీరు నెలకు రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకూ సంపాదించే అవకాశం ఉంటుంది. ఆ బిజినెస్ ఐడియా ఎంటంటే అమూల్ ఫ్రాంచైజీ. అవునండి నిజమే చాలా సులువుగా అమూల్ ఫ్రాంచైజీ తీసుకోవచ్చు.

ఉద్యోగాలు చేసి విసిగిపోయారా? చాకిరి ఎక్కువ రాబడి తక్కువ అని భావిస్తున్నారా? తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి, మంచి రాబడులు వచ్చే ఏదైనా వ్యాపారం చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ కథనం మీ కోసమే. అతి తక్కువ పెట్టుబడితో మీరు నెలకు రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకూ సంపాదించే అవకాశం ఉంటుంది. ఆ బిజినెస్ ఐడియా ఎంటంటే అమూల్ ఫ్రాంచైజీ. అవునండి నిజమే చాలా సులువుగా అమూల్ ఫ్రాంచైజీ తీసుకోవచ్చు. అంతేకాక అతి తక్కువ ధర రూ. 2లక్షలతోనే ఫ్రాంచైజీని తీసుకొని, ఈజీగా నడపవచ్చు. ఎందుకంటే అమూల్ అనేది అందరికీ తెలిసిన బ్రాండ్ కొత్తగా బ్రాండ్ ప్రమోషన్ చేయాల్సిన అవసరం లేదు. అందరికీ పరిచయం ఉన్న అమూల్ ఉత్పత్తులను సులభంగా విక్రయించవచ్చు. అప్పుటు ఆటోమేటిక్ గా సేల్స్ పెరుగుతాయి. లాభాలు కూడా వస్తాయి. ఈ అమూల్ ప్రాంచైజ్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పడు చూద్దాం..
రెండు ఆప్షన్లు.. అమూల్ ఫ్రాంచైజీలు రెండు రకాలుగా ఉంటాయి. రూ. 2 లక్షల ప్రారంభ పెట్టుబడి ఒక ఆప్షన్ అయితే, రూ. 5లక్షల వరకూ పెట్టుబడితో ఉండేది రెండో ఆప్షన్. మీరు ఏది ఎంపిక చేసుకున్నా ఇబ్బంది ఉండదు.
అధిక కమీషన్.. మీరు అమూల్ బిజినెస్ ఫ్రాంచైజీతో అధిక కమీషన్ ను పొందుతారు. ఉదాహరణకు, మీరు పాల ప్యాకెట్లను విక్రయిస్తే ప్రతి పాలప్యాకెట్ పై 2.5 శాతం, పాల ఉత్పత్తులను అమ్మితే వాటిపై 10 శాతం, ఐస్ క్రీమ్ విక్రయాలపై 20 శాతం కమీషన్ పొందుతారు. ఇంకా, మీరు రెసిపీ ఆధారిత ఐస్ క్రీమ్‌లు, షేక్‌లు, పిజ్జాలు, శాండ్‌విచ్‌లు, హాట్ చాక్లెట్ డ్రింక్స్‌ను కూడా ఏర్పాటు చేసుకుంటే.. వాటిపై ఏకంగా 50 శాతం వరకూ కమీషన్‌ను అందుకుంటారు.
స్థలం.. మీ అమూల్ బిజినెస్ ఫ్రాంచైజ్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి, మీకు అమూల్ అవుట్‌లెట్ కోసం సుమారు 150 చదరపు అడుగుల స్థలం అవసరం. ఒకవేళ మీరు ఐస్ క్రీమ్ పార్లర్ ఫ్రాంచైజీని ప్రారంభించాలని చూస్తున్నట్లయితే, మీకు దాదాపు 300 చదరపు అడుగుల స్థలం అవసరం అవుతుంది. దానిని సమకూర్చుకుంటే ఫ్రాంచైజీ అనుమతులు సులభంగా దొరకుతాయి.
దరఖాస్తు ప్రక్రియ.. అమూల్ బిజినెస్ ఫ్రాంచైజీ కోసం దరఖాస్తు చేయడానికి మీరు అమూల్ అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించాలి. దానిలో ఫ్రాంచైజ్ అవకాశాలకు సంబంధించిన అన్ని సంబంధిత సమాచారాన్ని అన్వేషించాలి. అలాగే రిటైల్@అమూల్.కూప్ ద్వారా కూడా వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే అమూల్ డిస్ట్రిబ్యూటర్‌గా నియామకం కోసం, డిస్ట్రిబ్యూటర్‌షిప్ కోసం అన్ని రకాల విచారణల కోసం మీరు అమూల్ అధికారిక కస్టమర్ కేర్ (022) 6852666కు కాల్ చేయవచ్చు. ఇవి కాక మరే ఇతర మార్గాల్లోనూ తాము దరఖాస్తులు తీసుకోమని అమూల్ సంస్థ ప్రకటించింది.
రీఫండబుల్ అమౌంట్.. ఒప్పందంపై సంతకం చేసే సమయంలో జీసీఎంఎంఎఫ్ లిమిటెడ్ పేరుతో చెక్కు లేదా డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో మాత్రమే రూ. 25,000 రిఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్‌ను అమూల్ సంస్థకు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని సంస్థ తన సైట్ లో పేర్కొంది. అయితే అది ఫ్రాంచైజీ ప్రారంభించాలనుకునే వారు వ్యక్తిగతంగా కాబోయే భాగస్వాములను కలుసుకుని, నిర్ణీత ధ్రువీకరణ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత మాత్రమే చెల్లింపులు చేయాలని సూచిస్తోంది. అయితే అమూల్ డిస్ట్రిబ్యూటర్ మారేందుకు అయితే ఎటువంటి చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదని, అలాగే తాము ఆర్టీజీఎస్ లేదా ఎన్ఈఎఫ్టీ ద్వారా ఎటువంటి చెల్లింపులు తీసుకోమని అమూల్ తన వెబ్ సెట్లో వివరించింది.
ప్రచారం అవసరం లేదు.. అమూల్ బిజినెస్ ఫ్రాంచైజీతో అధిక ఆదాయం సంపాదించే అవకాశం ఉంది. అమూల్ అనేది దేశ వ్యాప్తంగా మంచి పేరున్న బ్రాండ్. అందరికీ విశ్వసనీయమైనది కూడా. ప్రధాన నగరాలు, చిన్న పట్టణాల్లో ఇప్పటికే విస్తృత స్థాయిలో తన వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దీంతో మీరు ఫ్రాంచైజీ పెట్టినా ఎక్కువ ప్రచారం చేసుకోవాల్సిన అసవరం ఉండకపోవచ్చు. పరిచయం ఉన్న బ్రాండ్ నేమే కాబట్టి వ్యాపారం వృద్ధి బాగుంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..