AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vande Bharat Express: వచ్చే ఏడాదిలో వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ లాంచ్.. వాటి ప్రత్యేకతలు ఏంటంటే?

భారతదేశంలోని ప్రజలు ఇటీవల కాలంలో వందేభారత్ రైలు ప్రయాణాన్ని ఇష్టపడుతున్నారు. ఇలాంటి వారికి భారతీయ రైల్వేలు శుభవార్తను అందించాయి. 2025-26 సంవత్సరానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నయి. ఈ రైళ్లు సుదూర ప్రయాణాలకు సరికొత్త సౌకర్యాన్ని అందిస్తాయి. ఈ నేపథ్యంలో వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

Vande Bharat Express: వచ్చే ఏడాదిలో వందే భారత్ స్లీపర్ ట్రైన్స్ లాంచ్.. వాటి ప్రత్యేకతలు ఏంటంటే?
Vande Bharat Sleeper
Nikhil
|

Updated on: Nov 17, 2024 | 6:00 PM

Share

భారతీయ రైల్వేలు 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి 10 కొత్త వందే భారత్ స్లీపర్ రైళ్లను ప్రారంభించాలని యోచిస్తోంది. ఈ రైళ్లు ప్రపంచ స్థాయి సౌకర్యాలు, త్యుత్తమమైన ఇంటీరియర్‌లను కలిగి ఉంటాయని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. భారతదేశపు మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైళ్లు అవసరమైన టెస్టులు, ట్రయల్ రన్ తర్వాత 2025లో ప్రారంభించే అవకాశం ఉంది. ఐసీఎఫ్ చెన్నై జనరల్ మేనేజర్ యు.సుబ్బారావు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఈ రైళ్ల టెస్టింగ్ ఇప్పటికే ప్రారంభమైందని, రెండు నెలల పాటు ట్రయల్స్ తర్వాత బిజినెస్ సర్వీసెస్ కోసం ఇస్తామని పేర్కొన్నారు. ఇటీవల ఈ రైళ్లను తయారు చేస్తున్న బీఈఎంఎల్ చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)కి మొదటి వందే భారత్ స్లీపర్ రైలు సెట్‌ను డెలివరీ చేసింది. 

భారతీయ రైల్వేలు ఈ కొత్త స్లీపర్ రైళ్ల కోసం కచ్చితమైన రూట్స్‌ను ఇంకా ప్రకటించనప్పటికీ మొదటి కొన్ని సర్వీసులు న్యూ ఢిల్లీ నుంచి పూణే, న్యూఢిల్లీ నుంచి శ్రీనగర్ వంటి ప్రధాన నగరాలను కలుపుతాయని భావిస్తున్నారు.వందే భారత్ స్లీపర్ రైళ్లు ప్రయాణాన్ని సురక్షితంగా, మరింత సౌకర్యవంతంగా ఉండేలా రూపొందించారు. సురక్షితమైన, వేగవంతమైన, సుదూర ప్రయాణాన్ని సులభతరం చేయడానికి పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి ఈ రైళ్లు రూపొందించారు. 

ఆస్టెనిటిక్ స్టెయిన్‌లెస్ స్టీల్‌తో నిర్మించిన ఈ రైళ్లు అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణీకులను రక్షించడానికి క్రాష్ బఫర్‌లు, ప్రత్యేకంగా రూపొందించిన కప్లర్‌లతో సహా అధునాతన భద్రతా లక్షణాలను కలిగి ఉంటాయి. 16 కోచ్‌లతో వచ్చే ఈ రైళ్ల ద్వారా 823 మంది వరకు ప్రయాణీకులను తీసుకువెళ్లగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇందులో ఫస్ట్-క్లాస్ ఏసీ, 2-టైర్ ఏసీ, 3-టైర్ ఏసీ వంటి అనేక రకాల ప్రయాణ తరగతులను అందుబాటులో ఉంటాయి.  

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి