Vande Bharat Sleeper Train: గుడ్‌న్యూస్.. తెలుగు రాష్ట్రాలకు కొత్తగా వందే భారత్ స్వీపర్ రైళ్లు.. చౌక ధరల్లోనే!
దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన వందే భారత్ రైలు అభిమానులకు శుభవార్త తెలిపింది రైల్వే. వందే భారత్ విజయవంతమైన తర్వాత, రైల్వేలు త్వరలో ప్రజలకు వందే భారత్ స్లీపర్ కానుకగా ఇవ్వబోతున్నాయి. ఆగస్టు 15 నుంచి అనేక రూట్లలో వందే భారత్ స్లీపర్ రైళ్లను నడిపే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆగస్టు నుండి వందే భారత్ కొత్త స్లీపర్ సర్వీసులను ప్రారంభించనున్నట్లు..
దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన వందే భారత్ రైలు అభిమానులకు శుభవార్త తెలిపింది రైల్వే. వందే భారత్ విజయవంతమైన తర్వాత, రైల్వేలు త్వరలో ప్రజలకు వందే భారత్ స్లీపర్ కానుకగా ఇవ్వబోతున్నాయి. ఆగస్టు 15 నుంచి అనేక రూట్లలో వందే భారత్ స్లీపర్ రైళ్లను నడిపే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆగస్టు నుండి వందే భారత్ కొత్త స్లీపర్ సర్వీసులను ప్రారంభించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (SCR) అధికారులు తెలిపారు. వందే భారత్ స్లీపర్ రైళ్లను ఏయే రూట్లలో నడవనున్నాయో తెలుసుకుందాం.
వందే భారత్ ఈ మార్గాల్లో నడుస్తుందా?
టైమ్స్ నివేదిక ప్రకారం, దక్షిణ మధ్య రైల్వే అధికారులు కాచిగూడ – సికింద్రాబాద్ స్టేషన్ల నుండి వందే భారత్ స్లీపర్ రైళ్లను నడపాలని ప్రతిపాదించారు. కాచిగూడ-విశాఖపట్నం, కాచిగూడ-తిరుపతి, సికింద్రాబాద్-పుణె వంటి రద్దీ రూట్లలో కొత్త వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపాలని అధికారులు కోరుతున్నారు. కొత్త వందే భారత్ స్లీపర్ రైలులో 16 కోచ్‌లు ఉంటాయి. ఈ రైళ్లు రాత్రిపూట కూడా నడుస్తాయి. ఇందులో ఏసీ, నాన్ ఏసీ కోచ్‌లు ఉండనున్న సంగతి తెలిసిందే. టికెట్ ధరలు అందరికీ అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Indian Railways: అత్యవసర సమయాల్లో రిజర్వేషన్ ట్రైన్ టికెట్ పొందడం ఎలా?
వందే భారత్ స్లీపర్ వేగం ఎలా ఉంటుంది?
కొత్త వందే భారత్ స్లీపర్ గరిష్టంగా గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడిచే అవకాశం ఉంది. అలాగే దీని డిజైన్ దాదాపు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను పోలి ఉంటుంది. ఈ రైలులో మొత్తం 16 కోచ్‌లలో ప్రయాణికులకు 823 బెర్త్‌లు ఉంటాయని చెబుతున్నారు. ఈ రైలులో ప్రయాణీకులకు విమానం లాంటి సౌకర్యాలు కల్పిస్తారు. భోజనం, తాగునీరు అందించేందుకు చిన్నగది ఉంటుంది. వెలుపలి భాగంలో ఆటోమేటిక్ డోర్, వాసన లేని టాయిలెట్ ఉంటాయి. ఈ రైలు కోచ్‌లు పూర్తిగా సౌండ్ ప్రూఫ్‌గా ఉంటాయి. ప్రయాణ సమయంలో ప్రయాణీకులకు మంచి నిద్ర కోసం సౌకర్యాన్ని అందిస్తాయి.
ఇది కూడా చదవండి: Vande Bharat: వందేభారత్ రైలులోకి వర్షపు నీరు.. వీడియో వైరల్.. రైల్వే ఏం చెప్పిందంటే..
త్వరలో వందే భారత్ మెట్రోను రైల్వే శాఖ ప్రారంభం
సమీపంలోని నగరాలను కలుపుతూ వందే భారత్ మెట్రో సర్వీసును ప్రారంభించాలని రైల్వే శాఖ యోచిస్తోంది. ఈ రైళ్లు కాన్పూర్-లక్నో, ఢిల్లీ-మీరట్, ముంబై-లోనావాలా, వారణాసి-ప్రయాగ్‌రాజ్, పూరి-భువనేశ్వర్ మరియు ఆగ్రా-మథుర మధ్య నడిచే అవకాశం ఉంది. ఒక్కో కోచ్‌లో 250 మంది సులభంగా ప్రయాణించవచ్చని చెబుతున్నారు. వందే భారత్ మెట్రో రైలు ట్రయల్ రన్‌ను త్వరలో రైల్వే నిర్వహించనుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి